Natural Hair colour: తెల్ల జుట్టును నల్లగా, కొత్త తెల్ల జుట్టు రాకుండా చేసే నేచురల్ హెయిర్ కలర్-make this chemical free natural hair colour at home which stops grey hair ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Natural Hair Colour: తెల్ల జుట్టును నల్లగా, కొత్త తెల్ల జుట్టు రాకుండా చేసే నేచురల్ హెయిర్ కలర్

Natural Hair colour: తెల్ల జుట్టును నల్లగా, కొత్త తెల్ల జుట్టు రాకుండా చేసే నేచురల్ హెయిర్ కలర్

Koutik Pranaya Sree HT Telugu
Oct 06, 2024 07:59 AM IST

Natural Hair colour: తెల్ల జుట్టును దాచుకోడానికి పదే పదే రసాయనాలున్న హెయిర్ కలర్స్ వాడుతున్నారా? వాటివల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంట్లోనే ఇలా నేచురల్ హెయిర్ కలర్ తయారు చేసేయండి.

నేచురల్
నేచురల్ (shutterstock)

ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్య సర్వసాధారణం. వయసుతో సంబంధం లేకుండా కొందరిలో చిన్న వయస్సులోనే.. చెప్పాలంటే 20 సంవత్సరాల వయస్సు నుంచీ తెల్ల జుట్టు కనిపిస్తోంది. ఈ తెల్ల జుట్టును కవర్ చేయడానికి హెయిర్ కలర్ ఉపయోగించడం వల్ల జుట్టు మరింత తెల్లబడుతుంది. జుట్టు ఆరోగ్యమూ దెబ్బతింటుంది. అందుకే ఇలా నేచురల్ డైని రాసుకుంటే తెల్ల జుట్టు నల్లబడుతుంది. కొత్తగా తెల్లజుట్టు రాకుండానూ ఉంటుంది. ఇంట్లో నేచురల్ హెయిర్ డై లేదా హెయిర్ కలర్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

నేచురల్ హెయిర్ డై కోసం కావాల్సినవి:

ఈ ఆరోగ్యకరమైన నేచురల్ డై తయారీకి నాలుగు పదార్థాలుంటే చాలు. అయితే ఇవి ఒక్కసారి తెచ్చుకున్నారంటే రెగ్యులర్‌గా సులభంగా వాడుకోవచ్చు.

మూడు నుండి నాలుగు టీస్పూన్ల కలోంజి గింజలు

ఒక టీస్పూన్, ఉసిరి పొడి

ఒక టీస్పూన్ ,భృంగరాజ్ పౌడర్

కొబ్బరి నూనె

నేచురల్ హెయిర్ డై తయారీ:

  1. కొబ్బరి నూనెను అరచెంచాడు ఒక ప్యాన్ లో తీసుకుని అందులో కలోంజి విత్తనాలను వేసుకుని వేయించాలి.

2. ఇప్పుడు ఈ కలోంజి గింజల మెత్తని పేస్ట్ తయారు చేయండి.

3. ఈ పేస్ట్ లో ఉసిరి పొడి, భృంగరాజ్ పౌడర్ సమాన పరిమాణంలో కలపాలి.

4.ఇది మరీ ముద్దగా ఉంటే కాస్త కొబ్బరి నూనె కలుపుకోండి.

5. ఇవన్నీ కనీసం పావుగంట సేపు పక్కన పెట్టుకోండి.

6. అంతే నేచురల్ హెయిర్ డై తయారీ అయినట్లే. దీన్ని తెల్ల జుట్టుతో పాటే జుట్టంతా రాసుకోవచ్చు.

7. కనీసం రెండు మూడు గంటల పాటూ ఆగి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరిపోతుంది.

* ఈ నేచురల్ హెయిర్ కలర్ ను వారానికి కనీసం రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల తెల్ల వెంట్రుకలు తగ్గుముఖం పడతాయి. దీంతో కొత్త జుట్టు కూడా తెల్లబడటం ఆగిపోతుంది. అలాగే అప్పటికే ఉన్న తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి.

Whats_app_banner