వారంలో ఒక్కసారైనా శృంగారంలో పాల్గొనకపోతే.. ఏమవుతుందో తెలుసా?-new study says the relation between sex freqeuency and women mortality rate ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  వారంలో ఒక్కసారైనా శృంగారంలో పాల్గొనకపోతే.. ఏమవుతుందో తెలుసా?

వారంలో ఒక్కసారైనా శృంగారంలో పాల్గొనకపోతే.. ఏమవుతుందో తెలుసా?

Koutik Pranaya Sree HT Telugu
Aug 13, 2024 07:57 AM IST

వారానికి ఒకసారి శృంగారంలో పాల్గొనడం వల్ల ఆయుష్షు పెరుగుతుందా? వాస్తవాలు తెల్సుకోండి.

శృంగారం గురించి సర్వే
శృంగారం గురించి సర్వే

మహిళల్లో శృంగారం మీద కోరిక క్రమంగా తగ్గపోతుంది. కొంతమంది లైంగిక సంబంధానికి పూర్తిగా దూరంగా ఉండిపోతారు. కానీ మీ ఆయుష్షుకు, శృంగారానికి సంబంధం ఉంటే నమ్ముతారా? తాజా సర్వే చెబుతుందిదే. జర్నల్ ఆఫ్ సైకోలాజికల్ హెల్త్ ప్రచురించిన కథనం ప్రకారం శృంగారంలో ఎన్ని సార్లు పాల్గొన్నారనే విషయానికి, మరణ రేటుకు సంబంధం ఉందని తేలింది. 2005 నుంచి 2010 దాకా నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రీషన్ ఎగ్జామినేషన్ సర్వే (NHANES) వివరాల ఆధారంగా ఈ విషయం తేల్చారు. కనీసం వారానికి ఒకసారైనా శృంగారంలో పాల్గొనని మహిళల్లో మరణ రేటు అవకాశం పెరుగుతుందట. వారానికి ఒకసారైనా సెక్స్ లో పాల్గొనేవాళ్లలో ఈ రేటు తక్కువగా ఉంది.

మ్యాజిక్ నంబర్ 7:

ఈ సర్వే ప్రకారం ఏడో అంకె ఒక మ్యాజిక్ నంబర్. ఏడు రోజులకు లేదా వారానికి ఒకసారి శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పూర్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు సెక్స్ చేయడం వల్ల అదనపు ప్రయోజనాలు లేనప్పటికీ, శృంగారానికి దూరంగా ఉండలం వల్ల దీర్ఘకాలంలో ప్రభావం ఉంటుంది.

ఆరోగ్య ప్రయోజనాలు:

శృంగారం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ విడుదలవుతాయి. ఇవి మూడ్ మెరుగుపరుస్తాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తాయి. తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల వీటి ఉత్పత్తి పెరగుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల బారిన పడకుండా ఉండగలరు. ముఖ్యంగా ఎండార్ఫిన్లు విడుదలవ్వడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త సరఫరా పెరుగుతుంది. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ విడుదలవ్వడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది.

డిప్రెషన్ తగ్గుతుంది:

శృంగారంలో ఎక్కువ సార్లు పాల్గొనే వారిలో నిరాశ, డిప్రెషన్ తక్కువగా ఉంటాయని నివేదిక చెబుతుంది. తక్కువ సార్లు శృంగారం పాల్గొని, డిప్రెషన్ లో ఉన్న మహిళల్లో అకాల మరణ రేటు అవకాశం 197 శాతం ఎక్కువుంది. ఈ సర్వే కేవలం మహిళలను ఉద్దేశించి చేసింది. కాబట్టి పురుషుల్లోనూ ఇదే ప్రభావం ఉంటుందని చెప్పలేము.

మానసిక ఆందోళనలకు, ఇబ్బందులకు సెక్స్ అనేది థెరపీగా పనిచేయదు. ఏ చికిత్సకు సెక్స్ అనేది భర్తీ చేయదు. సెక్స్ వల్ల విపరీతమైన శారీరక, మానసిక లాభాలు లేకపోవచ్చు. కానీ ఈ నివేదిక ప్రకారం శృంగార రేటుకు, అకాల మరణానికి ఉన్న సంబంధం మాత్రం ప్రమాద సూచికగా గమనించుకోవాలి. ఏ పనైనా వ్యసనంలాగా మార్చుకున్నా, దాని జోలికే పోకపోయినా ప్రమాదమే. జీవితానికి కావాల్సింది అందుకుంటే చాలు. మీకు సరైందేదో తెల్సుకుంటే చాలు.

Whats_app_banner