Friday Motivation : జీవితంలో ఏదైనా సాధించాలంటే.. మిమ్మల్ని మీరు నమ్మండి..
Friday Motivation : మిమ్మల్ని ఎవరూ నమ్మినా.. నమ్మకపోయినా.. మీరు నమ్మడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. జీవితంలో ఏదైనా సాధించగలను అనే నమ్మకం మీలో ఉన్నప్పుడు.. ప్రతీ విషయం మీకు అనుకూలంగా వస్తుంది. ఒకవేళ రాకపోయినా.. మీరే దానిని వెంటాడి పట్టుకుంటారు.
Friday Motivation : నిజమైన ఓటమి ఎప్పుడు వస్తుందో తెలుసా? మన మీద మనం నమ్మకాన్ని కోల్పోయినప్పుడు. ఆ నమ్మకం మనతో ఉంటే చాలు.. ఎన్నిసార్లు ఓడిపోయినా.. అది నిజమైన ఓటమి అనిపించుకోదు. మరోసారి మీరు గెలిచేందుకు అది ఉత్సాహాన్ని, ఓపికని, శక్తిని ఇస్తుంది. కానీ మీరే ఆ నమ్మకాన్ని వదిలేశారంటే.. మీ డౌన్ ఫాల్ అక్కడి నుంచే మొదలు కాబోతుందని అర్థం.
ఎవరు నమ్మినా.. నమ్మకపోయినా.. ఎవరు మిమ్మల్ని వెనక్కి లాగినా.. మీపై మీరు ఎప్పుడూ నమ్మకం కోల్పోకండి. మీరు గట్టిగా నమ్మితే చాలు.. మిగిలిందంతా మీరు అనుకున్న విధంగానే జరుగుతుంది. ఒకవేళ జరగకపోయినా.. దానిని మీరు ఏదో విధంగా సాధించగలే నేర్పును, ఓర్పును మీకు అందిస్తుంది. కాబట్టి మీరు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు.. గొప్ప పనులు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు.. మీ హృదయంలో ఫిక్స్ అయిపోండి. కచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారని.
ప్రతి విషయానికి ఇతరుల మీదనే కాదు.. మీ మీద మీరు కూడా ఆధారపడవచ్చు. ఏ విషయమైనా.. మిమ్మల్ని దాటి.. పక్కన వారి దగ్గరకు వెళ్లకూడదు అని గుర్తించుకోండి. మీ చుట్టూ నలుగురు వ్యక్తులు కావాలి అంతే కానీ.. ఆ నలుగురు ఉంటేనే.. మీరు ఉంటారనేది పొరపాటు. మీరంటూ ఉంటేనే.. మీ చుట్టూ ఆ నలుగురు ఉంటారు. అలాగే.. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. అప్పుడు కచ్చితంగా ప్రపంచం మిమ్మల్ని నమ్మడం ప్రారంభిస్తుంది.
మీకో విషయం తెలుసా.. మనల్ని ఎంతమంది నమ్మినా.. మన మీద నమ్మకం ఉంచకపోతే.. మిమ్మల్ని ఓటమి పలకరిస్తుంది. ఎవరూ నమ్మినా నమ్మకపోయినా.. మిమ్మల్ని మీరు నమ్మితే మాత్రం గెలుపు కచ్చితంగా మీ బానిస అవుతుంది. మనల్ని మనం నమ్మడానికి అంత పవర్ ఉంది. కాబట్టి ఇతరులను నమ్మండి. కానీ మిమ్మల్ని మీరు ఎక్కువగా నమ్మండి.
మన మీద మనం నమ్మకం ఉంచినప్పుడే.. మనలోని ప్లస్, మైనస్లు తెలుస్తాయి. వాటినే మనం బలంగా మార్చుకుని ముందుకు వెళ్తాము. మనల్ని ఎవరు నమ్మినా.. మన గురించి అన్ని విషయాలు తెలియాలని రూల్ లేదు కదా. మీ బలహీనతలను మీరే ఓవర్ కామ్ చేయాలి అనుకుంటే.. మీపై మీరు నమ్మకముంచండి. కచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ లేట్ అయినా గెలుపు మిమ్మల్ని వరిస్తుంది.
సంబంధిత కథనం