Navratri Prasadam: అమ్మవారికి నైవేద్యంగా గులాబ్ ఖీర్, గోధుమ హల్వా.. సులభంగా చేసేయండిలా..-shardiya navratri delectable bhog recipes to offer durga ma ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Navratri Prasadam: అమ్మవారికి నైవేద్యంగా గులాబ్ ఖీర్, గోధుమ హల్వా.. సులభంగా చేసేయండిలా..

Navratri Prasadam: అమ్మవారికి నైవేద్యంగా గులాబ్ ఖీర్, గోధుమ హల్వా.. సులభంగా చేసేయండిలా..

Koutik Pranaya Sree HT Telugu
Oct 19, 2023 01:19 PM IST

Navratri Prasadam: నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా కోకోనట్ గులాబ్ ఖీర్, గోధుమ హల్వా నివేదించొచ్చు. వాటిని ఎలా తయారు చేయాలో చూసేయండి.

అమ్మవారి ప్రసాదాలు
అమ్మవారి ప్రసాదాలు (Pinterest)

నవరాత్రుల్లో అమ్మవారికి ప్రతిరోజూ వివిధ రకాల నైవేద్యాలు అర్పిస్తారు. పండగల్లో నైవేద్యాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ తొమ్మిది రోజులు నవదుర్గ అవతారాల్లో అమ్మవారిని కొలుస్తారు. అందుకే కొన్ని సులభంగా, రుచిగా ఉండే ప్రసాదాలు వండి మీరు కూడా అమ్మవారి దీవెనలు పొందండి. అలాంటి ప్రసాదాలు మీకోసం..

1. కోకోనట్ గులాబీ ఖీర్:

కోకోనట్ గులాబీ ఖీర్
కోకోనట్ గులాబీ ఖీర్ (Pinterest)

కావాల్సిన పదార్థాలు:

కోకోనట్ క్రీం 200 గ్రాములు

కండెన్స్డ్ మిల్క్ 1 చెంచా

యాలకుల పొడి 1 చెంచా

తాజా కొబ్బరి తురుము సగం కప్పు

సన్నగా తరిగిన బాదాం పావు కప్పు

సన్నగా తరిగిన పిస్తా 2 చెంచాలు

ఎండు కొబ్బరి తురుము 4 చెంచాలు

గులాబీ రేకులు గుప్పెడు

తయారీ విధానం:

  1. ముందుగా నాన్ స్టిక్ ప్యాన్ లో కండెన్స్డ్ మిల్క్ వేడి చేసుకోవాలి. అందులో కోకోనట్ క్రీం, యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. సన్నం మంట మీద కలుపుతూ ఉండాలి.
  2. ఇప్పుడు సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, బాదాం, పిస్తా, కొబ్బరి తురుము కూడా వేసి కలపాలి.
  3. సన్నని సెగ మీద 5 నిమిషాల పాటూ ఉడకనివ్వాలి.
  4. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని మీద కొద్దిగా రోజ్ సిరప్, గులాబీ రేకులు వేసుకుని సర్వ్ చేసుకుంటే సరి.

2. గోధుమపిండి హల్వా:

Aate ka halwa
Aate ka halwa (Pinterest)

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు నెయ్యి

1 కప్పు గోధుమపిండి

1 కప్పు పంచదార

2 కప్పుల నీళ్లు

తయారీ విధానం:

  1. కాస్త లోతుగా ఉన్న ప్యాన్ తీసుకుని వేడెక్కాక నెయ్యి వేసుకోవాలి.
  2. అది వేడెక్కాక అందులో గోధుమపిండి వేసుకుని కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి.
  3. సన్నం మంట మీద పిండి రంగు మారేంత వరకు కలుపుతూనే ఉండాలి.
  4. రంగు వచ్చాక పంచదార,నీళ్లు వేసుకుని మీడియం మంట మీద ఉడకనివ్వాలి.
  5. నెయ్యి పైకి తేలడం మొదలైతే హల్వా సిద్ధమైనట్లే. ఒక నిమిషం పాటు ఉంచి దించుకుంటే సరిపోతుంది.

Whats_app_banner