Prajwal Revanna case : ప్రజ్వల్ రేవన్నపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత అరెస్ట్- మరో మహిళపై..
Devaraje Gowda arrest : ప్రజ్వల్ రేవన్న సెక్స్ కేసు నేపథ్యంలో ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు దేవరాజ్ గౌడ. ఈ బీజేపీ నేతని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. మరో మహిళపై లైంగిక దాడి ఆరోపణలు ఇందుకు కారణం!
Prajwal Revanna videos : ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుంభకోణం కేసు మధ్యలో.. బీజేపీ నేత, న్యాయవాది జీ దేవరాజ్ గౌడను కర్ణాటక పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చిత్రదుర్గ్లోని గులిహాల్ టోల్ గేట్ వద్ద ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తనపై దేవరాజ్ గౌడ లైంగిక దాడి చేశారని ఓ మహిళ ఆరోపించడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
ప్రజ్వల్ రేవన్న కేసు- దేవరాజ్ గౌడ అరెస్ట్..
దేవరాజ్ గౌడపై సెక్షన్ 354, 354సీ, 448, 504, 506, 2008 ఐటీ చట్టం ఐపీఎస్ సెక్షన్ 34, 66ఈ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మహిళపై లైంగిక దాడి, ఇంట్లోకి చొరబడటం, కావాలనే పరువు తీయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, నేరపూరిత సాన్నిహిత్యం వంటివి ఆయనపై వేసిన సెక్షన్లు.
హసన్‌లోని హాలేనరసిపుర ప్రాంతంలోని తన ఇంట్లో, ఫిబ్రవరి 4న గౌడ తనపై లైంగిక దాడి చేశారని ఏప్రిల్ 1న సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో మరో ముగ్గురు పేర్లు కూడా ఉన్నాయి. మరి.. ఏప్రిల్‌లో ఎఫ్ఐఆర్ నమోదైతే.. ఇప్పటివరకు ఆయన్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదో తెలియరాలేదు.
అయితే.. తనపై వచ్చిన ఆరోపణలను కర్ణాటక బీజేపీ నేత దేవరాజ్ గౌడ ఖండించారు.
Devaraje Gowda arrested : కర్ణాటకలో భగ్గుమున్న జేడీఎస్ బహిష్కృత ఎంపీ ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుంభకోణం కేసు సమయం నుంచి దేవరాజ్ గౌడ పేరు బాగా వినిపిస్తోంది. మహిళలపై ప్రజ్వల్ రేవన్న నేరాలను గతేడాది డిసెంబర్లో బీజేపీకి వివరించానని గౌడ చెబుతున్నారు. బీజేపీ హైకమాండ్‌కి కూడా లేఖ రాసినట్టు వివరించారు. కానీ తన మాట వినకుండా.. జేడీఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకుందని ఆయన ఆరోపించారు. అయితే.. దేవరాజ్ గౌడ ఎవరికి ఫిర్యాదు చేయలేదని.. కర్ణాటక బీజేపీ నాయకత్వం చెబుతోంది.
అంతేకాదు.. ప్రజ్వల్ రేవన్న సెక్స్ వీడియోలను లీక్ చేశారని దేవరాజ్ గౌడపై ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇక.. ఇండియాను విడిచి వెళ్లిపోయిన ప్రజ్వల్ రేవన్న కేసును సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. తమ ముందు హాజరవ్వాలని.. దేవరాజ్ గౌడను ఆదేశించింది.
Devaraje Gowda Prajwal Revanna : ప్రజ్వల్ రేవన్న ప్రస్తుతం హసన్ నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ- జేడీఎస్ పొత్తు కుదుర్చుకున్న అనంతరం.. ఆయన మళ్లీ అదే సీటు నుంచి పోటీ చేశారు. కానీ పోలింగ్‌కి ఒక రోజు ముందు.. ప్రజ్వల్ రేవన్న సెక్స్ వీడియోలకు సంబంధించిన పెన్ డ్రైవ్‌లు.. హసన్‌లోని అనేక ప్రాంతాల్లో కనిపించాయి. అప్పటి నుంచి ఈ వ్యవహారం సంచలనంగా మారింది.
సంబంధిత కథనం