Fathers Day : తండ్రీకొడుకుల బంధం బలంగా ఉండాలంటే ఏం చేయాలి?-parenting tips fathers day 2024 simple ways to strengthen a father son relationship ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fathers Day : తండ్రీకొడుకుల బంధం బలంగా ఉండాలంటే ఏం చేయాలి?

Fathers Day : తండ్రీకొడుకుల బంధం బలంగా ఉండాలంటే ఏం చేయాలి?

Anand Sai HT Telugu
Jun 14, 2024 02:00 PM IST

Parenting Tips In Telugu : తండ్రీకొడుకుల బంధం చాలా విలువైనది. అయితే చాలా ఇళ్లలో తండ్రీకొడుకుల ఎక్కువగా క్లోజ్ ఉన్నట్టుగా కనిపించదు. వీరిద్దరి బంధం బలంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

తండ్రీకొడుకుల కోసం చిట్కాలు
తండ్రీకొడుకుల కోసం చిట్కాలు (Unsplash)

చాలా ఇళ్లలో తండ్రీ కొడుకులు అంతగా సన్నిహితంగా ఉండరు. మగ పిల్లలు ఎప్పుడూ తమ తల్లులతో అనుబంధంగా ఉంటారు. నాన్నని చూస్తే ఏదో భయం. దాంతో తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ ఏర్పడినట్టుగా అనిపిస్తుంది. ఓ వైపు తండ్రికి కొడుకుపై అమితమైన ప్రేమ ఉన్నా చెప్పుకోలేక పోతాడు. అయితే తండ్రి, కొడుకు మధ్య సంబంధాన్ని ఎలా మెరుగుపరచాలో తెలుసుకుందాం.

కలిసి నడవండి

సాధారణంగా అబ్బాయిలు చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉంటారు. ఆట అంటే పంచ ప్రాణం. అబ్బాయిలు చిన్నప్పటి నుంచి కఠినంగా ఉంటారు. ఎవరి మాట వినడానికి సిద్ధంగా ఉండరు కొందరు. కానీ నాన్నని చూస్తే కొంచెం భయం. అటువంటప్పుడు వాకింగ్ లేదా జాగింగ్‌కు వెళ్లేటప్పుడు మీ కొడుకును వెంట తీసుకెళ్లండి. మీరు చేసే ప్రతి కార్యకలాపంలో అతనిని పాల్గొనేలా చేయండి. అప్పుడే తండ్రీకొడుకుల బంధం మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇద్దరూ కలిసి వెళ్లేటప్పుడు అనేక విషయాలను మాట్లాడుకుంటారు.

ఇద్దరి ఆసక్తులపై మాట్లాడండి

ఉమ్మడి ఆసక్తులు ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ కలిసి ఉంటారు. చాలా మంది తండ్రి, కొడుకులు ఒకే విధమైన ఆసక్తులను కలిగి ఉంటారు. మీకు ఆసక్తి ఉన్న రంగాలపై కొడుకు ఆసక్తి కలిగి ఉంటే చిన్నతనం నుండి కొడుకును ప్రోత్సహించాలి. మీరు అతనితో నిలబడి అతనికి మార్గనిర్దేశం చేయాలి. ఇది మీ బంధాన్ని కూడా పెంచుతుంది.

కలిసి పనులు చేయండి

తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి తమ బంధాన్ని మెరుగుపరచుకోవడానికి కృషి చేయాలి. వంట చేసేటప్పుడు మీ కొడుకు సహాయం తీసుకోండి. బైక్, కారు కడగడానికి మీ కొడుకును కూడా తీసుకెళ్లండి. అతనికి కూడా నేర్పించండి. చిన్నప్పటి నుంచి దీన్ని ఆచరిస్తే పెద్దయ్యాక తప్పకుండా ఉపయోగపడుతుంది. దానికి తోడు నాన్నంటే భయం పోతుంది.

కొడుకు మాట వినాలి

పిల్లలు చిన్నవారైతే తండ్రికి అన్నీ చెబుతారు. ఇలాంటప్పుడు చాలా మంది తండ్రులు కొడుకు మాట వినడం చేయరు. దీనితో తల్లికి అన్ని విషయాలు చెప్పడం మెుదలుపెడతాడు కొడుకు. దీని వల్ల పిల్లలు కూడా అలవాటు పడతారు. తండ్రి ఎప్పుడూ తన కొడుకు చెప్పేది ఓపికగా వినాలి. మరి దీనికి పరిష్కారం వెతకాలి. దీంతో ఇద్దరి మధ్య బంధం కూడా పెరుగుతుంది.

కొడుకుతో స్నేహం చేయాలి

యుక్తవయస్సులో పిల్లల శరీరం, మనస్సులో అనేక మార్పులు ఉంటాయి. ప్రేమలో పడవచ్చు లేదా మరేదైనా సమస్య ఉండవచ్చు. చాలా సార్లు పిల్లలు ఇంట్లో ఇవన్నీ చెప్పరు. తమ స్నేహితులకు చెబుతారు. అయితే తండ్రి పిల్లలతో స్నేహితుడిలా ఉంటే పిల్లలు కచ్చితంగా అన్ని ఆలోచనలను పంచుకుంటారు. పిల్లల సమస్య కూడా తగ్గిపోతుంది.

మంచి చెడు చెప్పాలి

చిన్నతనంలో కార్టూన్లు చూస్తూ పెరిగే పిల్లలు పెద్దయ్యాక కొన్ని టీవీ షోలు చూడటం మొదలుపెడతారు. అది వారి మనసును ప్రభావితం చేయవచ్చు. ఇది జరగనివ్వవద్దు. ఈ వయస్సులో తండ్రి పిల్లలతో మంచి స్నేహాన్ని పెంచుకోవాలి. తప్పు ఏమిటి? ఏది సరైనది ఏది చెప్పాలి.

ఈ పై ఆలోచనలు తండ్రీకొడుకుల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. తండ్రులు తమ పిల్లల మనసుల నుంచి భయాన్ని తీసేయాలి. మీరు వారితో స్వేచ్ఛగా ఉంటే, పిల్లలు తప్పుదారిలో వెళ్లరు. బంధం కూడా మెరుగ్గా ఉంటుంది.

Whats_app_banner