వయసు పెరిగేకొద్దీ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కోసం కొన్ని తప్పులు చేయకుండా ఉండటం చాలా ముఖ్యమే. ఈ వయసులో ముఖ్యంగా యాభై ఏళ్లకు దగ్గర పడుతుంటే శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఈ మార్పులు మహిళల్లోనే కాదు పురుషుల్లో కూడా ఉంటాయి. 50 ఏళ్ల వయసులో మానేయాల్సిన కొన్ని వ్యాయామాలు కొన్ని ఉన్నాయి. లేదంటే ఎముకలు, కండరాలు దెబ్బతింటాయి. 50 ఏళ్లు దాటిన తర్వాత అస్సలు చేయకూడని వ్యాయామాలు ఏంటో తెలుసుకోండి.
నిజానికి 50 ఏళ్లు దాటిన తర్వాత శరీరం కోలుకోవడానికి సమయం పడుతుంది. ఎముకలు, కండరాలకు గాయాలు సులభంగా నయం కావు. కాబట్టి మీకు ఇష్టమైన వ్యాయామం చేయాలనుకుంటే, జాగ్రత్తగా పద్ధతిలో చేయండి. గాయాల ప్రమాదం తక్కువగా ఉంటుంది.
క్రంచెస్ వంటి వ్యాయామాల్లో మెడ వెనుక భాగాన్ని సాగదీసే వ్యాయామాలకు దూరంగా ఉండాలి. వీటిలో మెడ వెనుక భాగం నుండి ఒత్తిడి పెట్టాల్సి ఉంటుంది. ఇది భుజాల్లో ఒత్తిడికి కారణమవుతుంది.
బర్పీస్ పూర్తి శరీర వ్యాయామం. ఇందులో స్క్వాట్స్, పుషప్స్ చేయాల్సి ఉంటుంది. బర్పీలు కేలరీలను బర్న్ చేస్తాయి కాని గాయం అవకాశాలను పెంచుతాయి. కాబట్టి 50 ఏళ్ల తర్వాత బర్పీస్ చేయడం మానేయాలి.
తరచూ జిమ్ కు వెళ్లే వారు ఎక్విప్‌మెంట్‌పై పాదాల సాయంతో వెయిట్ పుష్ ఎక్సర్ సైజులు చేస్తుంటారు. దీని వల్ల పాదాలకు వ్యాయామం అవుతుంది. కానీ ఈ వ్యాయామాలు మోకాళ్లపై ఒత్తిడిని కలిగిస్తాయి. గాయపడతాయనే భయమూ పెంచుతాయి.
స్క్వాట్స్, జంపింగ్ వ్యాయామాలకు దూరంగా ఉండండి. బదులుగా, నిదానమైన కదలికలతో వ్యాయామం చేయండి. జంపింగ్ తో పాటు స్ప్రింటింగ్ వంటి వ్యాయామాలకు కూడా దూరంగా ఉండాలి.