Mental Health: ఫ్రెండ్లీ వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌ను సృష్టించడమే, మానసిక ఆరోగ్యానికి నిజమైన చికిత్స-prioritizing mental health in the workplace ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mental Health: ఫ్రెండ్లీ వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌ను సృష్టించడమే, మానసిక ఆరోగ్యానికి నిజమైన చికిత్స

Mental Health: ఫ్రెండ్లీ వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌ను సృష్టించడమే, మానసిక ఆరోగ్యానికి నిజమైన చికిత్స

Galeti Rajendra HT Telugu
Oct 10, 2024 11:36 AM IST

కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగుల ఆత్మహత్యలు, అనూహ్యంగా రాజీనామాల వెనుక కారణాల్ని ఆ కంపెనీలు కప్పి పుచ్చుతున్నాయి. కానీ.. అసలు కారణం ఉద్యోగులు మానసిక అనారోగ్యానికి గురికావడమేనట.

Mental Health
Mental Health (Pixabay )

ఉద్యోగుల మానసిక ఆరోగ్యం గురించి కార్పొరేట్ సంస్థలు కప్పిపుచ్చుతున్నాయి. కానీ.. ఇప్పుడు ఈ పరుగుల ప్రపంచంలో ఇది అతి పెద్ద సమస్య. ఉద్యోగుల ఆత్మహత్యలు, మానసిక కుంగుబాటుతో రాజీనామాలు వంటి ఘటనల్ని కార్పొరేట్ సంస్థలు కప్పిపుచ్చుతున్నాయి. వాస్తవానికి ఇవన్నీ వేర్వేరు ఘటనలు కావు.. అన్నీ మానసిక ఒత్తిడితో కార్పొరేట్ వాతావరణం నుంచి మొదలైనవే. ఏటా అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాం.

కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగులు దీర్ఘకాలిక ఒత్తిడి, అంచనాలను అందుకోవడంలో విఫలమై తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది కేవలం హెచ్‌ఆర్ విభాగాలకి సంబంధించింది కాదు. ఉద్యోగులే మేనేజ్‌మెంట్‌పై ప్రశ్నలు వేసి సమాధానాలు వెతకాలి. మానసిక ఆరోగ్యాన్ని గౌరవించే విధంగా కార్యాలయ వాతావరణాన్ని నిర్మించడం ఎలా అన్నదానిపై ఉద్యోగులే వర్కవుట్ చేయాలి.

లాభాలు, జీతాలే కాదు

కార్పొరేట్ సంస్థలు లాభాలు, ఉద్యోగుల పనితీరును బేరీజు వేయడంలో చూపే శ్రద్ధ ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై చూపడం లేదు. ఉద్యోగులు అంటే కేవలం ఉత్పత్తి ఇచ్చే ఇంజిన్లు కాదు, వారికీ భావోద్వేగ, మానసిక సవాళ్లతో కూడిన ఒత్తిడి ఉంటుందని కార్పొరేట్ కంపెనీలు గ్రహించాలి. కరోనా తర్వాత ఈ ఒత్తిడి ప్రభావం ఉద్యోగులపై మరింత పెరిగింది.

తాజా గణాంకాలు మానసిక ఆరోగ్యం కేవలం వ్యక్తిగత సమస్య కాదని తెలియజేస్తున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యల వల్ల ప్రతి సంవత్సరం 14 బిలియన్ల డాలర్లని కార్పొరేట్ కంపెనీల యజమానులు నష్టపోతున్నారని ప్రముఖ అధ్యయనం ఒకటి అంచనా వేసింది, ఇందులో ఉద్యోగుల గైర్హాజరు, ఉద్యోగులు రాజీనామాలు, పొడెక్టివిటీ తగ్గడం తదితర ఉన్నాయి.

ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్‌ లాభాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, మానసిక ఆరోగ్య చికిత్స కోసం కార్పొరేట్ కంపెనీలు పెట్టిన ప్రతి పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వాటికి వస్తోంది. ఉద్యోగుల గైర్హాజరీ తగ్గడం, పనిలో వేగంతో పాటు ప్రొడెక్టివిటీ పెరుగుతోంది. అందుకే కొన్ని కార్పొరేట్ కంపెనీలు జిమ్, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం వివిధ ఏర్పాటు చేస్తున్నాయి.

మానసిక ఆరోగ్య సంస్కృతిని ఆఫీస్‌లో పెంపొందించడానికి బాస్ ఎక్కువ చొరవ చూపాలి. బాస్ కేవలం విధానాల రూపకర్తలుగా కాకుండా, మానసిక ఆరోగ్యం విషయంలో ఉద్యోగులందరికీ ఆదర్శంగా ఉండాలి. ఆఫీస్‌లో మానసిక ఆరోగ్యం గురించి చర్చ జరిగే వాతావరణాన్ని సృష్టించడం ముఖ్యం. ఉద్యోగులు మానసికంగా బలహీనత అయ్యేలా మాట్లాడటం తగ్గించుకోవాలి. అలానే విరామం తీసుకోవడం బలహీనత సంకేతంగా భావించకూడదు.

బర్న్‌వుట్‌తో జాగ్రత్త

బర్న్‌వుట్ ఒక దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితి, ఇది ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుంది. మానసిక ఆరోగ్యం గురించి చర్చను పనిలో భాగంగా చేర్చాలి. పని వేళలను కొత్తగా ఆలోచించడం, విశ్రాంతి కోసం అవకాశం ఇవ్వడం, ఉద్యోగులు తప్పకుండా బ్రేక్ తీసుకోవడానికి వీలు కల్పించే విధానాలను అమలు చేయడం, పని గంటలు ముగిసిన తర్వాత డిస్ట్రబ్ చేయకుండా ఉండటం, ఆఫీస్‌లో సరదా వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా మానసిక ఆరోగ్యంలో మార్పులు తీసుకురావొచ్చు.

ధ్యానం, యోగా వంటి ఔషధేతర పద్ధతులు కూడా ఒత్తిడిని తగ్గించడంలో, జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ఉపయోగకరమైనవని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. నిరంతర సాధనతో 4 నుండి 8 వారాల్లో 72-82% వరకు ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి లక్షణాలను తగ్గించే ప్రణాళికలు ఉన్నాయని పరిశోధనలు చూపుతున్నాయి.

వర్క్ కల్చర్ 

కార్పొరేట్ సంస్థలు మానసిక ఆరోగ్యాన్ని ఒక కార్యక్రమంగా చూడకుండా, వర్క్ కల్చర్‌లో ఒక భాగంగా చూడాలి. ఎందుకంటే ఉద్యోగులు బాగుంటేనే కదా సంస్థ కూడా బాగుంటుంది. ఇలా

మానసిక ఆరోగ్యం గురించి ఏడాదిలో ఒకసారి మాట్లాడటం కాకుండా.. మన పని సంస్కృతిలో ఎప్పుడు అవసరమైనా చర్చించే విధంగా ఉండాలి. ఎవరు ఎక్కువ పని చేయగలరో కాకుండా, ఎవరు తెలివిగా, సంతోషంగా, ఆరోగ్యంగా పని చేయగలరో కంపెనీలు చూడాలి. మానసిక ఆరోగ్యం అనేది ఒక ట్రెండ్ లేదా హ్యాష్‌టాగ్‌కే పరిమితంకాకూడదు.

-ఇషాన్ శివానంద్, మానసిక ఆరోగ్య పరిశోధకుడు, యోగా ఆఫ్ ఇమ్మోర్టల్స్ వ్యవస్థాపకుడు

Whats_app_banner