Saturday Quote : ఫిజికల్​గా స్ట్రాంగ్​గా ఉంటే సరిపోదు.. మెంటల్​గా కూడా ఉండాలి..-saturday motivation on you have to be at your strongest when your feeling at your weakest ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Quote : ఫిజికల్​గా స్ట్రాంగ్​గా ఉంటే సరిపోదు.. మెంటల్​గా కూడా ఉండాలి..

Saturday Quote : ఫిజికల్​గా స్ట్రాంగ్​గా ఉంటే సరిపోదు.. మెంటల్​గా కూడా ఉండాలి..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 17, 2022 06:47 AM IST

Saturday Quote : మనం స్ట్రాంగా? లేక వీకా? అనేది మన శారీరక బలం మీద కంటే మానసిక బలం మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మనం శారీరంకంగా వీక్​ ఉన్నా.. మానసికంగా స్ట్రాంగ్​గా ఉంటే గెలిచే అవకాశాలు ఎక్కువ. శారీరకంగా ఎంత స్ట్రాంగ్​గా ఉన్నా.. మానసికంగా వీక్ ఉంటే ఇట్టే ఓడిపోతాము. కాబట్టి.. మీకు వీక్ అనిపించిన మూమెంట్​లో స్ట్రాంగ్​ ఉండడం నేర్చుకోండి.

<p>కోట్ ఆఫ్ ద డే</p>
కోట్ ఆఫ్ ద డే

Saturday Motivation : ఒత్తిడి అనేది ఎలాంటి వారినైనా వంచేస్తుంది. అందుకే ఎంతటి ఒత్తిడినైనా తట్టుకునేలా శక్తి మనకి ఉండాలి. దానికోసం శారీరక బలం ఎంత అవసరమో.. మానసిక బలం కూడా అంతకంటే ఎక్కువ అవసరం. నిజం చెప్పాలంటే మానసికంగా బలంగా ఉంటేనే.. శారీరక బలం మనకి తోడవుతుంది. మానసికంగా స్ట్రాంగ్​గా లేకుండా.. శారీరక బలంతో గెలిచేద్దామనుకుంటే పనులు కావు.

ఏ పనినైనా లేదా ఏ పోటీనైనా ఎదుర్కోవాలంటే.. మానసికంగా ధృడంగా ఉండటం అవసరం. కాబట్టి మానసికంగా బలంగా ఉండేందుకు ట్రై చేయండి. యోగా, ధ్యానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇవి మీరు లోపలి నుంచి స్ట్రాంగ్​గా ఉండేలా చేస్తాయి. కొన్ని సమస్యలను డైరక్ట్​గా ఎదుర్కొనేలా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాయి. మైండ్ షార్ప్​గా తయారవుతుంది. మీరు ఓడిపోతున్నారనే ఫీల్​ని మీకు రానివ్వదు. ఆ సమయంలో ఇంకా మీరు పోరాడేలా ధైర్యం ఇస్తుంది. అంతేకాకుండా మీరు ఓడిపోయినా.. బాగా పోరాడామనే తృప్తిని ఇస్తుంది. మరోసారి ఎలా పోరాడాలో మీకు నేర్పిస్తుంది. కాబట్టి మానసికంగా స్ట్రాంగ్​గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్.

మానసికంగా స్ట్రాంగ్​గా ఉన్నప్పుడు.. ఫిజికల్​గా కూడా స్ట్రాంగ్​గా ఉంటాము. హెల్త్​ మీద సరైన కేర్ తీసుకోవడానికి కూాడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. సమస్యలనేవి చెప్పా పెట్టకుండా వచ్చేస్తాయి. అవి వచ్చినప్పుడు మీరు మానసికంగా ఎంత స్ట్రాంగ్​గా ఉన్నారు.. వాటిని ఎలా ఎదుర్కోగలరు అనేదే మ్యాటర్. ఇంటర్వ్యూలలో కూడా మీరు మానసికంగా ఎంత స్ట్రాంగ్​గా ఉన్నారో అనేదే ఎక్కువగా చూస్తారు. దానిని కూడా పరిగణలోకి తీసుకునే మీకు జాబ్ ఇస్తారు.

కొన్నిసార్లు మన సౌలభ్యం కోసం కాకుండా పరిస్థితులకు అనుగుణంగా మారాలి అనే వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీనికోసం లోపల నుంచి బలంగా ఉండటమే కాకుండా.. బాహ్య ఒత్తిడిని, గాయాన్ని ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. మీ సొంత ప్రణాళికలను రూపొందించడానికి, వాటిని సమర్థవంతంగా అమలు చేయడానికి మీకు ధైర్యం కావాలి. ఏదైనా పడవలో ప్రయాణిస్తున్నప్పుడు.. నీటిలో పడటం మన తప్పు కాదు అనే వాస్తవాన్ని మనం గుర్తుంచుకోవాలి. కానీ దానిని అధిగమించడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోవడమే మన తప్పు. కొన్నిసార్లు ఏదైనా సమస్య వస్తే ఏమి చేయాలో దిక్కు తోచదు. అలాంటి సమయంలోనే మనం ఆచితూచి వ్యవహరించాలి. కాబట్టి.. మానసికంగా స్ట్రాంగ్​గా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. మీరు మెంటల్​గా ఎంత స్ట్రాంగ్​గా ఉంటే.. ఫిజికల్​గా అన్ని విజయాలు సాధిస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం