World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు-these are also symptoms of high blood pressure but many people do not know about it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

Haritha Chappa HT Telugu
May 16, 2024 12:13 PM IST

World Hypertension Day 2024: హైపర్ టెన్షన్ ను 'సైలెంట్ కిల్లర్' అని అంటారు. ఎందుకంటే మీకు తెలియకుండానే అధిక రక్తపోటు బారిన పడే అవకాశం ఉంది. కొన్ని లక్షణాల ద్వారా హైబీపీ వచ్చిన సంగతి తెలుసుకోవచ్చు.

ప్రపంచ అధికరక్తపోటు దినోత్సవం
ప్రపంచ అధికరక్తపోటు దినోత్సవం (Unsplash)

World Hypertension Day 2024: అధిక రక్తపోటు లేదా హై బీపీను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది వచ్చిన సంగతి కూడా వ్యక్తులు కనిపెట్టలేకపోవచ్చు. నిజానికి హైబీపీ కొన్ని లక్షణాలను చూపిస్తుంది. ఆ లక్షణాలపై అవగాహన లేక హైబీపీ బాగా ముదిరిపోయాకే దాన్ని గుర్తిస్తారు. హైబీపీ ఉంటే గుండె ఆరోగ్యం, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం వంటి వాటిని ప్రభావితం చేస్తుంది. మీ రక్త నాళాలలో పీడనం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు (140/90 లేదా అంతకంటే ఎక్కువ) అధిక రక్తపోటు కింద లెక్కేస్తారు. మీ రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మీ జీవితంలో భాగం చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, ఆల్కహాల్, పొగాకు మానేయడం, ఒత్తిడి లేకుండా జీవించడం వంటి వాటి అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. అధిక రక్తపోటుపై అవగాహన కల్పించేందుకే ప్రతి ఏడాది మే 17న ‘వరల్డ్ హైపర్ టెన్షన్ డే’ నిర్వహించుకుంటారు.

అధిక రక్తపోటు సైలెంట్ లక్షణాలు

అధిక రక్తపోటు కొన్ని రకాల లక్షణాలను చూపిస్తుంది. కొంతమంది ఆ లక్షణాలేంటో కూడా తెలియవు. అందుకే వ్యాధి ముదిరాకే వైద్యులు వద్దకు వెళుతున్నారు. అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన హైబీపీ లక్షణాలు ఇవన్నీ.

1. తలనొప్పి: తరచుగా తలనొప్పి అధిక రక్తపోటు రావడానికి ప్రారంభ హెచ్చరిక అనుకోవాలి. ఈ తలనొప్పి సాధారణంగా తల రెండు వైపులా వస్తుంది.

2. మీ దృష్టితో సమస్యలు: దీర్ఘకాలికంగా అధిక రక్తపోటు ఉంటే కళ్ళలోని రక్త నాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల అస్పష్టమైన దృష్టి, డబుల్ దృష్టి వంటి సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు రెటీనాకు నష్టం కలిగిస్తుంది, దీనిని రక్తపోటు రెటినోపతి అంటారు. చికిత్స చేయకపోతే, ఇది తీవ్రమైన దృష్టి సమస్యలను కలిగిస్తుంది.

3. ముక్కు బ్లీడింగ్: కొంతమంది వ్యక్తులలో తరచూ ముక్కు నుంచి రక్తం కారుతుంది. తరచూ ముక్క నుంచి రక్తం కారడం అనేది అధిక రక్తపోటు కారణమని చెప్పుకోవాలి. ముక్కులోని పలుచని రక్త నాళాలు చీలిపోయి, ఇలా తరచుగా నోస్ బ్లీడ్ అవుతుంది.

4. శ్వాస ఆడకపోవడం: అధిక రక్తపోటు మీ గుండెపై ఒత్తిడికి దారితీస్తుంది, ఎందుకంటే అధిక రక్తపోటు వల్ల గుండెకు రక్తం సరిగా పంప్ కాదు. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలుగుజేస్తుంది. ఊపిరితిత్తులలో ద్రవం ఏర్పడటానికి దారితీస్తుంది. కొద్దిగా శ్రమించినా కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంది.

5. అలసట: తీవ్రమైన అలసట అధిక రక్తపోటుకు సంకేతం. రక్తపోటు రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేసేందుకు తీవ్రంగా గుండె కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్, పోషక సరఫరాను తగ్గిస్తుంది.

6. క్రమరహిత హృదయ స్పందన: అరిథ్మియా అంటే గుండె కొట్టుకునే వేగంలొ మార్పు రావడం. అరిథ్మియా కూడా హైబీపీ లక్షణాలే. అసాధారణ గుండె లయలకు రక్తపోటు పెరగడమే కారణం.

7. మూత్రపిండాల పనితీరు క్షీణించడం: అధిక రక్తపోటు మూత్రపిండాలను నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది.

పై లక్షణాలు ఏవైనా మీలో కనిపిస్తే తేలికగా తీసుకోకూడదు. ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోండి. రక్తపోటును ముందుగానే గుర్తిస్తే వైద్యులను కలిసి తగిన మందులు వాడాలి.

Whats_app_banner