PeriMenopause: మెనోపాజ్ వచ్చే ముందు మీ పీరియడ్స్‌లో కనిపించే మార్పులు ఇవే-perimenopause these are the changes seen in your period before menopause ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Perimenopause: మెనోపాజ్ వచ్చే ముందు మీ పీరియడ్స్‌లో కనిపించే మార్పులు ఇవే

PeriMenopause: మెనోపాజ్ వచ్చే ముందు మీ పీరియడ్స్‌లో కనిపించే మార్పులు ఇవే

Haritha Chappa HT Telugu
Mar 15, 2024 01:28 PM IST

PeriMenopause: పెరిమెనోపాజ్... ఇదే మెనోసాజ్‌కు ముందు దశ అని చెప్పుకోవాలి. పెరిమెనోపాజ్ దశలో పీరియడ్స్‌లో కొన్ని రకాల మార్పులు కనిపిస్తాయి. ఆ మార్పుల గురించి ప్రతి మహిళ తెలుసుకోవాలి.

పెరిమెనోపాజ్ అంటే ఏమిటి?
పెరిమెనోపాజ్ అంటే ఏమిటి? (pixabay)

PeriMenopause:ప్రతి మహిళ మెనోపాజ్ దశకు చేరుకుంటుందని చెప్పడానికి ముందు దశ పెరిమెనోపాజ్. ఈ దశలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే త్వరలో మెనోపాజ్ రాబోతోందని అర్థం. నిజానికి పెరిమెనోపాజ్ దశ కొంతమంది స్త్రీలలో 30 ఏళ్లకే మొదలవుతుంది. మరికొంతమందికి 40 ఏళ్ల నుంచి 44 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతుంది. పీరియడ్స్ విషయంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ఈ దశలో అండాశయాలు ఈస్ట్రోజన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. దీనివల్ల పీరియడ్స్ సరిగ్గా రావు. హార్మోన్ల అసమతుల్యత సమస్య కూడా వస్తుంది. ఈ పెరిమెనోపాజ్ దశలోనే శరీరం మెనోపాజ్‌కు సిద్ధపడుతుంది.

పెరిమెనోపాజ్ దశలో నెలసరి క్రమం తప్పుతుంది. అంటే ప్రతినెల నెలసరి రాకుండా మారుతూ ఉంటుంది. ఒక నెలలో ఎక్కువ రోజులు బ్లీడింగ్ కావడం, మరో నెలలో తక్కువ రోజులు కావడం అనే మార్పులు కనిపిస్తాయి. కొన్నిసార్లు రక్తస్రావం భారీగా అవుతుంది.

పెరిమెనోపాజ్ దశలో హార్మోన్లు స్థాయిలలో హెచ్చుతగ్గులు అధికంగా ఉంటాయి. దీని వల్లే ఋతుస్రావం సమయంలో కోల్పోయే రక్తం ఆధారపడి ఉంటుంది. కొంతమంది మహిళలకు అధిక రక్తస్రావం కావడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఈ దశలో నెలసరి కొంతమంది స్త్రీలలో ఎక్కువ కాలం పాటు కొనసాగుతూ రావచ్చు. సాధారణంగా మూడు నుంచి ఐదు రోజుల్లో రక్తస్రావం ఆగిపోతుంది. అలా కాకుండా వారం నుంచి 15 రోజుల వరకు కొనసాగుతూ ఉంటే మీరు మెనోపాజ్‌కు దగ్గర పడుతున్నారని అర్థం చేసుకోవాలి.

లక్షణాలు ఇలా

నెలసరి సమయంలో వక్షోజాలు సున్నితంగా మారుతాయి. మానసికంగా కల్లోలంగా అనిపిస్తుంది. పొట్ట ఉబ్బరంగా, తిమ్మిరిగా అనిపిస్తుంది. మెనోపాజ్ వచ్చేముందు ఈ లక్షణాలు ఎక్కువైపోతాయి. హార్మోన్ల స్థాయిలలో విపరీతమైన మార్పులే దీనికి కారణం.

పెరి మెనోపాజ్ సమయంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల నెలలో రెండు సార్లు నెలసరి వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఒకసారి బ్లీడింగ్ కనిపించి ఆగిపోవచ్చు కూడా. కాబట్టి కొంతమంది స్త్రీలకు రుతుస్రావం ఒక నెల రాకపోవడం కూడా జరుగుతుంది.

పెరి మెనోపాజ్ దశ అండోత్సర్గాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అండోత్సర్గము అంటే అండాశయాలు గుడ్లను విడుదల చేసే ప్రక్రియ. పెరీమెనోపాజ్ దశలో అండోత్సర్గము సరిగా జరగక గుడ్డు విడుదల కాదు.

ఈ దశలో రుతుచక్రంలో తీవ్ర మార్పులు వచ్చినా, రక్తస్రావం అధికంగా అవుతున్నా వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది. శరీరం నుంచి వేడి ఆవిర్లు విడుదలవడం, మూడు స్వింగ్స్, నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాల కనిపిస్తే ఒకసారి వైద్యులను సంప్రదించి తగిన మందులు వాడడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మెనోపాజ్ దశకు చేరుకుంటున్న వారు ముందుగానే జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. ఒత్తిడి బారిన పడకుండా ఉండాలి. పుష్కలంగా నీరు తాగాలి. ఆల్కహాల్, ధూమపానం వంటివి మానేయాలి. రాత్రిపూట ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. ఇవన్నీ చేయడం వల్ల మెనోపాజ్ దశలో కనిపించే సమస్యలను తట్టుకునే శక్తి వస్తుంది.

Whats_app_banner