First Pregnancy Tips : మొదటిసారి ప్రెగ్నెంట్ అయ్యారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే-pregnancy tips to women s who conceive first time in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  First Pregnancy Tips : మొదటిసారి ప్రెగ్నెంట్ అయ్యారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే

First Pregnancy Tips : మొదటిసారి ప్రెగ్నెంట్ అయ్యారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 15, 2022 05:09 PM IST

First Pregnancy Tips : గర్భం దాల్చడం, ప్రసవానంతర కాలం అనేది స్త్రీ జీవితంలో చాలా సవాలుతో కూడుకున్న సమయం. ఈ విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే. అయితే మొదటి సారి ప్రెగ్నెంట్ అయితే ఏమి చేయాలి? ఏమి చేయకూడదనే డౌట్స్ చాలా మంది అమ్మాయిల్లో ఉంటాయి. మీరు కూడా అదే ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.

<p>ప్రెగ్నెన్సీ టిప్స్</p>
ప్రెగ్నెన్సీ టిప్స్

First Pregnancy Tips : మొదటిసారి తల్లి అవుతున్నప్పుడు శారీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా చాలా కొత్త సవాళ్లను, మార్పులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్తగా తల్లులు అవుతున్నవారు తమ బేబీలను హెల్తీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. వీటి గురించి ఆన్​లైన్​లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే మొదటిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పుష్కలంగా నీరు తాగాలి..

అభివృద్ధి చెందుతున్న శిశువు చుట్టూ ఉన్న అమ్నియోటిక్ ద్రవం కారణంగా.. మొదటిసారి తల్లులకు సాధారణం కంటే ఎక్కువ నీరు అవసరం. తక్కువ ద్రవ స్థాయి.. గర్భస్రావం లేదా పుట్టుకతో వచ్చే లోపానికి దారితీస్తుంది. అంతేకాకుండా ప్రసవాన్ని క్లిష్టతరం చేస్తుంది. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు మీకు అలవాటుపడిన దానికంటే ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి. లేదంటే మీరు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఇంకా తగినంత నీరు తాగడం వల్ల కీళ్ల వాపు తగ్గుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌లను బయటకు పంపేస్తుంది.

న్యాప్స్ తీసుకోండి..

గర్భధారణ సమయంలో.. ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో అలసట సాధారణం. కాబట్టి నిద్ర చాలా అవసరం. మీ బిడ్డ పుట్టిన వెంటనే మీరు సరిగా విశ్రాంతి తీసుకోలేరు. కాబట్టి ఈ సమయంలో మీరు కచ్చితంగా న్యాప్స్ తీసుకోవాలి. వ్యక్తిగత జీవితంలో ఒత్తిడిని తగ్గించడానికి మధ్యాహ్నం నిద్రపోండి.

క్రమం తప్పకుండా వ్యాయామం..

రెగ్యులర్, మితమైన వ్యాయామం చేయడం వల్ల మీరు నార్మల్ డెలివరీ చేసే అవకాశాలను పెంచుతుంది. ఉదాహరణకు మీరు నడక, సైకిల్ తొక్కడం లేదా తోటపనిని చేయవచ్చు. అదనంగా తక్కువ-ప్రభావం ఉన్న వ్యాయామం చేయడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుంది. రక్తప్రసరణ పెరుగుతుంది. అంతేకాకుండా మానసిక స్థితి మెరుగుపడుతుంది.

బర్త్ ప్లాన్

మీ బిడ్డ పుట్టకముందే తల్లిగా ఉండటం ప్రారంభమవుతుంది. మీ పిల్లల పుట్టుక సురక్షితమైన, మరపురాని అనుభవంగా ఉండాలి. అందువల్ల, మీరు తప్పనిసరిగా ప్రసవ ప్రణాళికను సిద్ధం చేయాలి. స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి సలహా తీసుకోవాలి. మరింత సమాచారం కోసం ఆన్‌లైన్‌లో వెతకాలి. ముఖ్యంగా డాక్టర్​ దగ్గర మీ డౌట్స్ అడగవచ్చు.

ప్రీ-కాన్సెప్షన్ చెక్-అప్

మీరు గర్భం ధరించడానికి ముందు మీ వైద్యునితో మీ ప్రణాళికలను చర్చించండి. ఆరోగ్యకరమైన గర్భం, డెలివరీ కోసం మీరు ఏమి చేయగలరో మీ వైద్యుడిని అడగి తెలుసుకోండి.

ఫ్లూ షాట్

ఇది సురక్షితమైన, అత్యంత సిఫార్సు చేసే ప్రక్రియ. మీరు గర్భవతి అయితే తీవ్రమైన ఫ్లూ సమస్యల బారిన పడే అవకాశముంది. అందువల్ల మిమ్మల్ని, మీ పుట్టబోయే బిడ్డను రక్షించుకోవడానికి మీరు ఫ్లూ వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలి.

కెఫిన్ మానేయండి..

గర్భధారణ సమయంలో కెఫిన్ తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రమాదాలు ఉంటాయి. కెఫీన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఇది మావి ద్వారా మీ పిల్లల రక్తప్రవాహంలోకి వెళుతుంది. పర్యవసానంగా మీరు, మీ బిడ్డ కెఫీన్ దుష్ప్రభావాలకు గురవ్వాల్సి వస్తుంది. సహజంగా కెఫిన్ లేని హెర్బల్ టీకి మారడం మంచిది. అయితే ఈ విషయంపై ముందు వైద్యుడిని సంప్రదిస్తే ఇంకా మంచిది. ఎందుకంటే కొన్ని మూలికలు అకాల ప్రసవానికి కారణం కావచ్చు.

ఆల్కహాల్ మానేయాలి..

మీరు గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే.. మీరు ఆల్కహాల్​కు దూరంగా ఉండాలి. ఇవే కాకుండా గర్భధారణ సమయంలో.. మీకు కావలసినది కచ్చితంగా తినాలి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్చుకోవాలి.

Whats_app_banner

సంబంధిత కథనం