Expensive liquid in the world: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లిక్విడ్ తేలు విషం, దీంతో ఔషధాల తయారీ
Expensive liquid in the world: తేలు పేరు చెబితేనే భయమేస్తుంది. కుట్టిందంటే విషం శరీరంలో పాకిపోతుంది. కానీ తేలు విషం ఎంత ఖరీదైనదంటే దాంతో కోటీశ్వరులు అయిపోవచ్చు.
Expensive liquid in the world: తేలు కుడుతుందేమోనని భయపడుతూ నడిచేవారు ఎంతోమంది. కానీ తేళ్ళను పెంచుతూ దాని విషాన్ని సేకరించి కోటీశ్వరులు అవుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. తేళ్ళ నుంచి సేకరించిన విషాన్ని గడ్డకట్టేలా చేసి, తరువాత పొడి రూపంలో మార్చి ఫార్మ కంపెనీలకు అమ్ముతూ ఉంటారు. తేలు విషాన్ని కాస్మెటిక్స్ ఉత్పత్తిదారులు, ఔషధ తయారీ సంస్థలు కొంటాయి. తేలు విషం ధర తెలిస్తే మీరు అవాక్కవుతారు. ఒక లీటర్ తేలు విషం కొనాలంటే 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. కొన్నిచోట్ల కోళ్ళ ఫామ్‌లాగే తేళ్ల ఫామ్‌లు కూడా నిర్వహిస్తూ తేలు విషయాన్ని అమ్ముతున్నారు.
తేళ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి వాటిలో డెత్ స్టాకర్ అనే తేలు చాలా డేంజరస్. ఇది కుట్టిందంటే బతకడం కష్టం. దీని విషాన్ని సేకరించి భద్రపరిచి అమ్మేవారు ఎంతోమంది ఉన్నారు.
ఒక తేలులో ఒకసారికి రెండు మిల్లీగ్రాముల విషం మాత్రమే ఉత్పత్తి అవుతుంది. దీన్నిబట్టి తేలు విషం సేకరించడం ఎంత కష్టమో తెలుసుకోండి. 300 నుంచి 400 తేళ్ల నుంచి కేవలం ఒక గ్రాము విషాన్ని మాత్రమే సేకరించగలరు. ఒక లీటరు విషాన్ని సేకరించాలంటే ఎన్ని తేళ్లను పెంచాలో, వాటి నుండి ఎన్ని సార్లు విషాన్ని సేకరించాలో లెక్క పెట్టుకోండి.
తేలు విషయాన్ని యాంటీబయోటిక్స్, పెయిన కిల్లర్లు, కాస్మోటిక్స్ వంటి తయారీలో వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎన్నో సంస్థలు వీటిని కొనేందుకు ముందుకు వస్తున్నాయి.
టర్కీలో తేళ్ల ఫామ్‌లు ఎన్నో ఉన్నాయి. బ్రిటన్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ఇలా ఎన్నో దేశాలకు తేలు విషం అవసరం. అక్కడ ఉండే ఫార్మా కంపెనీలు ఔషధాలలో తేలు విషాన్ని అధికంగా వాడుతూ ఉంటాయి. అందుకే కొంతమంది ప్రమాదకరమైపా కూడా డబ్బు సంపాదన కోసం తేళ్లను పెంచుతూ కోటీశ్వరులు అవుతున్నారు.
క్యాన్సర్ చికిత్సలో తేలు విషం
చైనా, గ్రీసు దేశాల్లో వేల ఏళ్ల క్రితం నుంచి తేలు విషాన్ని వివిధ రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నట్లు తేలింది. మెక్సికో, క్యూబా లోని పరిశోధకులు కొన్ని జాతుల తేళ్ల విషం క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయని కనిపెట్టారు. ఈ తేళ్ల విషంలో విభిన్న ప్రోటీన్లు, పెప్టైడ్లు ఉన్నట్టు గుర్తించారు. క్యాన్సర్ కణాలపై ప్రభావం చూపిస్తాయని గుర్తించారు. అందుకే క్యాన్సర్ ఔషధాల్లో తేలు విషయాన్ని వినియోగిస్తున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రాంక్రియాస్ క్యాన్సర్, పొట్ట క్యాన్సర్, మెదడు క్యాన్సర్ పై తేలు విషంతో చేసిన క్యాన్సర్ ఔషధాలు మంచి ఫలితాలను అందించినట్టు అధ్యయనకర్తలు చెబుతున్నారు. అయితే రక్తం ఆధారిత క్యాన్సర్ల పై మాత్రం ఇది సరిగ్గా పని చేయడం లేదు, అంటే బ్లడ్ క్యాన్సర్ వంటి వాటిపై తేలు విషం అంత ప్రభావంతంగా పనిచేయడం లేదు.
పార్కిన్సన్స్ వ్యాధికి చికిత్స
పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడే వారికి కూడా తేలు విషం ప్రభావంతంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. బాధపడుతున్న వారిలో మెదడులోని న్యూరాన్లు దెబ్బతింటాయి. అలాగే డోపమైన్ అనే హార్మోను లోపిస్తుంది. దీని ఫలితంగానే వారిలో సమన్వయ లోపం ఏర్పడుతుంది. ఇప్పుడైతే తేలు విషాన్ని ల్యాబ్‌లో పరీక్షించారో అది డోపమైన్ విడుదలను పెంచినట్టు గుర్తించారు. దీన్ని బట్టి తేలు విషంతో తయారు చేసిన మందులు పార్కిన్సన్స్ లక్షణాలను తగ్గించే అవకాశం ఉందని అధ్యయనం చెబుతుంది.
ప్రస్తుతం తేలు విషం పై ఇంకా ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి. భవిష్యత్తులో దాంతో తయారు చేసే అనేక రకమైన మందులు వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది.
తేలు విషం మానవ ఆరోగ్యాన్ని కాపాడుతుందని అధ్యయనాలు నిరూపించినప్పటికీ, దాని ఖరీదే మందులను తయారు చేసే క్రమంలో అడ్డుగా మారుతుంది. ఇది కోట్లలో ఖరీదైన విషం, కాబట్టి మందులు కూడా అంతకుమించి ఖరీదైనవిగా ఉంటాయి. భవిష్యత్తులో క్యాన్సర్‌ను తగ్గించే మందులను తేలు విషంతో తయారుచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అనేక అధ్యయనాలు చెబుతున్న ప్రకారం తేలు విషం పెయిన్ కిల్లర్‌గా ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులకు కూడా ప్రభావంతో చికిత్స చేస్తుంది.