Morning Yoga | ఉదయం లేవగానే ఈ రెండు యోగాసనాలు వేస్తే ఒత్తిడి మాయం
మీ శరీరాన్ని, మనస్సును రిలాక్స్‌గా ఉంచడానికి ప్రతిరోజు ఉదయం యోగాసనాలు వేయండి. దీంతో రోజంతా మీరు ఎలాంటి ఒత్తిళ్లు, ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉంటారు. మానసిక, శరీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఉదయం లేవగానే కొద్దిసేపు యోగా చేస్తే అది ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. యోగా మీ మనస్సుకు, శరీరానికి ఒక వైద్యం లాగా పనిచేసి గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఉదయం వేసే సులభమైన యోగా భంగిమలు ప్రతి రోజూ క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ శరీరం, మనస్సు ఎలాంటి ఒత్తిళ్లనైనా ఎదుర్కొనే శక్తిని పొందగలుగుతుంది. ఉదయం వేళలో యోగ చేసేవారికి పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థకు లభించే థెరపీ ప్రయోజనాలు కలుగుతాయి. ఫలితంగా వారి శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో బాగా మెరుగుపడుతుంది.
ఉదయం వేళలో వేసే రెండు యోగాసనాలు ఇక్కడ ఉన్నాయి. మిగతా ఆసనాలతో పాటు ఈ రెండు ఆసనాలు కొన్ని నిమిషాల పాటు వేసి చూడండి.
గరుడాసనం:
గరుడ అనేది సంస్కృత పదం, ఇది అక్షరాలా డేగ అనే అర్థాన్ని సూచిస్తుంది. గరుడాసనం లేదా ఈగిల్ పోస్ అంటే డేగను పోలినట్లుగా భంగిమలో ఉండటం. ఈ ఆసనం వేయడం ద్వారా కండరాలకు విశ్రాంతి, మనస్సుకు ప్రశాంతత అలాగే శరీరానికి సమతుల్యతను తీసుకువస్తుంది.
త్రికోణాసనా లేదా ట్రయాంగిల్ భంగిమ:
త్రికోణాసనం అనేది నిలబడి చేసే ఆసనం. నిలబడి ఉన్న స్థితిలో పాదాల మధ్య 3-4 అడుగుల దూరం ఉంచి కుడి చేయి కుడి పాదాన్ని తాకేలా శరీరాన్ని వంచాలి. ఇదే తరహాలో ఎడమ చేయి ఎడమ పాదాన్ని తాకేలా శరీరాన్ని వంచాలి. ఇలా కుడి వైపు ఒకసారి, ఎడమ వైపు ఒకసారి క్రమపద్ధతిలో చేస్తూ ఉండాలి. ఈ ఆసనాలు శరీరానికి సమతుల్యత, స్థిరత్వాన్ని కల్పిస్తాయి.
ఉదయాన్నే యోగా చేయడం ద్వారా ఇది మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచుతుంది. కండరాలలో దృఢత్వం పెరిగి కీళ్ల నొప్పులు నుంచి మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఉదయం సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే అలసట అనేదే ఉండదు. ప్రాణాయామం సాధన చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది.
సంబంధిత కథనం