Moto G32: 50 మెగాపిక్సెల్, 128 GB స్టోరేజ్‌తో మోటోరోలా న్యూ స్మార్ట్‌ఫోన్!
ప్రముఖ మెుబైల్ దిగ్గజం మోటోరోలా మరో సరికొత్త ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Moto G32 పేరుతో రిలీజ్ చేసిన ఈ ఫోన్ 6.5-అంగుళాల LCD డిస్ప్లేతో వస్తుంది. 1TB వరకు స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు.
మోటరోలా తన సరికొత్త G-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న Moto G42, Moto G52 స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే, Moto G32 కూడా Qualcomm Snapdragon 680 చిప్‌సెట్‌తో రూపొందించారు. Moto G32కి 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాలు, పెద్ద బ్యాటరీ వంటి ఫీచర్లు అందించారు. ఈ మోటరోలా ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లకు సంబందించిన మరిన్ని తెలుసుకుందాం ...
Moto G32 ధర
Moto G32 స్మార్ట్‌ఫోన్‌ను 4 GB RAM, 128 GB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో విడుదల చేశారు. యూరోపియన్ మార్కెట్‌లలో దీని ధర 209.99 యూరోలు (సుమారు రూ. 17,000) గా ఉంది. ఈ ఫోన్ మినరల్ గ్రే, శాటిన్ సిల్వర్ కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఈ మోటరోలా ఫోన్ త్వరలో లాటిన్ అమెరికన్, ఇండియన్ మార్కెట్‌లలో కూడా విడుదల కానుంది.
Moto G32 స్పెసిఫికేషన్స్
Moto G32 స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో పంచ్-హోల్ ఆప్షన్‌ను అందించారు. స్క్రీన్ FullHD+ రిజల్యూషన్‌తో రూపొందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండగా ఈ Motorola G32 స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 680 చిప్‌సెట్‌ను అందించారు. గ్రాఫిక్స్ కోసం Adreno 610 GPU అందించారు. ఫోన్ 4 GB RAM , 128 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1 TB వరకు పెంచుకోవచ్చు.
Motorola G32లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఎపర్చరు F / 1.8తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, ఎపర్చరు F / 2.2తో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్, ఎపర్చరు F / 2.4తో 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. హ్యాండ్‌సెట్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ సెన్సార్ ఉంది, ఇది ఎపర్చరు F / 2.4. కెమెరా పూర్తి-HD వీడియోను 30fps వద్ద రికార్డ్ చేయగలదు.
Moto G32 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరెట్‌తో వస్తుంది. ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. హ్యాండ్‌సెట్ కొలతలు 161.78×73.84×8.49 మిల్లీమీటర్లు, బరువు 184 గ్రాములు. హ్యాండ్‌సెట్‌కు పవర్ అందించడానికి, 5000mAh బ్యాటరీ అందించబడింది, ఇది 30W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ ఇస్తుంది. ఈ మోటో స్మార్ట్‌ఫోన్‌లో USB టైప్-సి పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా, ఫోన్ డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2, NFC కనెక్టివిటీని అందిస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్