Morning Drinks : బరువు తగ్గడానికి ఉదయం తాగాల్సిన పానీయాలు ఇవే-3 healthy morning drinks useful to weight loss naturally ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Morning Drinks : బరువు తగ్గడానికి ఉదయం తాగాల్సిన పానీయాలు ఇవే

Morning Drinks : బరువు తగ్గడానికి ఉదయం తాగాల్సిన పానీయాలు ఇవే

Anand Sai HT Telugu
Jan 18, 2024 05:30 AM IST

Healthy Morning Drinks : ఆరోగ్యంగా ఉండాలంటే బరువు సాధారణంగా ఉండాలి. ఎక్కువ బరువు ఉంటే లేనిపోని సమస్యలు వస్తాయి. అయితే ఉదయం పూట మీరు కొన్ని రకాల డ్రింక్స్ తాగితే మంచిది. బరువు తగ్గించుకోవచ్చు.

బరువు తగ్గించే చిట్కాలు
బరువు తగ్గించే చిట్కాలు (unsplash)

మంచి ఫిగర్ కావాలని అందరూ కోరుకుంటారు. కానీ ఆచరణలో మాత్రం దానికోసం ఏమీ ఉండదు. అందుకే ఇష్టవచ్చినట్టుగా బరువు పెరుగుతూ ఉంటారు. బరువు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఫలితం మాత్రం తక్కువే ఉంటుంది. మార్నింగ్ వాకింగ్, జాగింగ్, యోగా, రోజంతా తక్కువగా తినడం లాంటివి ఫాలో అవుతారు. బరువు పెరగడం లేదా తగ్గడం అనేది శరీర జీవక్రియ రేటుపై ఆధారపడి ఉంటుంది. మెటబాలిక్ రేటు తగ్గడం వల్ల బరువు పెరుగుతారు.

కొన్ని పానీయాలు మీ జీవక్రియ రేటును పెంచుతాయి. ఈ కారణంగా అదనపు బరువును తగ్గించడంలో మీకు సహాయపడతాయి. ఇది మంచి జీర్ణక్రియకు కూడా ఉపయోగపడుతుంది. మీరు ఉదయంపూట తీసుకునేందుకు కొన్ని పానీయలు ఉన్నాయి. అవితాగితే మీ మెటబాలిజం మెరుగవుతుంది. వాటి గురించి తెలుసుకుందాం..

ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, ఒక టీస్పూన్ నిమ్మరసం, దాల్చిన చెక్క పొడిని మిక్స్ చేసి తాగాలి. యాపిల్ సైడర్ వెనిగర్ జీవక్రియను పెంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. నిమ్మకాయ శరీరానికి విటమిన్ సిని అందిస్తుంది. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గేందుకే కాదు.. హానికరమైన బ్యాక్టీరియాను నిరోధించడంలోనూ సాయపడుతుంది. మూడు నెలలపాటు ప్రతిరోజూ రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వలన బరువు తగ్గొచ్చు.

మరో పానీయం ఏంటంటే.. అల్లం, పసుపును కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అందులే నిమ్మరసం, చిటికెడు మిరియాల పొడి, అర టీస్పూన్ తేనె కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టి తాగాలి. అల్లం, పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ రెండు సహజ పదార్థాలు జీర్ణక్రియను పెంచుతాయి. బరువు నియంత్రణలో సహాయపడతాయి. అల్లం జీవక్రియకు మెరుగుపడుతుంది. ఈ పానీయం తాగితే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

కలబంద మొక్క ఆకును కట్ చేసి జెల్ తీయండి. అలోవెరా జెల్‌ను మిక్సీలో బాగా గ్రైండ్ చేయాలి. అందులో నిమ్మరసం మిక్స్ చేసి తాగాలి. కలబంద మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీరాన్ని టాక్సిన్స్ లేకుండా చేస్తుంది. బరువు తగ్గిస్తుంది. నిమ్మకాయ శరీరానికి విటమిన్ సి అందించి పొట్టను శుభ్రంగా ఉంచుతుంది. కలబందను ఆయుర్వేదంలో కూడా వాడుతారు. దీని నుంచి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

WhatsApp channel