పాత మోడల్ కంటే తక్కువ ధరకే Samsung Galaxy S20 FE అప్‌గ్రేడెడ్ వెర్షన్!-samsung galaxy s20 fe 2022 model smartphone launched ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పాత మోడల్ కంటే తక్కువ ధరకే Samsung Galaxy S20 Fe అప్‌గ్రేడెడ్ వెర్షన్!

పాత మోడల్ కంటే తక్కువ ధరకే Samsung Galaxy S20 FE అప్‌గ్రేడెడ్ వెర్షన్!

HT Telugu Desk HT Telugu
Apr 06, 2022 04:11 PM IST

శాంసంగ్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి పాపులర్ స్మార్ట్‌ఫోన్ మోడల్ Samsung Galaxy S20 FE 2022 ను అవిష్కరించింది.

Samsung Galaxy S20 FE 2022
Samsung Galaxy S20 FE 2022

ప్రముఖ కంపెనీ శాంసంగ్ తమ బ్రాండ్ నుంచి పాపులర్ స్మార్ట్‌ఫోన్ మోడల్ అయిన Samsung Galaxy S20 FEకు అప్‌గ్రేడ్ వెర్షన్ Samsung Galaxy S20 FE 2022 మోడల్‌ను అవిష్కరించింది. విశేషమేమంటే ఇది తన పాత మోడల్ Samsung Galaxy S20 FE కంటే తక్కువ ధరతో, అదనపు ఫీచర్లతో వస్తోంది. 

ఇందులో ఫింగర్‌ప్రింట్ స్కానర్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, IP68 డస్ట్, వాటర్ ప్రొటెక్షన్, శామ్‌సంగ్ వైర్‌లెస్ డెక్స్, నాక్స్ సెక్యూరిటీ సూట్ అలాగే బ్లూటూత్ 5.0 వంటి ఇతర ముఖ్యమైన హైలైట్‌లు ఉన్నాయి. ఇంకా ఈ కొత్త వెర్షన్ ఫోన్ ఎలాంటి ఫీచర్లను, ఆఫర్లను కలిగి ఉందో ఇక్కడ చూడండి.

Samsung Galaxy S20 FE 2022 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.5-అంగుళాల AMOLED డిస్‌ప్లే

 8 GB ర్యామ్, 128GB స్టోరేజ్ సామర్థ్యం

క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 865 SoC ప్రాసెసర్

వెనకవైపు 12 మెగా పిక్సెల్ కెమెరా + 12MP అల్ట్రాసెన్సార్; ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్‌

4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 25W ఫాస్ట్ ఛార్జర్

క్లౌడ్ వైట్, క్లౌడ్ లావెండర్, క్లౌడ్ నేవీ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 43,500 వరకు ఉండొచ్చు. పాత మోడల్ కంటే దాదాపు రూ. 12,400 తక్కువ. ప్రస్తుతం దక్షిణ కొరియా మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. భారత మార్కెట్లో ఎప్పట్నించీ అనేది కంపెనీ ఇంకా వివరాలను అందించలేదు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్