Shilajit Side Effects : షిలాజిత్‌ను వీటితో కలిపి తీసుకుంటే చాలా ప్రమాదం.. బీ కేర్ ఫుల్-never eat shilajit with all these meals dont forget ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Shilajit Side Effects : షిలాజిత్‌ను వీటితో కలిపి తీసుకుంటే చాలా ప్రమాదం.. బీ కేర్ ఫుల్

Shilajit Side Effects : షిలాజిత్‌ను వీటితో కలిపి తీసుకుంటే చాలా ప్రమాదం.. బీ కేర్ ఫుల్

Anand Sai HT Telugu
Apr 02, 2024 10:30 AM IST

Shilajit Side Effects : భారతీయ ఆయుర్వేద వైద్యంలో షిలాజిత్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే దీనిని అన్ని ఆహారాలతో కలిపి తీసుకోకూడదు. సమస్యలు వస్తాయి.

షిలాజిత్ సమస్యలు
షిలాజిత్ సమస్యలు (Unsplash)

షిలాజిత్ ఆయుర్వేదంలో ముఖ్యమైనది. వేల ఏళ్లుగా దీనిని వాడుతున్నారు. దీర్ఘాయువు కోసం, ఇతర వ్యాధులకు వేల సంవత్సరాలుగా ఉపయోగించబడుతోంది. షిలాజిత్ అనేది మందపాటి, నలుపు-గోధుమ రంగు ఖనిజ బొగ్గు, ఇది హిమాలయ పర్వతాలలో ఎక్కువగా కనిపిస్తుంది.

షిలాజిత్ విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాల యొక్క శక్తివంతమైన మూలం. ఇది శక్తివంతమైనది, ఇది అన్ని రకాల మానసిక, శారీరక ఒత్తిడిని నిరోధించడంలో సహాయపడుతుంది. అయితే షిలాజిత్ తినేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. దేనితో పడితే దానితో కలిపి షిలాజిత్ తీసుకోవడం మంచిది కాదు. దాని ద్వారా సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

షిలాజిత్, పాలు దాని పునరుజ్జీవన లక్షణాలకు ప్రసిద్ధి చెందిన ఒక క్లాసిక్ ఆయుర్వేద కలయిక. కానీ మీ ఆహారంలో షిలాజిత్, పాలను చేర్చేటప్పుడు మాంసం లేదా చేపలను నివారించడం చాలా ముఖ్యం. మాంసం లేదా చేపలను పాలు, షిలాజిత్‌తో కలపడం వల్ల అజీర్ణం, చర్మ సమస్యలు కూడా వస్తాయి. దీనితో కడుపు ఇబ్బందులు తలెత్తుతాయి. మీరు అనేక విధాలుగా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

స్పైసీ ఫుడ్ అంటే చాలా మందికి ఇష్టం. షిలాజిత్ తినే సమయంలో మసాలా ఆహారాన్ని అధికంగా తీసుకోవడం ప్రతికూలంగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు, పెద్ద పరిమాణంలో వినియోగించినప్పుడు, పిత్త సమస్యలను తీవ్రతరం చేయవచ్చు. ఇది అసమతుల్యతకు దారితీస్తుంది. షిలాజిత్ ప్రయోజనాలను మీకు దక్కకుండా పోతాయి. అలాగే షిలాజిత్ తీసుకున్న తర్వాత భారీ భోజనం నుండి దూరంగా ఉండాలి. గుండెల్లో మంట, అసిడిటీ ప్రమాదం ఉంది.

ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏంటి అంటే.. షిలాజిత్‌ను ఆమ్ల పండ్లతో ఎప్పుడూ తీసుకోకూడదు. షిలాజిత్, సిట్రస్ పండ్ల కలయిక అజీర్ణం, ఆమ్లతను కలిగిస్తుంది. రెండింటి యొక్క సానుకూల ప్రభావాలను తగ్గిస్తుంది. మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

కొంతమంది రుచిని మెరుగుపరచడానికి షిలాజిత్ పొడి, నీరు, తేనె మిశ్రమాన్ని ఎంచుకుంటారు. ఈ మిశ్రమం ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ, ఇది శరీరంలో విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. చర్మ సమస్యలకు కారణం కావచ్చు. శరీరంలో ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

మీరు పాలతో షిలాజిత్ కలుపుకొంటే, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ పాలతో కలిపి తీసుకుంటే.. ఈ సమయంలో క్యారెట్ తినడం మానుకోండి. ముల్లంగి, షిలాజిత్, పాల మిశ్రమం జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అందుకే షిలాజిత్ తీసుకునేవారు.. ఆరోగ్యంపై కూడా జాగ్రత్తలు వహించాలి. ఇతర ఆహారాలు తిని సమస్యలు తెచ్చుకోకూడదు.