Men Health: ఈ అలవాట్లు ఉన్న పురుషుల్లో లైంగిక స్టామినా తగ్గిపోతుంది, మీలో ఉంటే వెంటనే మానుకోండి-sexual stamina decreases in men with these habits if you have it avoid it immediately ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Men Health: ఈ అలవాట్లు ఉన్న పురుషుల్లో లైంగిక స్టామినా తగ్గిపోతుంది, మీలో ఉంటే వెంటనే మానుకోండి

Men Health: ఈ అలవాట్లు ఉన్న పురుషుల్లో లైంగిక స్టామినా తగ్గిపోతుంది, మీలో ఉంటే వెంటనే మానుకోండి

Haritha Chappa HT Telugu
Sep 26, 2024 04:30 PM IST

Men Health: క్షీణిస్తున్న జీవనశైలి, చెడు ఆహారపద్దతులు వంటివి ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై కనిపిస్తోంది. ఈ రోజుల్లో పురుషుల్లో స్టామినా తక్కువగా ఉండటం సర్వసాధారణంగా మారింది. కొన్ని అలవాట్లు ఉండే మగవారిలో లైంగిక శక్తి తగ్గిపోతుంది.

పురుషుల లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలు
పురుషుల లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలు (Shutterstock)

చెడు జీవనశైలి కారణంగా ఎంతో మంది తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ ప్రభావం ప్రతి ఒక్కరిపై పడుతుంది. పురుషులు, మహిళలు, పిల్లలు ఎవరైనా సరే, కొంచెం శారీరక శ్రమ చేసినా కూడా వారి అలసట వచ్చేస్తుంది. రోజంతా కూర్చుని ఉన్నా కూడా వారికి నీరసంగానే అనిపిస్తుంది. ముఖ్యంగా పురుషుల్లో లైంగిక శక్తి కూడా తగ్గిపోతున్నట్టు తెలుస్తోంది. మగవారిలో స్టామినా తగ్గడానికి వారి జీవనశైలే కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి.

పురుషులు అనేక రకాల మల్టీవిటమిన్లు, సప్లిమెంట్లను తీసుకున్నప్పటికీ బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సాధారణ అలవాట్లు కూడా వారి లైంగిక జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి.

నిద్ర తగ్గినా

కంటికి సరిపడింనత నిద్ర లేకపోవడం వల్ల క్రమంగా అనేక వ్యాధులు శరీరాన్ని చుట్టుముడతాయి. పురుషుల్లో స్టామినా తక్కువగా ఉండటానికి నిద్ర లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. నేటి జీవితంలో చాలా మంది పురుషులు నిద్రను తగ్గించేస్తున్నారు. దీని వల్ల వారికి లైంగిక సమస్యలు వస్తాయి. కాబట్టి మీ బిజీ షెడ్యూల్ నుండి నిద్రపోవడానికి సమయాన్ని కేటాయించండి. సుమారు ఏడెనిమిది గంటల నిద్ర తీసుకోండి.

డీహైడ్రేషన్

శరీరానికి తగినంత నీరు అందకపోతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల కూడా పురుషుల్లో స్టామినా తగ్గిపోతుంది. చాలా మంది పురుషులు రోజు రన్నింగ్ కారణంగా సరైన మొత్తంలో నీరు తాగరు. దీని వల్ల వారి శరీరంలో నీరు లోపిస్తుంది. ఇది వారి స్టామినాను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలంటే తగినంత నీరు త్రాగాలి.

కెఫిన్

కెఫిన్ తీసుకోవడం వల్ల కూడా పురుషుల్లో లైంగిక స్టామినాను ప్రభావితం చేస్తుంది. రోజంతా ఆఫీసులో కూర్చునే పనికి వెళ్ళే పురుషులు రోజులో అనేక కప్పుల టీ లేదా కాఫీ తాగుతారు. దీనితో, శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది, కానీ ఇది వారి స్టామినాను ప్రభావితం చేస్తుంది. కాబట్టి కెఫిన్ తక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. కాఫీ బదులుగా తాజా పండ్ల రసాలు, నిమ్మరసం వంటి వాటిని ప్రయత్నించవచ్చు.

మద్యం

చాలా మంది పురుషులకు మద్యం తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వారి స్టామినాను కూడా ప్రభావితం చేస్తుంది. ఆల్కహాల్ సేవించడం వల్ల శరీర స్టామినా దెబ్బతినడమే కాకుండా అనేక ఇతర వ్యాధులు చుట్టుముడతాయి. ఆల్కహాల్ కూడా కాలేయంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, ఆల్కహాల్ తీసుకునే పరిమాణాన్ని తగ్గించాలి. ఈ అలవాటును మెల్లగా మానేయాలి.

మగవారిలో లైంగిక శక్తి తక్కువగా ఉండటానికి శారీరక శ్రమ లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. రోజులో ఎక్కువ భాగం ఆఫీసులో కూర్చొని, డెస్క్ వద్ద కూర్చొని, సాయంత్రం అలసిపోయి తిరిగి వచ్చేసరికి వ్యాయామం చేయాలని అనిపించదు. దీనివల్ల వారిలో లైంగిక శక్తి, స్టామినా క్రమేపీ తగ్గిపోతుంది. కాబట్టి మీ శరీరానికి కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. ఇందులో యోగా, వర్కౌట్స్ లేదా మీకు ఇష్టమైన అవుట్ డోర్ గేమ్స్ ఆడొచ్చు.

Whats_app_banner