Independence day Rangoli: ఇండిపెండెన్స్ డే రోజున ఇంటి ముందు ఇలాంటి రంగోలీ వేసి మీ దేశభక్తిని చాటండి-show your patriotism by placing a rangoli like this in front of your house on independence day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Independence Day Rangoli: ఇండిపెండెన్స్ డే రోజున ఇంటి ముందు ఇలాంటి రంగోలీ వేసి మీ దేశభక్తిని చాటండి

Independence day Rangoli: ఇండిపెండెన్స్ డే రోజున ఇంటి ముందు ఇలాంటి రంగోలీ వేసి మీ దేశభక్తిని చాటండి

Haritha Chappa HT Telugu
Aug 14, 2024 08:00 AM IST

Independence day Rangoli: స్వాతంత్య్ర వేడుకలు రోజు మీ ఇంటిని మూడు రంగులతో అలంకరించండి. ఇంటి ముందు అందమైన రంగోలీతో మీ దేశభక్తిని చాటండి. ఇక్కడ మీకు కొన్ని రంగులీ డిజైన్లను ఇచ్చాము.

ఇండిపెండెన్స్ డే రంగోలీ డిజైన్
ఇండిపెండెన్స్ డే రంగోలీ డిజైన్ (Instagram)

ఆగస్టు 15, ఇండిపెండెన్స్ డే వచ్చేస్తోంది. ఆరోజు తమ దేశభక్తిని చాటేందుకు దేశభక్తులంతా సిద్ధమవుతారు.  ప్రతి ఒక్కరూ ఈ రోజును వైభవంగా నిర్వహించుకోవాలని కోరుకుంటారు. స్వాతంత్య్ర వేడుకలను జరుపుకోవడానికి చాలా మంది తమ కుటుంబం పార్టీలు చేసుకుంటారు. అదే సమయంలో కొందరు ఇంటిని కూడా అలంకరిస్తారు. స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవడానికి ఇంటిని కూడా అలంకరిస్తే అందంగా ఉంటుంది. ఇంటి ముందు రంగోలి డిజైన్లు వేసి మీ దేశభక్తిని చాటుకోవచ్చు. ఇక్కడ కొన్ని రంగోలి డిజైన్లు ఉన్నాయి. ఆఫీసులో కూడా ఈ డిజైన్లు వేయకోవచ్చు.  స్వాతంత్య్ర దినోత్సవం కోసం అందమైన రంగోలి డిజైన్లను ఇక్కడ చూడండి.

ఇండిపెండెన్స్ డే రంగోలీ
ఇండిపెండెన్స్ డే రంగోలీ (Instagram)

ఇండిపెండెన్స్ డే కోసం రంగోలి డిజైన్ కోసం చూస్తున్నట్లైతే అలాంటి డిజైన్ ను ఇక్కడ ఇచ్చాము. దీని వేయడం చాలా సులువు. చూసేందుకు కష్టం అనిపించినా… ప్రయత్నిస్తే చాలా సులభంగా వేయచ్చు. దీని తయారీకి ఎక్కువ రంగులను ఉపయోగించాలి. ఇది ఇంటి లేదా ఆఫీసులో వేస్తే  అందరికీ నచ్చడం ఖాయం. 

రంగోలీ డిజైన్లు
రంగోలీ డిజైన్లు (Instagram )

మీరు ఈ రంగోలిని వేస్తే మన దేశం సింహంలాంటిదని చెప్పకనే చెబుతున్నట్టు.  మీలో ఒక ఆర్టిస్ట్ ఉంటే ఈ డిజైన్ వేయవచ్చు. ఇది వేయడానికి ముందు  ముందు నేలపై పెన్సిల్ తో గీయండి. తరువాత దానిని రంగుతో నింపండి.  రంగోలితో పొడి రంగులను నింపడం కష్టమైతే వాటర్ కలర్ వాడండి.

రంగోలీ డిజైన్లు
రంగోలీ డిజైన్లు (Instagram)

ఈ రకమైన రంగోలిని వేయడానికి ఖాళీ కెచప్ బాటిల్ ఉపయోగించండి. ఆ బాటిల్ లో రంగులు వేసి ఈ రంగోలిని సులభంగా వేయచ్చు. రంగు జాలువారుతుంటే హ్యాపీ ఇండెపెండెన్స్ డే అని రాయడం, చుట్టు మందపాటి చుక్కలు పెట్టడం సులభంగా మారుతుంది. ఇలా రంగోలీ వేశాక చుట్టు కొవ్వొత్తుల దీపాలు పెడితే అందంగా ఉంటుంది. 

నెమలి రంగోలీ
నెమలి రంగోలీ (Instagram)

నెమలి, పూల డిజైన్లలో తయారు చేసిన ఈ రంగోలి చాలా అందంగా ఉంటుంది. మీరు దీన్ని ఇంటి ఆవరణలో వేసువచ్చు. కావాలంటే ఆఫీసులో కూడా చేసుకోవచ్చు. నెమలి ఈకలను తయారు చేయడానికి టూత్ పిక్ ఉపయోగించండి. రంగులు వేశాక టూత్ పిక్ తో లైన్లు గీస్తే సులువుగా ఉంటుంది.

సింపుల్ రంగోలీ
సింపుల్ రంగోలీ (Instagram)

రంగోలి ఎలా వేయాలో తెలియకపోతే  ఇలాంటి సింపుల్‌ డిజైన్లను వేయవచ్చు. సులువుగా ఫ్లవర్ వేసి ఆకులు వేస్తే సరిపోతుంది. ఇక రంగుల్లో భాగంగా మన జెండాలో ఏఏ రంగులు ఉంటాయో ఆ రంగులనే ఇక్కడ ఉపయోగించాలి.

టాపిక్