Smokey Carrot Soup: స్మోకీ ఫ్లేవర్‌తో క్రీమీ క్యారట్ సూప్, నోరూరించేస్తుంది
Smokey Carrot Soup: స్మోకీ ఫ్లేవర్‌తో క్యారట్ సూప్ తాగారంటే రుచి మర్చిపోలేరు. హెల్తీ సూప్ రెసిపీ ఇది. దీని తయారీకి కావాల్సినవన్నీ మీ వంటగదిలో ఉండేవే.
స్మోకీ క్యారట్ సూప్
క్యారట్ సూప్ అంత రుచిగా మరే సూప్ ఉండదు. దీన్ని సరిగ్గా చేయాలే కానీ మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఎంత తాగినా తాగాలనిపిస్తుంది. అయితే రెగ్యులర్ గా కాకుండా స్మోకీ ఫ్లేవర్ ఇచ్చి ఈ సూప్ తయారు చేస్తాం. కాబట్టి రుచి మరింత బాగుంటుంది. తయారీ ఎలాగో చూసేయండి.
స్మోకీ క్యారట్ సూప్ తయారీకి కావాల్సినవి:
4 క్యారట్లు
2 చెంచాల వంటనూనె
కొద్దిగా ఉప్పు
1 ఉల్లిపాయ, సన్నటి తరుగు
4 వెల్లుల్లి రెబ్బలు, సన్నటి ముక్కల తరుగు
అరచెంచా ధనియాల పొడి
అరచెంచా జీలకర్ర పొడి
2 కప్పుల నీళ్లు (కూరగాయలు ఉడికించిన నీళ్లుంటే వాడొచ్చు)
1 చెంచాడు బటర్
అరచెంచా మిరియాల పొడి
స్మోకీ క్యారట్ సూప్ తయారీ విధానం:
- ఓవెన్ ఉంటే క్యారట్లకు కాస్త నూనె రాసి బేకింగ్ షీట్ లో పెట్టి రోస్ట్ చేసుకోవచ్చు.
- లేదంటే ముందుగా క్యారట్లను ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత నీళ్లు లేకుండా తడి ఆరిపోయాక స్టవ్ మీద పుల్కా స్టాండ్ మీద పెట్టి కాస్త కాల్చుకోవాలి. దీంతో మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది.
- ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి.
- ఇప్పుడు జీలకర్రొ పొడి, ధనియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి. అందులో కూరగాయలు ఉడికించుకున్న నీళ్లు లేదా మామూలు నీళ్లు రెండు మూడు కప్పుల దాకా పోసుకోవాలి.
- ముందుగా ఉడికించి రోస్ట చేసుకున్న క్యారట్ ముద్దను ఈ ఉడుకుతున్న నీటిలో కలిపేయాలి.
- సన్నం మంట మీద పావుగంట సేపు ఉడికిస్తే చాలు. పూర్తిగా చల్లారి పోయాక దీన్ని మిక్సీ లో వేసుకుని చిక్కగా పట్టుకోవాలి. అంతే. క్యారట్ సూప్ రెడీ.
- చివర్లో కాస్త బటర్, నిమ్మరసం వేసుకుని బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. మంచి ఫ్లేవర్ వస్తుంది.
టాపిక్