Weight Loss | కేవలం నిద్రపోతూ బరువు తగ్గొచ్చు, ఆ టెక్నిక్ ఎంటో ఇక్కడ తెలుసుకోండి
బరువు తగ్గాలంటే ఏవేవో చేయాల్సిన పనిలేదు. కేవలం నిద్రపోతే బరువు తగ్గుతారట. అయితే నిద్రించేటపుడు కొన్ని టెక్నిక్స్ తెలుసుండాలని చెబుతున్నారు. ఆ టెక్నిక్స్ ఏంటి..? ఇక్కడ తెలుసుకోండి.
బరువు తగ్గాలంటే భారీగా వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు, కడుపు మాడ్చుకొని ఉపవాసాలు ఉండనక్కరలేదు. కేవలం నిద్రపోతూ కూడా బరువును నియంత్రించుకోవచ్చంటే మీరు నమ్ముతారా? అవును, ఇది ఇది సాధ్యమే అంటున్నారు పరిశోధకులు. ప్రతిరోజూ రాత్రికి సరిపడా నిద్రపోవాలి, అలాగే మీరు రోజూ సాధారణంగా తినే ఆహారంలో సుమారు 270 కేలరీలు తగ్గించాలి. ఇలా చేస్తూపోతే కొన్ని నెలల్లోనే బరువు తగ్గుతారనేది ఆ పరిశోధన సారాంశం. ఇదే క్రమంలో నిద్రించేటపుడు కొన్ని స్లీప్ టెక్నిక్‌లను అనుసరించాలని కూడా వారి పరిశోధనల్లో సూచించారు. ఇలా చేయడం ద్వారా ఒక సంవత్సరంలో దాదాపు తొమ్మిది పౌండ్ల వరకు బరువు తగ్గుతారని చెబుతున్నారు. అయితే వ్యక్తులను బట్టి ఇందులో మార్పులు ఉండవచ్చు.
ఏదైతేనే నిద్రపోతూ బరువు తగ్గటమనేది చాలా సులభమైన, తేలికైన విధానం. మరి మీరు దీనిపై ఆసక్తిగా ఉంటే కేలరీలు తక్కువ ఉండే ఆహరం తీసుకుంటూ ఎలాంటి స్లీపింగ్ టెక్నిక్ లను అనుసరించాలో ఇక్కడ తెలుసుకోండి.
1) సరైన నిద్రవేళను పాటించండి.
ప్రతిరోజూ నిర్ణీత సమయంలో నిద్రపోవడం అలవాటు చేసుకోండి. దీంతో మీ శరీరం ఆ సమయంలో నిద్రపోవడానికి అలవాటుపడుతుంది. మీరు వెంటనే నిద్రలోకి జారుకుంటారు. ఇలా సుమారు 7 నుంచి 8 గంటల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా మంచిగా నిద్రపోండి.
2) దుప్పటి లేకుండా నిద్రించండి
మీరు చల్లని ఉష్ణోగ్రతలలో నిద్రిస్తున్నప్పుడు, మీ జీవక్రియ పెరుగుతుంది. ఇది మరింత కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. నివేదికల ప్రకారం, గది ఉష్ణోగ్రతను తగ్గించడం వల్ల మీ శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వు పెరుగుతుంది. ఇది మీ శరీరంలోని అదనపు రక్తంలో చక్కెరను వదిలించుకోవడానికి, ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది.
3) భోజనం జీర్ణం అయిన తర్వాత నిద్రపోవడం
మీరు తిన్న వెంటనే నిద్రపోతే అది మీ జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తుంది. దీని వల్ల మీ జీవక్రియ సరిగా పనిచేయదు. ఫలితంగా అది అదనపు కొవ్వుకు దారితీస్తుంది. అలా కాకుండా నిద్రవేళకు కనీసం 2 నుండి 3 గంటల ముందు ఆహారం తీసుకోండి. అప్పుడు తిన్న ఆహారం కొంత జీర్ణంఅవుతుంది. శరీరంలో కొవ్వు పెరగదు.
4) గది వాతావరణం
నిద్రించే సమయంలో మీరు ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగించకూడదు. గదిలో వెలుతురు లేకుండా చీకటిగా ఉంటే వేరే ధ్యాస ఉండదు, నిద్రించటానికి ఇది అనుకూలమైన వాతావరణం. అలాగే మీ మీ పడక గదిని, పడకను పరిశుభ్రంగా ఉంచుకోంది. ప్రశాంతంగా నిద్రపోండి.
సంబంధిత కథనం