Sweet Fruits । స్వీట్స్ తినాలని నాలుక లపలపలాడుతుందా? ఈ తియ్యని పండ్లు తినండి!
Sweet and Healthy Fruits: స్వీట్స్ తినాలనే కోరికను (Sugar Cravings) సంతృప్తపరిచేందుకు పోషకాలు నిండిన తియ్యని పండ్లను న్యూట్రిషనిస్ట్ సూచించారు. ఏం తినాలంటే..
Sweet and Healthy Fruits: చాలా మందికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. తియ్యని పదార్థాలు తినడానికి తహతహలాడుతూ ఎడాపెడా వివిధ రకాల స్వీట్లు, ఐస్ క్రీంలు, పేస్ట్రీలు, చాక్లెట్లు అంటూ తింటూ ఉంటారు. భోజనం తర్వాత కూడా స్వీట్ తినకపోతే వారికి అసంపూర్ణంగా ఉంటుంది. కానీ, ఇలా స్వీట్స్ తినడం ఏమాత్రం ఆరోగ్యకరం కాదు. దాదాపు తియ్యని పదార్థాలన్నింటినీ కృత్రిమ స్వీటెనర్‌లతో తయారు చేస్తారు. ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇవి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. వీటిలో కేలరీలు ఎక్కువ, పోషకాలు తక్కువ ఉంటాయి. అంతేకాకుండా చక్కెరను ఎక్కువగా తింటే టైప్ 2 మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ సహా ఇతర అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ అని WHO హెచ్చరిస్తుంది.
అప్పుడప్పుడూ ఏదైనా ప్రత్యేక సందర్భంలో నోరు తీపిచేసుకోడానికి స్వీట్స్ తినడంలో తప్పులేదు. కానీ, మీకు స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటే కృత్రిమంగా తయారు చేసిన స్వీట్లకు బదులుగా ఏవైనా పండ్లు తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
స్వీట్స్ తినాలనే కోరికను (Sugar Cravings) సంతృప్తపరిచేందుకు పోషకాలు నిండిన తియ్యని పండ్లను న్యూట్రిషనిస్ట్ సోనియా బక్షి సూచించారు. ఏం తినాలంటే..
1. మామిడిపండ్లు
మామిడిపండు ఎక్కువ మొత్తంలో సహజమైన చక్కెరను కలిగిన తియ్యని పండు. ఈ పండులో ఫైబర్ తో పాటు విటమిన్లు C, A, E K, అలాగే B విటమిన్లను ఇంకా ఖనిజాలను కూడా కలిగి ఉంటుంది. రోజులో ఒక మామిడిపండును సాయంత్రం 5 గంటలలోపు తినాలి. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచడంతో పాటు, స్వీట్ తినాలనే కోరికను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
2. పియర్
పియర్ పండును రెగ్యులర్ గా తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. పియర్స్ రుచికరమైవి, ఆరోగ్యకరమైనవే కాకుండా, తియ్యని రుచి కలిగినవి. పియర్స్ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, అధిక శరీర బరువును అదుపులో ఉంచుతుంది, రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.
3. పుచ్చకాయ
పుచ్చకాయ ఎర్రగా, తియ్యగా, జ్యూసీగా ఉంటాయి. ఇందులో ఐరన్ సహా ఇతర పోషకాలు ఉంటాయి. ఇది తింటే శరీరానికి హైడ్రేషన్ కూడా కలుగుతుంది.
4. సీతాఫలం
సీతాఫలం తియ్యగా ఉంటుంది కానీ కేలరీలు తక్కువగా ఉంటాయి. వేసవి తాపాన్ని అధిగమించడానికి ఇది మంచి రిఫ్రెష్ ఫ్రూట్. స్వీట్ తినాలనే కోరికలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు సీతాఫలం తినవచ్చు.
5. జామ
జామపండ్లను రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఈ పండు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వలన ఎక్కువ సమయం పాటు కడుపును నిండుగా ఉంచుతుంది. అనవసరపు ఆకలి కోరికల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.
6. బెర్రీలు
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, రాస్ప్‌బెర్రీస్ ఈ పండ్లన్నీ ఎంతో ఆరోగ్యకరమైనవి. మీకు స్వీట్ తినాలనిపించినపుడు తినడానికి ఇవి ఉత్తమమైనవి. తక్కువ-గ్లైసీమిక్ పండ్లు కాబట్టి, రక్తంలో చక్కెరను పెంచకుండా తీపిని పుష్కలంగా అందిస్తాయి.
సంబంధిత కథనం