Monday Quote : ఒక్కోసారి మీరు చెప్పాలనుకున్నది కాదు.. వాళ్లు వినాలనుకున్నదే చెప్పాల్సి వస్తది..-monday motivation on most people not listen with the intent to understand ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Monday Motivation On Most People Not Listen With The Intent To Understand

Monday Quote : ఒక్కోసారి మీరు చెప్పాలనుకున్నది కాదు.. వాళ్లు వినాలనుకున్నదే చెప్పాల్సి వస్తది..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 29, 2022 06:00 AM IST

Monday Quote : చాలామంది మీరున్న పరిస్థితుల్లో మీరేమి ఫీల్​ అవుతున్నారో అది తెలుసుకోవాలనుకోరు. వాళ్లు ఏమి కావాలనుకుంటున్నారో అదే వినాలనుకుంటారు. ఎందుకంటే మీ ఫీలింగ్స్​ కన్నా.. వారి ఫీలింగ్స్​కే ఎక్కువ ప్రాధన్యత ఇస్తారు. అలాంటివారు మీ లైఫ్​లో కూడా ఉండే ఉంటారు.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Monday Motivation : నేటి కాలంలో చాలా మంది ఎదుటివాళ్లు ఏమి ఫీల్ అవుతున్నారో.. ఏమి ఇబ్బందులు పడుతున్నారో.. ఏమి చెప్పాలి అనుకుంటున్నారో.. అది వినకుండా.. వారు ఏమి వినాలనుకుంటున్నారో.. అది మన నుంచి సమాధానంగా రావాలని చూస్తున్నారు. మనల్ని అర్థం చేసుకుని మనం ఫీలింగ్స్ గురించి కేర్ తీసుకోవాలనే ఉద్దేశంతో కాకుండా.. వాళ్లకి వినడానికి ఏది కంఫర్ట్​గా ఉంటాదో అదే వినాలనుకుంటున్నారు.

ఎందుకంటే లోకమంతా స్వార్థంతో నిండిపోయింది. మీరు కూడా ఏదొక సందర్భంలో స్వార్థంగా ఆలోచించి ఉండే ఉంటారు. అలా ఆలోచించి మీరు ఏదొక నిర్ణయం తీసుకుని.. ఇప్పుడు దాని గురించి బాధపడుతూ ఉంటారు. మీలాగే ఎదుటివాళ్లు కూడా స్వార్థంగా వాళ్లకి ఏమికావాలో అవే వినాలనుకుంటున్నారు. అది వాళ్ల తప్పేమి కాదు. అది వాళ్ల నైజాం అంతే.

ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నా సంతోషంగా ఉంటారని నమ్మకం లేదు. ఎందుకంటే కలిసి ఉండాలనే దానికన్నా.. స్వార్థంగా వారితో ఉంటే కలిగే బెనిఫిట్స్​ గురించి ఆలోచించుకుంటూ ఉండి ఉంటారు. బయటకు ఇద్దరూ సంతోషంగా కనిపించినా.. ఒకరి స్వార్థానికి మరొకరు బలి అవుతూ ఉంటారు. ఒకరి ఫీలింగ్స్​కి మరొకరు ఎప్పుడూ బలవ్వాల్సిందే. అదే జీవితం. ఎందుకంటే.. మీకు ఎలా కావాలో అలా బతికే రైట్​.. ప్రతిసారి ఉండకపోవచ్చు. అప్పుడు ఎదుటివారి ఆలోచనలో కోసం జీవించడం మీకు అలవాటు అయిపోతుంది. మీరు మీ ఇబ్బందుల గురించి చెప్పినా.. వారు వినాలని అనుకోరు. నువ్వు వారితో సంతోషంగా లేకపోయినా.. నలుగురికి సంతోషంగా ఉన్నావనే చెప్పాలని చూస్తారు.

సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే బంధాలు అర్థాంతరంగా ముగుస్తాయి. ఎందుకంటే మీరు చెప్పేవి వారికి ఎప్పటికీ అర్థం కాదు. వారు చెప్పేవి మీరు అర్థం చేసుకోవాలనుకుని ఉండకపోవచ్చు. అలా అర్థం చేసుకునే వారు ఉంటే.. ప్రేమ లేకపోయినా సంబంధాలు సాఫీగా సాగుతూ ఉండేవి. చాలామంది విషయాన్ని అర్థం చేసుకోకపోగా.. దాని గురించి లోతుగా ప్రశ్నించడం ప్రారంభిస్తారు. ఆ సమయంలో వారు అర్థం చేసుకుంటే మీకు ఊరట కలుగుతుంది. లేదంటే మీ మనసు మరింత బాధపడుతుంది.

లైఫ్​లో ప్రేమించే వాళ్లు దొరకచ్చేమో కానీ.. అర్థం చేసుకునే వాళ్లు దొరకడం చాలా కష్టం. ప్రేమించే వాళ్లు లైఫ్​లో ఉన్నా లేకున్నా పర్లేదు కానీ.. అర్థం చేసుకునే వాళ్లు లేకపోతే లైఫ్ ఇన్​కంప్లీట్​ అనిపిస్తుంది. మిమ్మల్ని ప్రేమిస్తూ అర్థం చేసుకునేవారుంటే మీ లైఫ్ ఎంత బాగుంటుందో.. అర్థం చేసుకోకుండా ప్రేమించేవాళ్లతో మీరు అంతే కాంప్రమైజ్ అయి జీవించాల్సి వస్తుంది. లేదంటే వారిని బాధపెట్టడం ఎందుకు అని మీరు సఫర్​ అయితూ ఉండాల్సి వస్తుంది. ఏదో రోజు అవన్నీ మీలో ఉద్ధృతాన్ని సృష్టించి.. అలజడిని రేపుతాయి. అప్పుడు మీ మాటలు మీ కంట్రోల్​లో కూడా ఉండవు. ఇక అవి ఇతరులను మీకు శాశ్వతంగా దూరం చేస్తాయి.

WhatsApp channel

సంబంధిత కథనం