శృంగారానికి ముందు పురుషులు ఇలా చేస్తే మహిళలకి అస్సలు నచ్చదు-seven things women want from men during sex ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  శృంగారానికి ముందు పురుషులు ఇలా చేస్తే మహిళలకి అస్సలు నచ్చదు

శృంగారానికి ముందు పురుషులు ఇలా చేస్తే మహిళలకి అస్సలు నచ్చదు

Galeti Rajendra HT Telugu
Oct 24, 2024 08:35 PM IST

బెడ్‌రూములో చాలా మంది పురుషులు తమకి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. అవి మీకు తెలియకుండానే మీ భాగస్వామికి కోపాన్ని తెప్పిస్తుంటాయి.

బెడ్‌రూములో పురుషులు చేసే తప్పిదాుల
బెడ్‌రూములో పురుషులు చేసే తప్పిదాుల (istock)

శృంగారం అనేది స్త్రీ, పురుషుల మధ్య పరస్పర అంగీకారంతో జరగాలి. కానీ కొంత మంది భాగస్వామి అభిప్రాయాలు, ఇష్టంతో సంబంధం లేకుండా సంభోగంలో పాల్గొనాలని ప్రయత్నిస్తుంటారు. అలా చేస్తే మహిళలకి ఇష్టం పోయి.. భాగస్వామిపై కోపం, అసహ్యం ఏర్పడుతుంది. అలానే బెడ్‌రూములో పురుషులు ఏ తప్పిదాలు చేస్తే మహిళలకి ఎక్కువగా కోపం, అయిష్టత ఏర్పడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

yearly horoscope entry point

ఆలోచనలు కనెక్ట్

బెడ్‌రూములో తమతో కాసేపైనా ప్రేమగా మాట్లాడకుండా నేరుగా సంభోగం కోసం ప్రయత్నించే భాగస్వామిని మహిళలు ఇష్టపడరు. తమ భావోద్వేగాలను అర్థం చేసుకునే సహనంగా ఉండే భాగస్వామి మహిళలకి బాగా నచ్చుతారు. అలా కాకుండా కేవలం శారీరక సుఖం గురించే ఆలోచించే వారి పట్ల సముఖంగా ఉండరు. భాగస్వామితో శారీరకంగానే కాదు ఆలోచనల పరంగా కూడా కనెక్ట్ కావాలని మహిళలు ఆశపడతారు.

నీట్‌గా కనిపించాలి

బెడ్‌రూములోకి మాసిన బట్టలు, చిందర వందరతనంతో వచ్చే పురుషుల పట్ల మహిళలు పెద్దగా ఆసక్తి చూపరు. శరీర శుభ్రత పాటిస్తూ, శుభ్రమైన బట్టలు వేసుకుని తమ దగ్గరికి పురుషులు రావాలని మహిళలు ఆశపడతారు. శరీర నుంచి దుర్వాసన లేదా అశుభ్రంగా వారికి కనిపిస్తే మహిళలు వారిని మహిళలు ఇష్టపడరు.

మనసు గెలుచుకునేలా

శృంగారానికి ముందు సరదా మాట్లాడి మహిళల మనసును గెలుచుకోవచ్చు. కానీ అతికి వెళ్లి వారి మనసుని బాధపెట్టేలా మాట్లాడితే మొదటికే మోసం రావచ్చు. కాబట్టి.. వారి అభిప్రాయాలు, అభిరుచులకి అనుగుణంగా మాట్లాడే భాగస్వామిని ఎక్కువగా మహిళలు ఇష్టపడతారని గుర్తుంచుకోండి.

రొమాంటిక్ టచ్

బెడ్‌రూములో శృంగారానికి ముందు మహిళల భావాలను గుర్తించడం, వారి అంగీకారాన్ని, ఇష్టాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలానే ఆత్మీయతంగా వారితో మాట్లాడటం, రొమాంటిక్‌గా మాట్లాడుతూ టచ్ చేసే వారిని మహిళలు బాగా ఇష్టపడతారు. సందర్భోచితంగా మంచి మాటలు, సరదా జోక్‌లు వేసే వారంటే మహిళలకు బాగా ఇష్టం ఉంటుంది. కానీ.. బెడ్ రూములో కూడా తమని నిందించే వారిని, కోప్పడే వారితో మహిళలు ఇష్టంగా కలవరు.

సంభోగం తర్వాత వదిలేయవద్దు

శృంగారం తర్వాత కొంత మంది భాగస్వామి గురించి పట్టించుకోకుండా నిద్రపోతుంటారు. అలా చేస్తే మహిళలకి అస్సలు నచ్చరు. సంభోగం తర్వాత కూడా తమతో సరదాగా, రొమాంటిక్‌గా మాట్లాడేవారిని మహిళలు బాగా ఇష్టపడతారు. అలానే శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేసినట్లు వాళ్లు కూడా ఫీలవుతారు.

సరదాగా పర్మీషన్..

సంభోగానికి ముందు మహిళతో మాట్లాడుతూ వారి అభిప్రాయాన్ని తీసుకుంటూ.. వీలైతే వారి అనుమతితో రొమాన్స్ చేసే వారిని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. ఇది వారిలో విశ్వాసం పెంచడంతో పాటు మీపై ప్రేమని కూడా రెట్టింపు చేస్తుంది. అలానే తమ సౌకర్యాన్ని, ఇబ్బందిని గమనించి దానికి అనుగుణంగా వ్యవహరించే భాగస్వామిని బాగా నచ్చుతారు.

స్పందనకి అనుగుణంగా

శృంగారం సమయంలో మహిళల హావభావాలు కాస్త భిన్నంగా ఉంటాయి. వాటిని భాగస్వామి అర్థం చేసుకోవాలని మహిళలు ఆశపడతారు. కానీ.. వాటిని పట్టించుకోకుండా భాగస్వామి వ్యవహరిస్తే అది మహిళలకి సంతోషానివ్వదు.పోర్ ప్లే సమయంలో మహిళల స్పందనలను అర్థం చేసుకోవడం కీలకం. వారి ఇష్టాలకి అనుగుణంగా బెడ్‌రూములో వ్యవహరిస్తే.. మహిళలు బాగా ఇష్టపడతారు.

ఓవరాల్‌గా నొప్పించి కాకుండా.. మెప్పించి శృంగారంలో పాల్గొనేవారిని మహిళలు ఇష్టపడతారు.

Whats_app_banner