Masala Hot Chocolate Recipe : టేస్టీ టేస్టీ మసాలా హాట్ చాక్లెట్..
Masala Hot Chocolate Recipe : సాయంత్రం స్వీట్ కోరికను దూరం చేస్తూ.. టీ ఫీల్ కావాలి అంటే.. మీరు మసాలా హాట్ చాక్లెట్ని ట్రై చేయాల్సిందే. దీనిని తయారు చేయడం చాలా సులభం.
మసాలా హాట్ చాక్లెట్
Masala Hot Chocolate Recipe : శీతాకాలంలో మగతగా అనిపిస్తూ ఉంటుంది. సాయంత్రం నుంచే స్లీపీ ఫీల్ వచ్చేస్తుంది. అందుకే సాయంత్రం చాలామంది టీ తాగుతూ ఉంటారు. దానిలో మీరు కూడా ఒకరు అయితే.. మీ టీ, స్నాక్ని కలిపే ఓ కాంబినేషన్ ఉంది. అదే మసాలా హాట్ చాక్లెట్. దీనిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటూ తాగుతారు. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* పాలు - 2 కప్పులు
* ఏలకులు - 4
* లవంగాలు -4
* దాల్చిన చెక్క - 1
* కోకో పౌడర్ - 4 టేబుల్ స్పూన్లు
* చక్కెర - 2 స్పూన్స్
మసాలా హాట్ చాక్లెట్ తయారీ విధానం
పాన్‌లో పాలు, మసాలా దినుసులు వేసి బాగా మరిగించాలి. దానిపై మూత వేసి 2-3 నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం కోకో పౌడర్ వేసి.. చక్కెర వేసి బాగా కలిపి.. సర్వ్ చేసుకోవాలి. అంతే మసాలా హాట్ చాక్లెట్ రెడీ.
సంబంధిత కథనం