Mosquito Borne Diseases। వానాకాలంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు, వాటి లక్షణాలు!-mosquito borne diseases surge in monsoon know symptoms of dengue malaria and chikungunya ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mosquito Borne Diseases। వానాకాలంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు, వాటి లక్షణాలు!

Mosquito Borne Diseases। వానాకాలంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు, వాటి లక్షణాలు!

HT Telugu Desk HT Telugu
Jul 18, 2023 11:13 AM IST

Mosquito Borne Diseases: వానాకాలంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు పెరుగుతాయి. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. దేని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.

Mosquito Borne Diseases
Mosquito Borne Diseases (istock)

Mosquito Borne Diseases: వానాకాలంలో నిరంతరంగా కురిసే భారీ వర్షాలు, వరదల కారణంగా కలుషిత పదార్థాలు కొట్టుకొస్తాయి, ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో దోమలు, ఇతర ప్రమాదకర వ్యాధులను సంక్రమింపజేసే కీటకాలు, క్రిములు, సూక్ష్మజీవుల వృద్ధి పెరుగుతుంది. ముఖ్యంగా నీరు నిలిచిన చోట వివిధ రకాల దోమలు పెరుగుతాయి. ఈ దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. వర్షాకాలంలో ఈ కేసుల సంఖ్య భారీగా పెరుగుతాయి. రాబోయే రోజుల్లో దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం మరింత ఎక్కువ ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఇవి ప్రాణాంతకంగా కూడా పరిగణించవచ్చు.

మలేరియా, డెంగ్యూ, లేదా చికెన్ గున్యా దేనికదే విభిన్నమైన లక్షణాలను కనబరుస్తుంది, తీవ్రత కూడా భిన్నంగా ఉండవచ్చు. వ్యాధిని ముందుగా నిర్ధారిస్తే చికిత్స వేగవంతం అవుతుంది. లక్షణాల ప్రకారంగా తేడాను గుర్తించవచ్చు. దేని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.

మలేరియా సంకేతాలు, లక్షణాలు

మలేరియా సంకేతాలు, లక్షణాలు సాధారణంగా సోకిన దోమ ద్వారా కుట్టిన తర్వాత కొన్ని వారాలలో ప్రారంభమవుతాయి. లక్షణాలు ఇలా ఉంటాయి.

  • జ్వరం
  • చలి
  • తలనొప్పి
  • వికారం, వాంతులు
  • అతిసారం
  • పొత్తి కడుపు నొప్పి
  • కండరాలు లేదా కీళ్ల నొప్పి
  • అలసట
  • వేగవంతమైన శ్వాస
  • వేగవంతమైన హృదయ స్పందన రేటు
  • దగ్గు

కొంతమందికి మలేరియా లక్షణాలను మళ్లీ మళ్లీ అనుభవిస్తారు. ఎందుకంటే కొన్ని రకాల మలేరియా పరాన్నజీవులు మీ శరీరంలో ఒక సంవత్సరం వరకు నిద్రాణంగా ఉంటాయి. చలితో వణుకు రావడంతో సంక్రమణ మొదలవుతుంది, ఆ తర్వాఅత అధిక జ్వరం, చెమటలు పట్టడం, తిరిగి సాధారణ ఉష్ణోగ్రతకు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

డెంగ్యూ లక్షణాలు

డెంగ్యూ జ్వరం లక్షణాలు సాధారణంగా సంక్రమణ తర్వాత 4-10 రోజులకు ప్రారంభమవుతాయి, 2-7 రోజుల వరకు ఉంటాయి. ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఈ కింద చూడండి.

  • అధిక జ్వరం (40°C/104°F)
  • తీవ్రమైన తలనొప్పి
  • కళ్ల వెనుక నొప్పి, కళ్లు లాగటం
  • కండరాలు, కీళ్ల నొప్పులు
  • వికారం, వాంతులు
  • ఉబ్బిన గ్రంధులు
  • దద్దుర్లు

రెండవసారి డెంగ్యూ ఇన్ఫెక్షన్ గురైన వారికి లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయి. జ్వరం తగ్గినప్పటికీ ఇతర లక్షణాలు కనిపించవచ్చు, అవి ఇలా ఉంటాయి:

  • తీవ్రమైన కడుపు నొప్పి
  • నిరంతర వాంతులు
  • వేగవంతమైన శ్వాస
  • చిగుళ్ళు, ముక్కు నుండి రక్తస్రావం
  • అలసట
  • చంచలత్వం
  • వాంతులు, విరేచనాలు, మలం లో రక్తం
  • చాలా దాహం వేయడం
  • చర్మం పాలిపోయి చల్లగా మారడం
  • బలహీనమైన అనుభూతి

ఈ రకమైన లక్షణాలు ఉన్న వ్యక్తులు వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. డెంగ్యూ నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా వారాల పాటు అలసటగా ఉంటుంది.

చికున్‌గున్యా లక్షణాలు

చికున్‌గున్యా మొదటి సంకేతం సాధారణంగా జ్వరం, తరువాత దద్దుర్లు రావడంతో ప్రారంభమవుతాయి. దోమ కాటు తర్వాత, అనారోగ్యం సాధారణంగా 4 నుండి 8 రోజుల తర్వాత సంభవిస్తుంది, కానీ పరిధి 2 నుండి 12 రోజులు ఉంటుంది. లక్షణాలు ఇలా ఉంటాయి:

  • అకస్మాత్తుగా అధిక జ్వరం (సాధారణంగా 102 డిగ్రీల F కంటే ఎక్కువ)
  • కీళ్ల నొప్పులు
  • తలనొప్పి
  • మైయాల్జియా
  • కండ్లకలక
  • వికారం
  • వాంతులు
  • దద్దుర్లు

చికున్‌గున్యా సోకిన సోకిన వ్యక్తులలో ఎక్కువ మంది లక్షణాలు కనబరుస్తారు. అయితే 3 నుండి 28 శాతం మంది లక్షణరహితంగా ఉంటారు.

Whats_app_banner

సంబంధిత కథనం