Shilajit Health Benefits : సంతానోత్పత్తి నుంచి యవ్వనంగా ఉండేవరకు షిలాజిత్ మంచిదట..
Shilajit Health Benefits : షిలాజిత్నుు బలం, లైంగిక శక్తిని పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఇది పూర్తిగా ఖనిజాలతో నిండి ఉంటుంది. అందుకే దీనిని ఆయుర్వేదంలో పలు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. మరి దీనిని ఎలా? ఎంతమోతాదులో తీసుకోవాలి వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Shilajit Health Benefits : హిమాలయాల్లో కనిపించే తారు లాంటి పదార్ధాన్నే షిలాజిత్ అంటారు. ఇది సహజమైన పురాతన పదార్థంగా చెప్పవచ్చు. ఇది శరీరానికి శక్తిని, పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా బలహీనతను నాశనం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చేసిన వివిధ అధ్యయనాలు శరీరంపై దాని సానుకూల ప్రభావాలను సమర్థించాయి. మరి ఈ షిలాజిత్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
షిలాజిత్ అంటే ఏమిటి? దానిని ఎలా ఉపయోగించాలి?
షిలాజిత్ అనేది హిమాలయాల రాళ్లలో కనిపించే జిగట పదార్థం. ఇది శతాబ్దాల నాటి మొక్కలు కుళ్లిపోవడం నుంచి.. సహజంగా తయారయ్యే పదార్థం. ఇది ఖనిజాలు అధికంగా కలిగి ఉంటుంది. ఇది పౌడర్, టాబ్లెట్, సిరప్ లేదా సప్లిమెంట్ రూపంలో అందుబాటులో ఉంటుంది. దీని సిఫార్సు మోతాదు రోజుకు 300-500 మిల్లీగ్రాములు.
హిల్ స్టేషన్లో ఉండేవారికి..
ఎత్తులో ఉన్నా.. హిల్ స్టేషన్‌లు లేదా ఇతర గమ్యస్థానాలకు మీరు ప్రయాణిస్తున్నప్పుడు ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ చాలా సాధారణం. ఈ పరిస్థితితో ఇబ్బంది పడేవారు శ్వాస సమస్యలు, వికారం, తలనొప్పి, అలసటతో బాధపడతారు.
హ్యూమిక్, ఫుల్విక్ యాసిడ్‌లతో సహా 80కి పైగా మినరల్స్ ఉన్నందున షిలాజిత్ తీసుకోవడం వల్ల అది ఎత్తులో ఉన్న అనారోగ్యాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి..
షిలాజిత్ అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకే ఒత్తిడి లేదా ఆందోళనతో ఇబ్బందిపడేవారికి ఇది మంచిది. ఇది మెదడులో డోపమైన్ స్రావాన్ని పెంచుతుంది. మీ శరీరంపై ప్రశాంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది.
ఎందుకంటే షిలాజిత్ మెగ్నీషియం, పొటాషియంతో నిండి ఉంటుంది. ఇది మీ కండరాలను సడలించి.. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రెండూ ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి.
సంతానోత్పత్తి, టెస్టోస్టెరాన్ స్థాయిల పెంపునకై..
షిలాజిత్ శతాబ్దాలుగా పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి ఒక ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ సహజ పదార్థాన్ని తినే పురుషులు ఎక్కువ స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ మొబిలిటీని కలిగి ఉంటారని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.
ఈ రెండు కారకాలు సంతానోత్పత్తి, గర్భధారణ అవకాశాలను నిర్ణయిస్తాయి. ఒక అధ్యయనంలో 45-55 సంవత్సరాల వయస్సు గల పురుషులు 90 రోజుల పాటు షిలాజిత్‌ను వినియోగించారు. వారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలలో పెరుగుదలను గుర్తించారు.
యవ్వనంగా ఉంచడంలో..
అవును.. మీరు యవ్వనంగా ఉండడంలో షిలాజిత్ సహాయం చేస్తుంది. ఇది వృద్ధాప్య ప్రక్రియను నియంత్రిస్తుంది. జీవశక్తిని కాపాడుతుంది. కాబట్టి మీరు యవ్వనంగా ఉండాలంటే దీనిని ఉపయోగించవచ్చు.
ఇందులో ఉండే ఫుల్విక్ యాసిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు.. శరీరంలోని సెల్ డ్యామేజ్‌ని తగ్గిస్తుంది. అంతే కాదు.. శరీరంలో వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది.
రక్తహీనతకు చికిత్స చేయవచ్చు
శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలను ప్రేరేపిస్తుంది. అయితే మీరు షిలాజిత్‌ను నిర్ణీత మొత్తంలో, నిర్దిష్ట కాల వ్యవధిలో తీసుకుంటే.. మీరు ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.
మంచి మొత్తంలో ఐరన్, హ్యూమిక్ యాసిడ్‌తో నిండిన ఈ సహజ పదార్ధం మీ రక్తంలోని ఐరన్ స్థాయిలను స్థిరీకరిస్తుంది. తద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.
సంబంధిత కథనం