Diabetes tips: డయాబెటిస్ ఉన్నవారు రాత్రి పడుకోబోయే ముందు ఈ చిన్న పని చేయండి చాలు, మధుమేహం పెరగదు
Diabetes tips: చెడు జీవనశైలి కారణంగా చాలా మంది షుగర్ బారిన పడుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం, చక్కెర స్థాయిలను నియంత్రణలో పెట్టడానికి జాజికాయను ఉపయోగించుకోవచ్చు. జాజి కాయ పొడిని ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే చాలు షుగర్ అదుపులో ఉండడం ఖాయం.
షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. దాన్ని అదుపులో పెట్టుకోలేక మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి వారికి ఇంట్లో ఉండే మసాలా దినుసే ఎంతో సహాయపడుతుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది. అదే జాజికాయ.
జాజికాయను మసాలా దినుసుగా ఏళ్ల తరబడి ఉపయోగిస్తున్నారు. అయితే ఈ జాజికాయను ఆహారం రుచి, వాసనను పెంచడానికి మాత్రమే కాకుండా, దీనిని ఔషధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఆయుర్వేదంలో, జాజికాయ అనేక వ్యాధులలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చక్కెర వంటి ప్రమాదకరమైన వ్యాధులను జాజికాయ చాలా ప్రభావవంతంగా అడ్డుకుంటుంది.
చెడు జీవనశైలి కారణంగా ఈ కాలంలో డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఒకసారి షుగర్ వ్యాధి వస్తే దాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలోమీరు జాజికాయను మీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. జాజికాయను ఎలా వాడాలో, మధుమేహాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ మేము చెబుతున్నాము, ఇలా వాడారంటే మధుమేహం అదుపులో ఉండడం ఖాయం.
జాజికాయ రక్తంలో చక్కెర స్థాయిని చాలా వరకు నియంత్రిస్తుందని అనేక అధ్యయనాల్లో రుజువైంది. జాజికాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా ఉంటాయి. నిజానికి క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు రక్తంలో చక్కెర పరిమాణం పెరగడం మొదలవుతుంది. జాజికాయ క్లోమం కణాలను సక్రియం చేస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. వీటితో పాటు జాజికాయ తినడం వల్ల జీర్ణశక్తి కూడా బాగుంటుంది. దీనితో పాటు, జాజికాయలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇతర వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
ఇలా వాడండి
ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం జాజికాయను పొడి చేసి దాచుకోండి. ప్రతి రోజు రాత్రి పడుకోబోయే ముందు పాలలో చిటికెడు జాజికాయ పొడి కలిపి తాగడం ప్రారంభించండి. ఇలా తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది. జాజికాయ పొడిని మరుగుతున్న పాలల్లో వేసి బాగా వేడి చేయాలి. పాలు బాగా మరిగిన తర్వాత జాజికాయ సారం పాలల్లో కలిసిపోతుంది. ఇప్పుడు పాలను వడగట్టి వేడివేడిగా తాగాలి. జాజికాయ పాలు రాత్రిపూట ఒక వారం పాటు నిరంతరాయంగా తాగిన తర్వాత, మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిలలో తేడాను గమనించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం, జాజికాయ చక్కెరను అదుపులో ఉంచడానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది.
కీళ్ల నొప్పులను తగ్గించే జాజికాయ
డయాబెటిస్‌తో పాటు, జాజికాయ అనేక ఇతర వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. జాజికాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మలబద్ధకం, హేమోరాయిడ్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. గ్యాస్, అజీర్తి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు ఊబకాయం సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కీళ్ల నొప్పుల సమస్య ఉంటే జాజికాయను ఆవనూనెలో గ్రైండ్ చేసి మిక్స్ చేసి కీళ్లకు అప్లై చేసి మసాజ్ చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
టాపిక్