Amla in Periods: పీరియడ్స్ సమయంలో కచ్చితంగా ఒక ఉసిరికాయను తినండి, ఇది చేసే మేలు ఎంతో
Amla in Periods: మహిళలు పీరియడ్స్ సమయంలో కచ్చితంగా ఉసిరికాయలను తినడం అలవాటు చేసుకోవాలి. ఇది వారి ఆరోగ్యాన్ని కాపాడుతుంది వైద్య కోణంలో చూస్తే పీరియడ్స్ సమయంలో ఉసిరికాయలను తినడం వల్ల రక్తహీనత సమస్య రాదు.
Amla in Periods: మహిళల్లో పీరియడ్స్ అనేవి ఎంతో ముఖ్యమైనవి. ప్రతినెలా సక్రమంగా రుతు చక్రం వస్తేనే వారి పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నట్టు. పీరియడ్స్ సమయంలొ రక్తస్రావం అధికంగా ఉంటుంది. అందుకే మహిళలు త్వరగా రక్తహీనత సమస్య బారిన పడుతూ ఉంటారు. పీరియడ్స్ సమయంలో ప్రతిరోజూ ఉసిరికాయను తినడం వల్ల రక్తహీనత సమస్య బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
ఉసిరికాయ ఎందుకు తినాలి?
ఉసిరికాయను ఇండియన్ గూస్బెర్రీ అంటారు. దీనిలో ఐరన్, విటమిన్ సి నిండుగా ఉంటాయి. ఇది ఇనుము లోపాన్ని తగ్గిస్తుంది. ఉసిరికాయలో విటమిన్ బి, విటమిన్ బి5, విటమిన్ బి2, విటమిన్ బి1, విటమిన్ బి6 ఉంటాయి. అలాగే కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది.రుతసమయంలో మహిళల్లో ఎన్నో పోషకా లోపాలు వస్తాయి. ఆ పోషక లోపాలు రాకుండా ఉసిరికాయ కాపాడుతుంది. ముఖ్యంగా కోల్పోయిన ఇనుమును తిరిగి అందిస్తుంది. దీని వల్ల వారు ఎనీమియా బారిన పడకుండా ఉంటారు.
ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఇది ఇనుమును ఎక్కువగా శోషించుకునేలా చేస్తుంది. ఎప్పుడైతే ఇనుము శోషణ పెరుగుతుందో, రక్తహీనత సమస్య కూడా రాకుండా ఉంటుంది. రుతుస్రావం సమయంలో ఐరన్‌ను అధికంగా నష్టపోయే మహిళలు ఖచ్చితంగా ఉసిరికాయను తినాలి.
ఉసిరికాయని తినడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరికాయను రోజుకొకటి తింటే రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది. శరీరానికి కావాల్సిన ఇనుము అందుతుంది. ఐరన్ సప్లిమెంట్లతో పోలిస్తే రోజుకో ఉసిరికాయ తినడమే ఉత్తమం. ఉసిరికాయలతో ఇతర ఆహారాలను తయారు చేసుకోవచ్చు. అలా ఆహారాలుగా వండుకుని తినే బదులు ఉసిరికాయను నేరుగా తింటేనే ఎక్కువ ఫలితాలను పొందుతారు.
పీరియడ్స్ తో తినాల్సిన ఆహారాలు
నెలసరి సమస్యల వల్ల వచ్చే ఇనుము లోపాన్ని తగ్గించుకోవాలంటే ఉసిరిని తినడమే బెస్ట్ రెమెడీ అని చెబుతున్నారు .వైద్యులు ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని వివరిస్తున్నారు. అలాగే లీన్ ప్రోటీన్ ఉన్న మాంసాలు, బీన్స్, కాయ ధాన్యాలు, ఆకుకూరలు వంటివి కూడా అధికంగా తినడం వల్ల ఇనుము లోపాన్ని అధిగమించవచ్చని వివరిస్తున్నారు.
పీరియడ్స్ సమయంలో తినకూడని ఆహారాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఆల్కహాల్, స్పైసీ ఫుడ్స్ వంటివి చాలా వరకు తగ్గించుకోవాలి. లేకుంటే గ్యాస్ ఉబ్బరం వంటివి వచ్చే అవకాశం ఉంది.