Summer Health Care : ఎండాకాలంలో ఇలా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది-summer health care tips how to protect from heat in hot summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Health Care : ఎండాకాలంలో ఇలా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది

Summer Health Care : ఎండాకాలంలో ఇలా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది

Anand Sai HT Telugu
Mar 11, 2024 12:30 PM IST

Summer Health Care Tips : ఎండలు దంచికొడుతున్నాయి. ఈ సమయంలో మనం చేసే కొన్ని పనులు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే కొన్ని రకాల టిప్స్ తీసుకోవాలి.

సమ్మర్ హెల్త్ కేర్
సమ్మర్ హెల్త్ కేర్ (Unsplash)

వేసవి మెుదలైంది. ఎండ తీవ్రంగా ఉంది. మండే ఎండలో కాసేపు బయట నడిస్తే, అలసిపోతాం. మార్చిలోనే సూరీడు కోపాన్ని చూపిస్తున్నాడు. ఇక ఏప్రిల్, మే నెలలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ వేడి తీవ్రత ఎక్కువగా ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. చల్లగా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..

వడదెబ్బకు గురయ్యే ప్రమాదం వృద్ధులకు, పిల్లలు, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం సమస్యలు, కొన్ని వ్యాధులకు మందులు తీసుకోవడం, ఎండలో పనిచేయడం వలన కూడా వడదెబ్బ తగులుతుంది.

వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా?

నీరు ఎక్కువగా తాగండి, మద్యం సేవించవద్దు, శీతల పానీయాలు తాగవద్దు, బయట నీరు తీసుకోకండి. పుష్కలంగా నీరు తాగాలి. పండ్లు తినండి, మంచినీరు తాగండి, చల్లటి నీటితో స్నానం చేయాలి. బయటకు వెళితే సన్‌స్క్రీన్ తీసుకోండి. ఎండలో పని చేయకండి. ఉదయం 10 లోపు, మధ్యాహ్నం 3 గంటల తర్వాత పని చేయండి.

ఇంటిని చల్లగా ఉంచుకోవాలి. కిటికీకి కర్టెన్ వేసి , హెయిర్ కండీషనర్ లేకుంటే ఇంటిలోపల వెంటిలేషన్ చేయాలి. ఇంట్లో ఓవెన్ లేదా స్టవ్ వాడొద్దు. బయట ప్లాన్ చేయండి. రాత్రిపూట వాడితే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేలా చూసుకోవచ్చు. పిల్లలకు ఎక్కువగా నీళ్లు తాగించండి, జ్యూస్ ఇవ్వండి.

శరీరంలో నిర్జలీకరణకు కొన్ని లక్షణాలు ఉంటాయి. మైకం, అలసట, దాహం, పసుపు రంగు మూత్రం వస్తుంది. ఆకలి లేకపోవడం కూడా జరుగుతుంది. పుష్కలంగా నీరు తాగండి. టీ తాగవద్దు, మద్యం తాగవద్దు, స్ప్రే బాటిల్‌లో నీరు నింపి ముఖం, మెడపై స్ప్రే చేయండి.

హీట్‌ స్ట్రోక్‌తో సమస్యలు

వేసవిలో ఆరుబయట క్రికెట్, ఇతర ఆటలు ఆడుతున్నప్పుడు కండరాలు పట్టేయడం జరుగుతుంది. డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీని నివారణకు సరిపడా నీళ్లు తాగాలి. ఎండ వేడికి హీట్ స్ట్రోక్ గురవుతారు. పెరిగిన శరీర ఉష్ణోగ్రతతో అధిక దాహం వేస్తుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. వాంతులు, మైకం, వింత ప్రవర్తన, మూర్ఛవంటివి వస్తాయి.

ఈ చిట్కాలు పాటించాలి

వేసవిలో ఒక వ్యక్తి మైకం ఉంటే కొన్ని చిట్కాలు పాటించాలి. చల్లటి ప్రదేశంలో కూర్చోబెట్టి, వారికి స్పృహలో ఉంటే నీరు ఇవ్వండి. తర్వాత ముఖంపై కొంచెం నీరు వేయాలి. తల, చంకలు, కాళ్ళను నీటిలో ముంచి, నీటి గుడ్డను ఉంచండి. ఈ సమయంలో పారాసెటమాల్ లేదా ఆస్పిరిన్ ఇవ్వవద్దు. ఎండాకాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. మజ్జిగ తీసుకోండి. మంచినీళ్లు తాగండి. పండ్లు ఎక్కువగా తినండి. ఉప్పు ఎక్కువగా తినకండి. కాటన్ బట్టలు వేసుకోండి. ఎండలో నడిచేటప్పుడు గొడుగు పట్టుకెళ్లాలి.

ఎండాకాలం ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే శరీరం బాగుంటుంది. డీహైడ్రేషన్‌కు గురైతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. అందుకే వేసవిలో నీరు కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి.

Whats_app_banner