చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రత, తక్కువ తేమ శాతం మీ శరీరాన్ని పొడిగా, పొరలుగా, చికాకుగా మారుస్తాయి. శీతాకాలంలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఈ 10 చిట్కాలు అనుసరించండి.  

pexels

By Bandaru Satyaprasad
Dec 16, 2024

Hindustan Times
Telugu

కొన్ని రకాల సబ్బులు శరీరంలోని నూనెలను తొలగిస్తాయి. ఇవి చర్మా్న్ని పొడిగా మార్చి చికాకుకు దారితీస్తాయి. మీ చర్మంలో తేమ శాతాన్ని తొలగించకుండా కేవలం మురికిని తొలగించే సున్నితమైన హైడ్రేటింగ్ క్లెన్సర్ ను ఉపయోగించండి.  

pexels

క్రమం తప్పకుండా శరీరాన్ని మాయిశ్చరైజ్ చేసుకోండి. హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్ లేదా సిరామైడ్  వంటి పదార్థాలు శరీరంలో తేమ శాతం నిర్వహించేందుకు సహాయపడతాయి.  

pexels

చలికాలంలో ఉపయోగించే సబ్బులు, క్లెన్సర్ లు, లోషన్లలో కఠినమైన రసాయనాలు లేని వాటిని ఎంచుకోండి. సువాస లేని పదార్థాలను ఉపయోగించండి.  

pexels

చలికాలంలో ఎక్కువ సేపు వేడి నీటి స్నానాలు మీకు కాస్త ఉపశమనంగా ఉంటాయి. కానీ ఎక్కువ సేపు స్నానం చేయడం వల్ల మీ చర్మానికి అవసరమైన తేమను తొలగిస్తాయి. శీతాకాలంలో తక్కువ సమయంలోనే స్నానం చేయండి.  

pexels

చలికాలంలో తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల మీ చర్మంలో తేమ సమతుల్యతను కాపాడుతుంది. డీహైడ్రేషన్ ను నివారిస్తుంది.  

pexels

మీ చర్మం హైడ్రేట్ గా ఉండటానికి సహాయపడే హ్యూమిడిఫైయర్ ను ఇంట్లో పెట్టుకోండి. చలికాలంలో ఇవి ఇంట్లో తేమ శాతాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. 

pexels

డెడ్ స్కిన్ చికాకును పెంచుతుంది. కాబట్టి వారానికి ఒకసారి సున్నితమైన స్క్రబ్ లేదా కెమికల్ ఎక్స్ ఫోలియంట్ తో ఎక్స్ పోలియేట్ చేయండి. అతిగా ఎక్స్ ఫోలియేట్ చేయడం మానుకోండి. 

pexels

చల్లని గాలులు, అత్యల్ప ఉష్ణోగ్రతలు మీ చర్మానికి హాని కలిగిస్తాయి. మీ చర్మాన్ని చల్లని గాలుల నుంచి రక్షించుకునేందుకు బయటకు వెళ్లేటప్పుడు గ్లౌజ్ లు, స్కార్ఫ్ లు ధరించండి.  

pexels

యూవీ కిరణాలు శీతాకాలంలో కూడా మీ చర్మాన్ని దెబ్బతీస్తాయి. స్కిన్ ను డ్రై గా చేస్తాయి. హానికరమైన కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షించడానికి ప్రతి రోజు హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ ఉపయోగించండి.  

pexels

రాత్రి పడుకునే ముందు రిచ్ నైట్ క్రీమ్ ను అప్లై చేయండి. ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చర్మం పొరలుగా మారడాన్ని నివారిస్తుంది.  

pexels

శరీరంలో లక్షల కోట్ల జీవకణాలకు శక్తిని సమకూర్చడానికి పనిచేసే అవయవాల సమాహారమే జీర్ణాశయ వ్యవస్థ..