గర్భధారణ సమయంలో నడుము నొప్పిని తగ్గించడానికి 5 యోగా ఆసనాలు!
కాబోయే తల్లులకు యోగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే గర్భం అనేది చాలా సున్నితమైన దశ కావున యోగా ఆసనాలను చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భం సమయంలో వెన్ను నొప్పి నుండి ఉపశమనం పొందడానికి చేయాల్సిన యోగా ఆసనాల గురించి తెలుసుకుందాం.
ఆరోగ్యంగా ఉండాలంటే యోగా మంచి సాధానం. ప్రతి రోజు యోగ చేయడం వల్ల శరీరాన్ని దృఢంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా గర్భీణి స్త్రీలకు అత్యంత ఆరోగ్యకరమైన వ్యాయామం, కాబోయే తల్లులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే గర్భం అనేది చాలా సున్నితమైన దశ కావున యోగా ఆసనాలను చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భం చివరిలో వెన్నునొప్పి చాలా సాధారణంగా ఉంటుంది. ఈ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఆ సమయంలో గర్భిణీలు చేయాల్సిన యోగా ఆసనాల గురించి తెలుసుకుందాం. ఇవి బొడ్డుపై ఒత్తిడి పాటు, వెన్నునొప్పిని తగ్గిస్తుంది. అలాగే ప్రసవానికి తల్లిని సిద్ధం చేయడంలో సహాయపడతుంది.
గర్భధారణ సమయంలో వెన్నునొప్పి కోసం యోగా ఆసనాలు
భుజంగాసనం: భుజంగాసనాన్ని కోబ్రా భంగిమ అని కూడా పిలుస్తారు, తల్లి తన కడుపుపై పడుకుని, నాగుపాము భంగిమలో తన చేతులతో తన మధ్యభాగాన్ని పైకి ఎత్తాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి మరియు అలసట నుండి మనస్సు, శరీరాన్ని ఉపశమనం చేస్తుంది.
బలాసనా: భుజంగాసనం పిల్లల భంగిమ అని కూడా పిలుస్తారు, ఇది తొడలు, తుంటి ప్రాంతాన్ని సులువుగా తెరవడానికి సహయపడుతుంది. ఇది మెదడుకు విశ్రాంతినిస్తుంది. శరీరానికి ఆక్సిజన్‌ను బాగా అందిస్తుంది. ఈ ఆసనంలో, మోకాళ్లపై కూర్చుని, నెమ్మదిగా ముందుకు వంగి, తన చేతులను మొత్తం వెనుక భాగాన్ని విస్తరిస్తూ ముందుకు వంగాలి.
ఉత్కట కోనాసనం: ఉత్కట కోనాసనాన్ని దేవత భంగిమ అని కూడా పిలుస్తారు, దీనిలో తల్లి కాళ్ళు వెడల్పుగా, ఆమె పాదాలు బయటికి ఉంటాయి. ఈ ఆసనం వెన్నునొప్పిని తగ్గిస్తుంది, తుంటి మరియు పెల్విక్ ప్రాంతానికి విశ్రాంతినిస్తుంది.
వృక్షాసనం: వృక్షాసనాన్ని చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఆసనం ఒక కాలు మీద నిలబడి, మరొక కాలును వంచి, పాదాల దిగువ భాగాన్ని తొడకు వ్యతిరేకంగా ఉంచాలి. ఆ తర్వాత శ్వాస తీసుకుంటూ కుడిపాదాన్ని ఎడమకాలు తొడకింద ఉంచాలి. అనంతరం మీ మొత్తం శరీరాన్ని విస్తరించండి. పదే కాళ్ళను మారుస్తూ అసనాన్ని పునరావృతం చేయండి. ఈ ఆసనం మొత్తం శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.
మార్జిరియాసనం లేదా బిటిలాసనం (క్యాట్ కౌ) : క్యాట్ - కౌ భంగిమ అని కూడా పిలువబడే ఈ ఆసనం రెండు ఇతర ఆసనాల మధ్య పరివర్తన భంగిమగా పనిచేస్తుంది. దిగువ, ఎగువ, మధ్య వెన్ను నొప్పికి అద్భుతంగా పని చేస్తుంది. 5 ఉచ్ఛ్వాసాలు, నిశ్వాసలతో ఈ ఆసనాన్ని సాధన చేయండి.
సంబంధిత కథనం
టాపిక్