After Workout : వ్యాయామం చేసిన తర్వాత ఈ ఆహారాలు తినొద్దు-never eat these foods after workout all you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  After Workout : వ్యాయామం చేసిన తర్వాత ఈ ఆహారాలు తినొద్దు

After Workout : వ్యాయామం చేసిన తర్వాత ఈ ఆహారాలు తినొద్దు

Anand Sai HT Telugu
Jan 31, 2024 05:30 AM IST

After Workout Foods Tips : వ్యాయామం చేసిన తర్వాత ఏం తినాలో.. ఏం తినకూడదో కూడా తెలిసి ఉండాలి. అప్పుడే మీరు చేసిన వర్కౌట్‌కు ఫలితం ఉంటుంది.

జిమ్ చేసిన తర్వాత తినకూడని ఆహారాలు
జిమ్ చేసిన తర్వాత తినకూడని ఆహారాలు

ఫిట్‌గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ దానికి తగినట్టుగా మనం తినే ఆహారం కూడా ఉండాలి. అప్పుడే జిమ్‌ వెళ్లినా ప్రయోజనం ఉంటుంది. లేదంటే ఎంత వర్కౌట్ చేసినా నో యూజ్. శరీరారకృతిని మెరుగు పరుచుకోవాలంటే.. కచ్చితంగా వ్యాయామం చేయడంతోపాటుగా మంచి ఆహారం తీసుకోవాలి. పౌష్టికాహారం లేకుంటే ఎంత ట్రై చేసినా మీ శరీరం సరిగా ఉండదు. జిమ్‌కు వెళ్లేముందు తినేందుకు కొన్ని ఆహారాలు ఉన్నట్టే.. కొన్ని చెడు ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిని వ్యాయామం చేసిన తర్వాత అస్సలు తినకూడదు. ఆ ఆహారాలు ఏంటో చూద్దాం..

జిమ్‌కు వెళ్లేవారు మాంసం ఎక్కువగా తినాలని అందరూ అంటారు. కానీ నిజంగా ఇది అవసరం లేదు. మీరు బరువు పెరగాలనుకుంటే జిమ్‌కి వెళ్లిన తర్వాత విశ్రాంతి తీసుకోండి. తక్కువ ఉప్పు ఉన్న మాంసం తినవచ్చు. బరువు తగ్గించుకునేందుకు జిమ్‌కి వెళ్లాలనుకుంటే మాంసాహారానికి దూరంగా ఉండటం ఉత్తమం. ఎందుకంటే మాంసం జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. వీటికి బదులు ఇతర ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మేలు.

వేయించిన ఆహారాలు

వ్యాయామం తర్వాత వేయించిన ఆహారాలు, వేరుశెనగ వంటి వాటిని తినకూడదు. ఈ కొవ్వు పదార్థాలు జీర్ణం అయ్యేందుకు టైమ్ పడుతుంది. మీ కండరాలకు అవసరమైన పోషకాలను పొందడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనితో మీరు త్వరలో విసిగిపోతారు. అందుకే వాటిని ముట్టుకోవద్దు.

కూల్ డ్రింక్స్

వ్యాయామం తర్వాత రిఫ్రెష్‌మెంట్ కోసం కృత్రిమ శీతల పానీయాలు తాగడం చాలా మందికి అలవాటు. ఇది మంచి పద్ధతి కాదు. జిమ్‌లో మీ వ్యాయామం మీ శరీరంలోని కార్బోహైడ్రేట్‌లు, కొవ్వులను కరిగిస్తున్నప్పుడు, మీరు తాగుతున్న చక్కెర శీతల పానీయం దానిని అడ్డుకుంటుంది. కృత్రిమ శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. చక్కెర లేకుండా సహజ పండ్ల రసాన్ని త్రాగండి.

ఫాస్ట్ ఫుడ్ ముట్టుకోవద్దు

ఫాస్ట్ ఫుడ్ వాసన తినడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీరు ఖచ్చితంగా దానికి దూరంగా ఉండాలి. వ్యాయామం చేసిన తర్వాత ఉప్పగా ఉండే ఆహారాన్ని తినవచ్చు. కానీ ఫాస్ట్ ఫుడ్ వద్దు. జిమ్‌కి వెళ్లిన వెంటనే మీరు తినే ఫాస్ట్ ఫుడ్ మీ వ్యాయామం నుండి మీకు లభించే అన్ని ప్రయోజనాలను పోయేలా చేస్తుంది.

ఆమ్లెట్ అస్సలే వద్దు

గుడ్లు ప్రోటీన్ గొప్ప మూలం. కానీ మీరు వాటిని పచ్చిగా లేదా ఉడికించి తినాలి. ఏదో ఒక విధంగా వేయించిన గుడ్లను తినడం వల్ల మీ శరీరంలో అనవసర కొవ్వులు చేరుతాయి. ఆరోగ్యం కోసం గుడ్లు తప్పుడు రూపంలో తింటే లాభం ఉండదు.

పచ్చి కూరగాయలు తినొచ్చా

పచ్చి కూరగాయలు తినమని చెబుతుంటారు. కానీ జిమ్‌కి వెళ్లిన తర్వాత ఆకుపచ్చ కూరగాయలను మాత్రమే తినడం ఉత్తమ నిర్ణయం కాదు. పచ్చి కూరగాయలతో సమస్య ఏమిటంటే అవి మీకు కావలసిన అన్ని పోషకాలను అందించవు. తీవ్రమైన వ్యాయామం తర్వాత మీ శరీరానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఎక్కువ కేలరీలు అవసరం. పచ్చి కూరగాయలు తిన్నప్పుడు తక్కువ తిన్నా కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. మీరు ఎక్కువగా తినలేరు. అందువల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందవు.

స్వీట్స్ జోలికి వెళ్లకూడదు

మీరు కచ్చితంగా తినకూడనివి స్వీట్స్. జిమ్ వెళ్లి వచ్చిన తర్వాత వాటని తినకూడదు. ఎందుకంటే మిఠాయిలోని శుద్ధి చేయని చక్కెర మీ శరీరానికి ఎలాంటి మేలు చేయదు. హాని మాత్రమే చేస్తుంది. వ్యాయామం అలసట నుండి కోలుకోవడానికి లేదా రోజంతా చురుకుగా ఉండటానికి అవసరమైన పోషకాలు ఇందులో దొరకవు. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే స్వీట్ చాక్లెట్లను తక్కువగా తినడం బెటర్.

నీరు కూడా వద్దు

వ్యాయామం చేసేటప్పుడు నీరు తాగొద్దు. చల్లని నీరు అస్సలు ముట్టుకోవద్దు. వ్యాయామం తర్వాత చిన్న విరామం తీసుకోవాలి. ఆ తర్వాతే నీరు తాగాలి. కానీ చల్లని నీరు మాత్రం తాగకూడదు. వ్యాయామం తర్వాత హైడ్రేషన్ చాలా అవసరం. కానీ ఎక్కువ నీరు తాగితే ఏమీ తినలేరు. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందుకోకుండా చేస్తుంది. అందుకే వ్యాయమం తర్వాత ఏమి తినకూడదో కూడా తెలిసి ఉండాలి.

Whats_app_banner