Palakura Pakodi Recipe। పాలకూర పకోడిలు.. మాన్‌సూన్ సాయంకాలాలలో రుచికరమైన చిరుతిండి!-palakura pakodi for monsoon evening snack cravings check recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Palakura Pakodi Recipe। పాలకూర పకోడిలు.. మాన్‌సూన్ సాయంకాలాలలో రుచికరమైన చిరుతిండి!

Palakura Pakodi Recipe। పాలకూర పకోడిలు.. మాన్‌సూన్ సాయంకాలాలలో రుచికరమైన చిరుతిండి!

HT Telugu Desk HT Telugu
Jul 20, 2023 04:52 PM IST

Palakura Pakodi Recipe: పాలకూరను కలిపి పకోడిలు చేసుకుంటే, కేలరీలను తగ్గించవచ్చు, రుచి కూడా పెరుగుతుంది. పాలకూర పకోడి రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం, ఇలా మీరూ ఒకసారి ట్రై చేసి చూడండి.

Palakura Pakodi Recipe
Palakura Pakodi Recipe (stock pic)

Monsoon Recipes: మాన్‌సూన్ ఇప్పుడు దాని గరిష్ట స్థాయికి చేరుకున్నట్లుగా ఉంది. చాలా ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జలజల జలపాతంలా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇంట్లోనే ఉంటూ వర్షాన్ని చూస్తూ ఆనందించాలి. ఇటువంటి సమయంలో వేడివేడి పకోడిలను కోరుకోకుండా ఎవరు ఉండగలరు? అద్భుతమైన సాయంత్రం వేళ స్నాక్స్ ఆస్వాదించడానికి వర్షాకాలం సరైనది. అయితే పకోడీలు తినాలంటే, వీటిలో అధిక మొత్తంలో ఉండే కేలరీలు, ఎక్కువ నూనె మనల్ని ఆలోచింపజేయవచ్చు. ఆరోగ్యంపై మనం ఆందోళన చెందవచ్చు. కానీ ఏదేమైనా తినకుండా మాత్రం ఉండలేం. దీనికి ఆరోగ్యకరమైన పరిష్కారంగా మనం కొన్ని మార్పులు చేసుకోవచ్చు. పాలకూరను కలిపి పకోడిలు చేసుకుంటే, కేలరీలను తగ్గించవచ్చు, రుచి కూడా పెరుగుతుంది. పాలకూర పకోడి రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం, ఇలా మీరూ ఒకసారి ట్రై చేసి చూడండి.

Spinach/ Palakura Pakodi Recipe కోసం కావలసినవి

  • 10-12 పాలకూర ఆకులు
  • 1 కప్పు శనగపిండి
  • ¼ టీస్పూన్ వాము
  • ¼ టీస్పూన్ పసుపు
  • ¼ స్పూన్ కారం
  • ¼ టీస్పూన్ ఇంగువ
  • రుచికి తగినంత ఉప్పు
  • వేయించడానికి నూనె

పాలకూర పకోడి తయారీ విధానం

  1. ముందుగా ఒక పెద్ద గిన్నెలో శనగపిండిని తీసుకుని అందులో వాము, పసుపు పొడి, కారం, ఉప్పు, ఇంగువ వేసి తగినన్ని నీళ్లతో కలపండి.
  2. పకోడిలు వచ్చేలా సరైన అనుగుణ్యతతో మృదువైన పిండిని ఏర్పరచడానికి బాగా కలపాలి.
  3. ఇప్పుడు కడాయి తీసుకుని నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒక్కో పాలకూర ఆకును పిండిలో ముంచి నూనెలో వేసి బ్రౌన్‌ రంగు వచ్చేవరకు వేయించాలి.

అంతే, పాలకూర పకోడి రెడీ. ఒక శోషణ కాగితంతో అదనపు నూనెను తీసివేసి, గ్రీన్ చట్నీ , చింతపండు చట్నీతో సర్వ్ చేయాలి.

Whats_app_banner

సంబంధిత కథనం