World Mental Health Day 2024: మానసిక ఆరోగ్యం విలువ తెలిపేందుకు ప్రపంచ మానసిక ఆరోగ్యం దినోత్సవం వచ్చింది
World Mental Health Day 2024: ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ప్రత్యేకంగా ప్రపంచ ఆరోగ్య మానసిక దినోత్సవం ఏర్పాటు చేసింది. ఏటా అక్టోబర్ 10 న ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు.

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అనేది ప్రజల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి, మానసిక ఆరోగ్య విద్యను ప్రోత్సహించడానికి, మానసిక ఆరోగ్యం చుట్టూ ఉన్న అపోహలను తొలగించడానికి అంకితం చేసిన రోజు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మొదలుపెట్టిన ఈ కార్యక్రమం కుటుంబం, సమాజం, పని ప్రదేశాలలో మానసిక శ్రేయస్సు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్న కాలం ఇది. కానీ ఇప్పటికే మానసిక వ్యాధుల గురించి సరైన అవగాహన లేదు. మానసిక ఆరోగ్య సంరక్షణ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే ఏటా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది.
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 2024 థీమ్
ప్రతి సంవత్సరం, అక్టోబర్ 10 న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించుకుంటారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, 2024 థీమ్ 'మెంటల్ హెల్త్ ఎట్ వర్క్'. ఈ థీమ్ పనిప్రాంతంలో మానసిక ఆరోగ్యం, శ్రేయస్సును పరిష్కరించే అవసరాన్ని నొక్కి చెబుతోంది. ఇది వ్యక్తులకు మాత్రమే కాకుండా సంస్థలు, సమాజానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ చరిత్ర
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని మొదటిసారిగా అక్టోబర్ 10, 1992 న డిప్యూటీ సెక్రటరీ జనరల్ రిచర్డ్ హంటర్ ప్రారంభించారు. ప్రారంభంలో, 1994 వరకు, ఈ రోజు ఒక నిర్దిష్ట థీమ్ లేకుండా మానసిక ఆరోగ్యాన్ని, ప్రజా విద్యను ప్రోత్సహించడంపై విస్తృతంగా దృష్టి సారించింది. 1994 లో, సెక్రటరీ జనరల్ యూజీన్ బ్రాడీ సూచించిన విధంగా, ఈ రోజు మొదటిసారిగా " ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడం" అనే థీమ్ ను పెట్టారు. అప్నట్నించి ఏటా ఏదో ఒక థీమ్ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడం ద్వారా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవానికి మద్దతు ఇస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖలు, పౌర సమాజ సంస్థలతో బలమైన భాగస్వామ్యం ద్వారా, డబ్ల్యూహెచ్ఓ అవగాహనను వ్యాప్తి చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది. సాంకేతిక, కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది.
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రపంచ స్థాయిలో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మానసిక శ్రేయస్సు గురించి బహిరంగ మాట్లాడుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. మానసిక ఆరోగ్య సంరక్షణకు మద్దతు ఇచ్చే కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. ప్రతి సంవత్సరం, మానసిక ఆరోగ్యం అంశాలను హైలైట్ చేయడానికి, మానసిక ఆరోగ్య పరిస్థితులపై అవగాహన పెంచడానికి, వాటి ప్రాముఖ్యతను నొక్కిచెప్పడానికి ఒక థీమ్ ఎంపిక చేస్తున్నారు.
టాపిక్