Pregnancy Tests: ప్రెగ్నెన్సీ సమయంలో కచ్చితంగా చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే, వీటితో తల్లీబిడ్డల ఆరోగ్యం తెలిసిపోతుంది-pregnancy tests these are the tests that must be done during pregnancy to know the health of the mother and baby ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pregnancy Tests: ప్రెగ్నెన్సీ సమయంలో కచ్చితంగా చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే, వీటితో తల్లీబిడ్డల ఆరోగ్యం తెలిసిపోతుంది

Pregnancy Tests: ప్రెగ్నెన్సీ సమయంలో కచ్చితంగా చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే, వీటితో తల్లీబిడ్డల ఆరోగ్యం తెలిసిపోతుంది

Haritha Chappa HT Telugu
Feb 02, 2024 09:18 AM IST

Pregnancy Tests: గర్భం ధరించాక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల టెస్టులు చేసుకోవడం ద్వారా తల్లీ బిడ్డల ఆరోగ్యం గురించి వైద్యులు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో కచ్చితంగా చేయించుకోవాల్సిన టెస్టులేంటో తెలుసుకోండి.

ప్రెగ్నెన్సీ టెస్టులు
ప్రెగ్నెన్సీ టెస్టులు (pixabay)

Pregnancy Tests: గర్భం ధరించడమే ఒక వరం. మరొక ప్రాణిని ఈ లోకంలోకి ఆహ్వానించడానికి తల్లిదండ్రులు అన్ని విధాలుగా సిద్ధమవుతారు. అయితే గర్భం ధరించాక తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు కొన్నిరకాల పరీక్షలను కూడా చేయించుకోవాలి. కానీ వీటిపై చాలా తక్కువ మందికే అవగాహన ఉన్నట్లు యూనిసెఫ్ నివేదిక చెబుతోంది. యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రసవ సమయంలో మనదేశంలో 46 శాతం మంది తల్లులు మరణిస్తున్నారు. అలాగే పుట్టిన వెంటనే లేదా పుట్టిన 24 గంటల్లోపు మరణిస్తున్న శిశువుల 40 శాతం మేరకు ఉన్నారు. దీనికి కారణం గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియకపోవడం, అలాగే టీకాలు వేయించుకోకపోవడం అని చెబుతున్నారు వైద్యులు.

గర్భం ధరించాక తల్లి, ఆమె లోపల అభివృద్ధి చెందుతున్న పిండం... రెండింటి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం చాలా ముఖ్యం. గర్భస్థ పిండం అభివృద్ధి సరిగా లేకపోతే తల్లికి ప్రాణానికి కూడా ప్రమాదమే. అలాగే ఆ బిడ్డ బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉండాలి. కొన్ని రకాల పరీక్షల ద్వారా వీరిద్దరి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు.

హోమోగ్రామ్

హోమో గ్రామ్ పరీక్ష చేయడం ద్వారా తల్లి మొత్తం ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. రక్తహీనత వంటి సమస్యలు ఉన్నాయేమో కనిపెట్టవచ్చు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఏ సంఖ్యలో ఉన్నాయో ఈ పరీక్షలో తెలిసిపోతుంది.

బ్లడ్ టైప్

గర్భస్థ శిశువు ఏ రక్త వర్గానికి చెందినవారు ఈ పరీక్షలో తెలుస్తుంది. తల్లి, శిశువు రక్త సమూహం, Rh కారకం మధ్య అనుకూలత లేకపోతే ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పుట్టబోయే శిశువు హేమోలిటిక్ అనే వ్యాధికి గురవ్వచ్చు. కాబట్టి ముందే రక్త పరీక్షల ద్వారా ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉందో లేదో తెలుసుకోవచ్చు.

ఇన్ డైరెక్ట్ కూంబ్స్ టెస్ట్

Rh నెగిటివ్ రకానికి చెందిన తల్లి, Rh పాజిటివ్ కు చెందిన బేబీని మోస్తున్నట్లయితే వారిద్దరికీ ఆరోగ్య ప్రమాదం ఉంటుంది. దీన్ని ముందే తెలుసుకుంటే నవజాత శిశువుకు హెమోలిటిక్ వ్యాధి రాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు.

హెపటైటిస్ బి, HIV, సిఫిలిస్ స్క్రీనింగ్

తల్లికి, బిడ్డకు హెపటైటిస్ బి, హెచ్ఐవి ఇన్ఫెక్షన్, సిఫిలిస్ వంటి వ్యాధులు సోకాయో లేదో ముందుగానే తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తారు.

థైరాయిడ్ ఫంక్షన్

గర్భధారణ సమయంలో థైరాయిడ్ పనితీరు చాలా ముఖ్యం. థైరాయిడ్ హార్మోన్ సరిగా పనిచేయకపోతే తల్లికీ, బిడ్డకూ ఇద్దరికీ ప్రమాదమే. కాబట్టి థైరాయిడ్ ఫంక్షన్ ఎలా ఉందో... థైరాయిడ్ పరీక్ష ద్వారా తెలుసుకుంటే ముందే మందుల ద్వారా జాగ్రత్త పడొచ్చు.

జెస్టేషనల్ డయాబెటిస్

గర్భంతో ఉన్న స్త్రీలలో వచ్చేది జస్టేషనల్ డయాబెటిస్. దీన్ని షుగర్ టెస్ట్ ద్వారా కనుగొంటారు. గర్భిణీ స్త్రీలలో ఈ సమస్య ఉంటే పుట్టబోయే బిడ్డల్లో కొన్ని రకాల సమస్యలు రావచ్చు.

డబుల్ మార్కర్ టెస్ట్

ఈ పరీక్షను గర్భం ధరించిన 11 ఉంది 14 వారాల మధ్య చేస్తారు. ఇది అభివృద్ధి చెందుతున్న పిండంలో క్రోమోజోముల సంఖ్యను లెక్కిస్తుంది. క్రోమోజోమ్‌లో అసాధారణతలు ఉంటే, పిల్లల్లో ఆటిజం వంటి సమస్యలు రావచ్చు. వీటిని ముందుగానే తెలుసుకొని వైద్యులు మీకు సూచిస్తారు.

NT స్కాన్

గర్భం ధరించాక 11 నుంచి 13 మారాల మధ్య ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా ఉమ్మ నీరు ఎలా ఉందో, పిండం మెడ వెనుక భాగం ఎలా ఉందో అల్ట్ సౌండ్ పరీక్ష ద్వారా వైద్యులు పరీక్షిస్తారు.

అనామలీ స్కాన్

ఈ పరీక్షను 18 వారాల నుంచి 22 వారాల మధ్య నిర్వహిస్తారు. ఇది గర్భస్థ శిశువు నిర్మాణాన్ని, అభివృద్ధిని అంచనా వేస్తుంది. కొన్ని అవయవాలు ఏర్పడకపోవడం, అసాధారణతలు వంటివి గుర్తిస్తుంది.

గ్రోత్ స్కాన్

పిండం ఎదుగుదలను అంచనా వేయడానికి ఈ స్కాన్ నిర్వహిస్తారు. తల చుట్టుకొలత, పొత్తికడుపు చుట్టుకొలత, తొడ ఎముక పొడవు, శిశువు బరువు, ఉమ్మనీరు వంటివన్నీ ఈ పరీక్షలో తెలుసుకుంటారు.

Whats_app_banner