Mothers Day 2024 : మీ తల్లికి 40 నుంచి 50 ఏళ్ల వయసు ఉందా? ఆమెలో ఈ మార్పులు గమనించారా?
Mothers Day 2024 : తల్లి ఆరోగ్యాన్ని చూసుకోవడం అందరి బాధ్యత. అయితే తల్లికి 40 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉంటే చాలా జాగ్రత్తగా చూడాలి.
మీ తల్లికి 409-50 ఏళ్ల మధ్య వయసు ఉందా? ఇటీవల వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందా? ఈ సమయంలో మీ భావోద్వేగ మద్దతు, పిల్లల ప్రేమ వారికి చాలా అవసరం. లేకుంటే అది వారి మానసిక ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది. తల్లి మెనోపాజ్ దశ గురించి పిల్లలు తెలుసుకోవాలి. తల్లి తన ఋతు చక్రం గురించి పిల్లలతో పంచుకోవడం అనేది చాలా తక్కువ. ఈ విషయం అమ్మాయిలతో చెబుతారమోకానీ.. ముఖ్యంగా అబ్బాయిలతో మాత్రం అస్సలు పంచుకోదు. దాని గురించి తల్లి చెప్పదు. కానీ తల్లి ఆరోగ్యం గురించి ప్రతీ ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలి. 40 ఏళ్ల తర్వాత తల్లి ప్రవర్తనలో మార్పు వస్తే దానికి పరిష్కారం చూడాలి.
పిల్లలు తల్లి ఆరోగ్యం గురించి తెలుసుకునేంత పరిపక్వత కలిగి ఉండాలి. సాధారణంగా చాలా మంది అమ్మాయిలకు 25 సంవత్సరాల వయస్సులోపు వివాహమై పిల్లలు ఉంటారు. చాలా మంది మహిళలకు 30 ఏళ్లలోపు పిల్లలు అవుతారు. అయితే ఆమె 45-50 సంవత్సరాలకు చేరుకునే సమయానికి పిల్లలు పెద్ద అవుతారు. ఈ వయసులో 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కొద్దిమంది మాత్రమే. 10 ఏళ్లలోపు పిల్లలు ఉంటే తల్లి ఆరోగ్య పరిస్థితి అంటే మెనోపాజ్ పరిస్థితి గురించి పెద్దగా అర్థం కాదు. అలా కాకుండా తల్లి ఆరోగ్యం విషయంలో మహిళలను ఇబ్బంది పెట్టే మెనోపాజ్ దశ గురించి పిల్లలందరూ తెలుసుకోవాలి.
మెనోపాజ్ అనేది సాధారణంగా 40-55 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలలో వచ్చే దశ . కొందరికి 40 ఏళ్ల వయసులో మెనోపాజ్ వస్తుంది, మరికొందరికి 45-55 ఏళ్ల మధ్య మెనోపాజ్ వస్తుంది. ఈ సమయంలో ఆమె శరీరంలో హార్మోన్లలో తేడా ఉంటుంది. ఇది ఆమె రుతుక్రమం ఆరోగ్యాన్ని కూడా చాలా ప్రభావితం చేస్తుంది. ఈ దశలో పిల్లలు తనను ప్రేమించడం లేదని, భర్త ప్రేమించడం లేదని, తాను ఒంటరిగా ఉన్నానని అనిపించడం మొదలవుతుంది. కొందరు ఈ దశలో డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యల గురించి కూడా ఆలోచిస్తారు.
ఈ సమయంలో తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఆమె అనారోగ్యం అని కాదు, ఆమె స్వభావంలో మార్పు ఉందని అర్థం. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం లేదా విసుగు చెందడం, మూడ్ స్వింగ్స్ అన్నీ కనిపిస్తాయి.
మెనోపాజ్ సమయంలో కనిపించే మార్పులు
ఏ పనిలో ఆసక్తి కోల్పోవడం
పనికిరానివారిని, నా గురించి చెప్పేందుకు ఏదీ లేదు అనుకోవడం
మానసిక కల్లోలం
తేలికగా కోపం రావడం
బాగా నిద్రపోవడం
కారణం లేకుండా ఏడవడం
రాత్రి బాగా నిద్రపోవడం
కాన్ఫిడెన్స్ కోల్పోవడం
సామాజిక నైపుణ్యాలను కోల్పోవడం
అమ్మ ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వస్తే.. మనం కూడా భయపడుతాం. కానీ ఇది ఆమె హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. ఈ సమయంలో భర్త, పిల్లలు ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, ఆమెను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఆమె ఒంటరిగా ఉందని మీరు గ్రహిస్తే, ఆమెను ఒంటరిగా ఉండనివ్వకండి. సంతోషంగా ఉంచడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. అనారోగ్యంగా అనిపిస్తే, వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఆమె డిప్రెషన్ తగ్గుతుంది.
మెనోపాజ్ లక్షణాలు ఎంతకాలం ఉంటాయి?
ఇది వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. కొందరికి ఇది కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. మరికొందరికి ఇది 4-5 సంవత్సరాల వరకు ఉంటుంది. రోజువారీ వ్యాయామం, మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం డిప్రెషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ఆరోగ్యానికి ఈ సమయంలో భావోద్వేగ మద్దతును కావాలి. తల్లితో కలిసి వాకింగ్‌కు వెళ్లడం, మీ పనుల్లో బిజీగా ఉండకుండా ఆమెతో కొంత సమయం గడపడం కూడా ఆమెకు సంతోషాన్ని కలిగిస్తుంది.