Chanakya Niti Telugu : ఈ రకమైన వ్యక్తులు జీవితంలో అస్సలు ఫెయిల్ అవ్వరు
Chanakya Niti In Telugu : జీవితంలో విజయం సాధించాలంటే సరైన ప్రణాళిక ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. కొన్ని రకాల అలవాట్లు ఉన్న మనుషులు జీవితంలో అస్సలు ఫెయిల్ అవ్వరు అని చాణక్యుడు చెప్పాడు.
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు, వ్యూహకర్త. ఆయన విధానాలు నేటికీ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఇప్పటికీ చాణక్యుడి విధానాలను పాటించేవారు ఉన్నారు. చాణక్యనీతిలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. సంతోషకరమైన జీవితానికి సంబంధించిన అనేక రహస్యాలు చెప్పాడు. వీటి ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
మీరు కూడా జీవితంలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన కొన్ని మాటలను కచ్చితంగా పాటించండి. చాణక్యుడి సూత్రాలు, ఆలోచనలను అవలంబించడం ద్వారా జీవితంలో చాలా త్వరగా విజయం సాధించవచ్చు. చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలు అందరికీ ఉపయోగపడతాయి. మనం జీవితంలో గెలుపును ముద్దాడాలి అంటే చాణక్య నీతి మనకు దారి చూపిస్తుంది.
ప్రతీ వ్యక్తి జీవితంలో గెలుపు ఓటములు సాధారణం. కానీ నిరంతరం సరైన మార్గంలో నడిచే వారి ద్వారా మాత్రమే పురోగతివైపు వెళ్తుంది. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కొన్ని విషయాలను ప్రస్తావించాడు. మీరు వాటిని పాటిస్తే ముందుకు వెళ్లవచ్చు.
చాణక్య నీతి ప్రకారం జీవితంలో విజయాన్ని తెచ్చే మొదటి విషయం లక్ష్యాన్ని సాధించాలనుకోవడం. దానికోసం ఏం చేస్తున్నారు.. ఎంత చక్కగా ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తున్నారు అనేది చాలా కీలకం. మీరు ఉన్న చోటు, మీ చుట్టు ఉన్నవారి గురించి మీకు అంచనా ఉండాలి. లేకపోతే లక్ష్యం కోసం మీరు వెళ్లే ప్రయాణంలో చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి తెలియని వ్యక్తి పనిలో తప్పులు చేస్తాడు. అపజయాన్ని చూస్తాడు.
జీవితంలో ఏ ప్రణాళికైనా మీ దు:ఖం, సంతోషాన్ని బెస్ చేసుకుని ఉండాలి. దాని ప్రకారమే ప్రణాళికలు వేసుకోవాలి. జీవితంలో ఎప్పుడూ కూడా ఈ రెండింటో ఏది వచ్చినా.. ఆగిపోకూడదు. మీకంటూ ఉన్న లక్ష్యంతో ముందుకు వెళ్లాలి. ఎందుకంటే ఒక్కసారి సమయం వెళ్లిపోతే తిరిగి రాదు. చాలా మంది ఇబ్బందులు వస్తే అక్కడే ఆగిపోతారు. కానీ ముందుకు వెళ్లినవాడే విజయం సాధిస్తాడు. ఎలాంటి పరిస్థితులోనైనా ఓపికతో ముందుకు సాగాలి.
జీవితంలో ఎదగాలంటే మీ గురించి మీకు తెలిసి ఉండాలి. అవును మీ సామర్థ్యం మీకు తెలిస్తే మీరు ఎలా ప్రయాణించాలో తెలిసిపోతుంది. లేదంటే విజయం సాధించడం కష్టం అవుతుంది. గమ్యం వైపు వెళ్లే దారిలో వచ్చిన కష్టాలను ఎదుర్కొనేందుకు మీకంటూ గొప్ప శక్తి కావాలి. సామర్థ్యంతో ఎదుర్కోవాలి. అప్పుడే గెలుపు మీ సోంతం అవుతుంది.
మీతో నడిచేవారి గురించి మీకు ఒక అంచనా ఉండాలి. ఎందుకంటే మనతో నడిచే వ్యక్తులు అందరూ మంచి చేస్తారని చెప్పలేం. స్నేహంగా ఉంటునే వెన్నుపోటు పొడవవచ్చు. అందుకే మిమ్మల్ని ఓడించేవారు ఎవరు, మీరు పైకి ఎదిగేందుకు నిచ్చెనలా ఉపయోగపడేవారు ఎవరు అని ముందే గుర్తించాలి.
పైన చెప్పిన నాలుగు విషయాలను పాటించేవారు వ్యక్తులు జీవితంలో అస్సలు ఓడిపోరు. ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఫెయిల్ అవ్వరని చాణక్య నీతి చెబుతుంది. చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలు పాటిస్తే ఎవరైనా గెలుపును చూస్తారు. విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.