Sabudana Roti Recipe । సగ్గుబియ్యంతో రోటీ.. ఇది చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
Sabudana Roti Recipe: సగ్గు బియ్యంతో పాయసం, ఉప్మా, ఖిచ్డీ వంటివి మీరు చాలా సార్లు చేసుకొనే ఉంటారు. సగ్గుబియ్యంతో రోటీలు కూడా చేసుకోవచ్చు. సాబుదాన రోటీ రెసిపీని ఈ కింద చూడండి.
Healthy Breakfast Recipes: సాబుదాన లేదా సగ్గుబియ్యం అనేది మన భారతీయ వంటకాల్లో చాలా ఉపయోగిస్తాం. దీనిని స్వీట్ లాగా చేసుకోవచ్చు లేదా వివిధ రకాల అల్పాహారాలుగా తయారు చేసుకోవచ్చు. అయితే సగ్గు బియ్యం ఎలా వస్తుందో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది చెట్లకు పెరిగే ధాన్యం కాదు, విత్తనం లేదా పండు కాదు. ఇది కర్రపెండలం దుంపలను పిండిగా చేసి దాని నుండి ముత్యాల రూపంలో సగ్గుబియ్యం చేస్తారు.
సగ్గుబియ్యం చాలా ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో కొవ్వులు ఉండవు, ప్రోటీన్లు ఉండవు. అవి మాత్రమే కాదు, దీనిలో గ్లూటెన్ కూడా ఉండదు. ఫైబర్ మాత్రం సమృద్ధిగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది జీర్ణక్రియకు మంచిది, మలబద్ధకం సమస్య ఉండదు, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
సగ్గు బియ్యంతో పాయసం, ఉప్మా, ఖిచ్డీ వంటివి మీరు చాలా సార్లు చేసుకొనే ఉంటారు. సగ్గుబియ్యంతో రోటీలు కూడా చేసుకోవచ్చు. సాబుదాన రోటీ రెసిపీని ఈ కింద చూడండి.
Sabudana Roti Recipe కోసం కావలసినవి
- సాబుదానా - 1 కప్పు
- బంగాళదుంపలు - 2-3
- శనగపిండి - 1/2 కప్పు
- జీలకర్ర - 1 tsp
- పచ్చిమిర్చి - 2-3
- ధనియాల పొడి - 1 స్పూన్
- కొత్తిమీర ఆకులు- సన్నగా తరిగినవి
- కారం పొడి - ½ tsp
- ఉప్పు - సరిపడినంత
- నూనె - అవసరమైనంత
సాబుదాన రోటీ తయారీ విధానం
- ముందుగా సాబుదానాను 5-6 గంటలు నానబెట్టి నీటిని వడకట్టండి.
- బంగాళాదుంపలను ఉడకబెట్టి, చర్మాన్ని తొక్క తీసి వాటిని పూర్తిగా గుజ్జులా చేయండి.
- ఆపైన ఒక గిన్నెలో నానబెట్టిన సాబుదానా, బంగాళదుంప గుజ్జు, శనగపిండి ఇతర మసాలాలు వేసి బాగా కలపాలి పిండి ముద్దగా తయారు చేయాలి, ఆపై చిన్నగా విభజించాలి.
- ఆ తర్వాత తావాను వేడి చేసి ½ tsp నూనెను చిలకరించండి.
- ఫ్లాట్ రోటీని తయారు చేసి తవా మీద ఉంచి రెండు వైపులా ఉడికించాలి.
సాబుదాన రోటీ రెడీ. దీనిని పెరుగు రైతాతో కలుపుకొని తింటే టేస్టీగా ఉంటుంది.
సంబంధిత కథనం