Yoga Day | యోగానే మా ఆరోగ్య రహస్యం.. యోగాసనాలతో మైమరిపించిన తారలు!
- అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు నుంచి ఇకపై ప్రతిరోజూ యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకుంటామని చాలా మంది ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ , టాలీవుడ్ హీరోయిన్లు యోగాను ఎప్పట్నించో అభ్యసిస్తున్నారు. యోగాపై మరింత అవగాహన కల్పించేందుకు స్టార్లు తమ యోగా భంగిమలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. టాలీవుడ్ నుంచి తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, పూజాహెగ్డే, కాజల్ అగర్వాల్, సమంత తదితరులు తమ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోగా బాలీవుడ్ బ్యూటీలు శిల్పాషెట్టి, దీపికా పడుకోణ్, మలైకా అరోరా, అలియా భట్ తమకు నచ్చిన యోగాసనాల గురించి, వాటి ప్రయోజనాల గురించి తెలియజేశారు.