Happy Independence day 2024: స్వతంత్రం, స్వేచ్ఛ.. ఇవి భారతీయులకు దక్కాయంటే దాని వెనుక ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగం ఉంది. భారతదేశం స్వాతంత్ర్య వెనుక రెండు వందల ఏళ్ల పాటు సాగిన నిశ్శబ్ధ యుద్ధం ఉంది. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, రాణి లక్ష్మీబాయి, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి, లాలా లజపతిరాయ్... ఇలా ఎంతో మంది తమ జీవితాలను పణంగా పెట్టి భారతదేశానికి స్వేచ్ఛను ప్రసాదించారు.తమ పోరాటంలో ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్ష పెంచేందుకు ఉత్తేజపరిచే ప్రసంగాలను చేశారు. ఆ ప్రసంగాలలో ఎంతో స్పూర్తివంతమైన నినాదాలను ఇచ్చారు. ఆ నినాదాలు భారతీయుల్లో సమరోత్సాహాన్ని పెంచాయి. మరెంతోమంది స్వాతంత్య్రోద్యమంలో అడుగుపెట్టేలా చేశాయి. ఇప్పటికీ ఈ నినాదాలు స్పూర్తి రగిలించేవే.