Milk Mix: వేడి పాలలో ఈ మసాలా మిల్స్ మిక్స్ కలుపుకోండి.. కమ్మదనం, ఉపశమనం-prepare milk mix powder at home for great taste and cold relief ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Milk Mix: వేడి పాలలో ఈ మసాలా మిల్స్ మిక్స్ కలుపుకోండి.. కమ్మదనం, ఉపశమనం

Milk Mix: వేడి పాలలో ఈ మసాలా మిల్స్ మిక్స్ కలుపుకోండి.. కమ్మదనం, ఉపశమనం

Koutik Pranaya Sree HT Telugu
Oct 11, 2024 03:30 PM IST

Milk Mix: వేడి పాలలో కలుపుకుని తాగేందుకు మసాలా మిల్క్ మిక్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు. జలుబు లాంటివి చేసినప్పుడు ఈ మసాలా కలిపిన పాలు తాగితే ఉపశమనం ఉంటుంది. ఈ మిల్క్ మిక్స్ తయారీ చూసేయండి.

మసాలా మిల్క్ మిక్స్
మసాలా మిల్క్ మిక్స్

పాలు ఊరికే తాగడం చాలా మందికి నచ్చదు. అందుకే అందులో ఏదైనా మిల్క్ మిక్స్ పౌడర్ కలుపుకుని తాగుతుంటారు. వాటిని బదులు ఇంట్లోనే మీకు కమ్మగా అనిపించే మసాలా పాలు చేసుకోవచ్చు. ఈ మసాలాను ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే అవసరమున్నప్పుడు వాడుకోవచ్చు. పాలు కమ్మగా అనిపిస్తాయి. వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

మసాలా పాల తయారీకి కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల పాలు

పావు కప్పు బాదాం

పావు కప్పు పిస్తా

పావు కప్పు జీడిపప్పు

రెండు టీస్పూన్ల యాలకుల పొడి

సగం టీస్పూన్ జాజికాయ పొడి

1 టీస్పూన్ కుంకుమపువ్వు (ఆప్షనల్)

2 టేబుల్ స్పూన్ల పంచదార లేదా 2 ఖర్జూరం సన్నటి తరుగు

సగం టీస్పూన్ పసుపు

జలుబు చేసినప్పుడు తాగడానికి:

2 లవంగాలు

అర టీస్పూన్ మిరియాల పొడి

మసాలా పాల తయారీ విధానం:

1. ముందుగా మసాలా తయారీ కోసం బాదాం, పిస్తా, జీడిపప్పు, యాలకులు, జాజికాయ, కుంకుమ పువ్వును కలిపి కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి.

2. ఈ పొడిని ఒక గాజు డబ్బాలో వేసి పెట్టుకోవచ్చు. అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు పైన చెప్పిన కొలతలతో 7 నుంచి 8 గ్లాసుల మసాలా పాలు తయారు చేసుకోవచ్చు.

3. మసాలా పాలు ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం.

4. ఒక పాత్రలో పాలు పోసుకుని మీడియం మంట మీద మరిగేదాకా వేడి అవ్వనివ్వాలి. ఇప్పుడు 2 చెంచాల మసాలా పొడి , పంచదార వేసుకోవాలి. ఖర్జూరం వాడితే వాటి సన్నటి ముక్కలుగా చేసి ఇప్పుడే వేసేయాలి. రెండు నిమిషాలు మరగనిచ్చి సర్వ్ చేసుకుంటే చాలు. చివరగా కుంకుమ పువ్వు, పిస్తా ముక్కలతో అలంకరించుకుంటే మసాలా పాలు సిద్దం.

5. జలుబు లాంటివి చేసినప్పుడు తాగడం కోసం ఉపశమనం దొరికేలా ఉండాలంటే.. ఈ పొడిలోనే రెండు లవంగాలు, సగం టీస్పూన్ మిరియాల పొడి కూడా కలుపుకోవచ్చు. వేడిపాలలో కలుపుకుని తాగితే గొంతుకు ఉపశమనం దొరుకుతుంది.

 

Whats_app_banner