Sunday Motivation : బాధించే గతానికి Ctrl+Alt+Del కొట్టేయండి.. కొత్తగా ప్రారంభించండి-sunday motivation on prepare for new year with new goals ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Motivation : బాధించే గతానికి Ctrl+alt+del కొట్టేయండి.. కొత్తగా ప్రారంభించండి

Sunday Motivation : బాధించే గతానికి Ctrl+Alt+Del కొట్టేయండి.. కొత్తగా ప్రారంభించండి

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 01, 2023 06:30 AM IST

Sunday Motivation : లైఫ్​లో ఎన్నో కొత్త సంవత్సరాలు వస్తాయ్.. పోతాయ్. కానీ మీరు ఈ ఇయర్​లో ఏమి చేశారు.. తర్వాత సంవత్సరంలో ఏ ప్లానింగ్​తో ముందుకు పోవాలని అనుకుంటున్నారు? పరిస్థితులు, వ్యక్తుల మధ్య వ్యత్యాసం గుర్తించగలుగుతున్నారో లేదో తెలుసుకోండి. లేదంటే ఉన్నామంటే ఉన్నాం అన్నట్లుగానే లైఫ్ వెళ్తుంది. దానిలో కొత్తదనమేమి ఉండదు.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Sunday Motivation : గత సంవత్సరం ఎలా గడిచినా.. కొత్త సంవత్సరానికి మాత్రం తప్పకుండా సిద్ధంకండి. ఏం ప్లాన్ చేసినా.. చేయకపోయినా.. గతంలో చేసిన మిస్టెక్స్ మాత్రం రిపీట్ చేయకుండా జాగ్రత్త పడండి. అదే మీరు జీవితంలో సాధించే అతి పెద్ద అచీవ్​మెంట్. మనం ఏమి చేసినా.. చేయకపోయినా.. కొత్త సంవత్సరం కచ్చితంగా కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది. కాబట్టి కొత్త లక్ష్యాలను సెట్ చేసుకోవడానికి.. కొత్తగా ఏదైనా సాధించడానికి గోల్స్ పెట్టుకోవాలి అంటే ఇదే మంచి తరుణం.

గడిచిన సంవత్సరంలో మీరు చేసినా బెస్ట్, వరెస్ట్ పనులేంటో గుర్తించి.. వాటిపై ఓ అంచనాకు రండి. ఇది మీ కొత్త సంవత్సరాన్ని ఏ విధంగా ప్రారంభించాలో మీకు చూపిస్తుంది. మీరు సాధించిన ఘనతలతో పాటు.. మీ తప్పులను కూడా గుర్తించండి. ఇలా చేయడం వల్ల మీపై మీకు ఓ క్లారిటీ వస్తుంది. జీవితంలో, మీరు అనుకున్నది సాధించడంలో ఎంత దూరం వచ్చారో తెలుసుకోవడంలో సహాయం చేస్తుంది. భవిష్యత్తులో మరింత మెరుగ్గా ముందుకు వెళ్లేలా మిమ్మల్ని ప్రోత్సాహిస్తుంది.

మరీ ముఖ్యంగా మనం కొన్ని విషయాలతో ట్రావెల్ చేస్తూనే ఉంటాము. ఎంత కాదు అనుకున్నా అవి మన మైండ్​నుంచి బయటకు పోవు. మీ మనసును కరాబ్ చేసే అంశాలను Ctrl+Alt+Del కొట్టేయండి. గతంలో జరిగిపోయిన వాటిని ఎలాగో మార్చలేము. కానీ ఇప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ.. ఆ గతాన్ని తవ్వుకోవడం కరెక్ట్ కాదు. అనవసరమైన వస్తువులను, వ్యక్తులను, జ్ఞాపకాలను వీలైనంత త్వరగా డిలేట్ చేయండి. అవన్నీ క్లియర్ చేసుకుని.. న్యూ ఇయర్​లోకి ప్రవేశించండి.

ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపకుండా మిమ్మల్ని అడ్డుకునే ప్రతిదానిని మీరు వీలైనంత త్వరగా వదిలించుకోండి. కొత్త జీవితం కావాలి అనుకుంటే.. కొంచెం కష్టపడాలి తప్పదు. టాక్సిక్ పర్సన్ లేదా ఫ్రెండ్ లేదా టాక్సిక్ ఆలోచనలు అయినా వెంటనే వదిలేయండి.

కొత్త అలవాట్లపై దృష్టి పెట్టండి. ఎందుకంటే మంచి అలవాట్లే మన విధిని చాలా వరకు నిర్ణయిస్తాయి. అంతేకాదు వాటికి మనల్ని విచ్ఛిన్నం చేసే శక్తి కూడా ఉంది. కాబట్టి దేనినైనా ప్రారంభించే ముందు అది మీకు ఎంతవరకు కరెక్టో, కాదో తేల్చుకోండి. మిమ్మల్ని ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా మార్చే అలవాట్లు మీకు చాలా మంచివి. మీ లక్ష్యాలు ఎప్పుడూ చిన్నగా ఉండేలా చూసుకోండి. అవి మీకు అలవాటుగా మారితే.. ఫలితాలు పెద్ద మొత్తంలో పొందవచ్చు.

ఏ వ్యక్తి బతకడానికి అయినా.. సంతోషంగా బతకడానికి అయినా కూడా డబ్బు చాలా ముఖ్యం. ఈ విషయంలో చాలా కేర్ తీసుకోండి. మీ సంపదానను సరైన దారిలో ఇన్వెస్ట్ చేయండి. ఫినాన్స్ పరంగా మీరు ఎలాంటి ఫోకస్ చేయకపోతే.. మీరు ఎంత సంపాదించినా వేస్ట్ అవుతుంది. మీకున్న ఖర్చులేంటి.. బతకడానికి ఏమి కావాలి.. ఎంజాయ్ చేయడానికి ఏమికావాలి.. దుబారాగా ఏమి ఖర్చుపెడుతున్నారో మీకు కచ్చితంగా క్లారిటీ ఉండాలి. ప్రణాళిక లేకపోతే జీవితం సరిగ్గా వెళ్లదు ఇక డబ్బు ఎంత? కాబట్టి మీరు డబ్బుని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో మీరే నిర్ణయించుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం