Soybean, Baby Potatoes Biryani Recipe : సోయాబీన్, బేబి పొటాటోస్ బిర్యానీ.. ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలంటే..-tasty and simple soybean and baby potatoes biryani recipe is here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Soybean, Baby Potatoes Biryani Recipe : సోయాబీన్, బేబి పొటాటోస్ బిర్యానీ.. ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలంటే..

Soybean, Baby Potatoes Biryani Recipe : సోయాబీన్, బేబి పొటాటోస్ బిర్యానీ.. ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలంటే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 05, 2023 12:45 PM IST

Soybean and Baby Potatoes Biryani Recipe : మీరు వెజిటేరియన్ అయితే మీకోసం ఇక్కడో టేస్టీ బిర్యానీ రెసిపీ ఉంది. సోయాబీన్, బేబి బంగాళదుంపలతో తయారు చేసే ఈ బిర్యానీ మీ ఫుడ్ క్రేవింగ్స్​కు​ బ్రేక్ ఇస్తుంది. మరి దీనిని ఎలా తయారు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

సోయాబీన్, బేబీ పొటాటోస్ బిర్యానీ
సోయాబీన్, బేబీ పొటాటోస్ బిర్యానీ

Soybean and Baby Potatoes Biryani Recipe : అద్భుతమైన శాఖాహారాన్ని తినాలి అనుకుంటే.. మీరు కచ్చితంగా బేబికార్న్, బంగాళదుంపలతో తయారు చేసే బిర్యానీని ట్రై చేయాల్సిందే. ఇది మీకు టేస్ట్​ని ఇవ్వడంతో పాటు.. మీరు చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇంత ఈ రెసిపికి కావాల్సిన పదార్థాలు ఏమటి? ఎలా దీనిని తయారు చేయాలో వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* బాస్మతి రైస్ - 2 కప్పులు

* కొబ్బరి పాలు - 1 కప్పు

* సోయాబీన్ - 1/2 కప్పు

* బేబీ పొటాటోస్ - 10

* ఉల్లిపాయలు - 4 (మీడియం)

* టొమాటోలు - 3 (మీడియం)

* కరివేపాకు - 1 రెబ్బ

* కొత్తిమీర - గార్నిష్ కోసం

* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు

* నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

* ఆవాల నూనె - 2 టేబుల్ స్పూన్లు

* నీళ్లు - 2.5 కప్పులు (బిర్యానీ రైస్ కోసం)

* నీళ్లు - సోయా, బియ్యం నానబెట్టడానికి

మసాలాలు..

* వెల్లుల్లి - 6-7

* బే ఆకులు - 2

* స్టార్ సోంపు - 1

* నల్ల ఏలకులు - 2

* ఆకుపచ్చ ఏలకులు - 4

* ఎండు మిర్చి - 4

* జీలకర్ర - 1 tsp

* ఆవాలు - 1 tsp

* పచ్చి మిర్చి - 4

పొడి మసాలాలు

* ధనియా పొడి - 2 టేబుల్ స్పూన్లు

* గరం మసాలా - 2 tsp

* కిచెన్ కింగ్ మసాలా - 1 tsp

* ఆమ్చూర్ పొడి - 1tsp

* ఉప్పు - రుచికి తగినంత

సోయాబీన్, బేబీ పొటాటోస్ బిర్యానీ తయారీ విధానం

ముందుగా సోయాబీన్ పూర్తిగా మెత్తబడే వరకు వేడినీటిలో నానబెట్టండి. అనంతరం వాటి నుంచి నీటిని తీసి పక్కన పెట్టండి. బియ్యాన్ని బాగా కడిగి.. గది ఉష్ణోగ్రత వద్ద 20 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు బేబీ బంగాళాదుంపలను సగానికి ముక్కలు చేయండి. సాధారణ బంగాళదుంపలను ఘనాలగా కట్ చేసుకోండి. స్కిన్ రిమూవ్ చేయకండి. ఉల్లిపాయలను సన్నగా కోసి.. టొమాటోలను చిన్నగా కోయాలి.

ఇప్పుడు ఒక పెద్దగిన్నెను తీసుకుని.. దానిలో నూనె వేసి వేడిచేయండి. దానిలో బంగాళాదుంపలను వేసి.. వేయించండి. కనీసం పెద్ద మంటపై 3-4 నిమిషాల వరకు అలాగే వేయించండి. అనంతరం వాటిని తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే గిన్నెలో నెయ్యి వేసి.. మొత్తం మసాలా దినుసులను వేయండి. 1 నిమిషం పాటు దానిని బాగా కలపండి. దానిలో వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 3 నిమిషాలు ఉడికించాలి. టొమాటోలు, కరివేపాకు, ఉప్పు, అన్ని పొడులు వేసి బాగా కలపాలి. తక్కువ మంట వేయిస్తూ.. దానిలో నానబెట్టిన బియ్యాన్ని నీరు వడకట్టి వేయాలి. వేయించిన మసాలాలు బియ్యంలో బాగా కలిసేలా కలపాలి.

ఇప్పుడు వేయించిన బంగాళదుంపలు, సోయాబీన్ వేసి కలపాలి. కొబ్బరి పాలు వేసి బాగా కదిలించండి. అనంతరం నీరు వేసి బాగా కలపాలి. ఈ సమయంలో మీ ఎంపిక ప్రకారం ఉప్పు లేదా ఏదైనా ఇతర మసాలాను సర్దుబాటు చేయండి. బిర్యానీని ఉడకబెట్టండి. ఉడకడం ప్రారంభమైన తర్వాత.. ఒక భారీ మూతతో కప్పి, తక్కువ మంటపై 10-15 నిమిషాలు ఉడికించాలి. సర్వ్ చేసే ముందు మంటను ఆపి 10 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోండి. మీకు ఇష్టమైన రైతాతో, కొద్దిగా నెయ్యి వేసి వేడిగా లాగించేయవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం