Alu roast: స్పైసీ పొటాటో రోస్ట్ ఇలా చేసేయండి, సాయంత్రానికి వేడి వేడి స్నాక్ రెసిపీ-make baby potato roast or fry for evening snacks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alu Roast: స్పైసీ పొటాటో రోస్ట్ ఇలా చేసేయండి, సాయంత్రానికి వేడి వేడి స్నాక్ రెసిపీ

Alu roast: స్పైసీ పొటాటో రోస్ట్ ఇలా చేసేయండి, సాయంత్రానికి వేడి వేడి స్నాక్ రెసిపీ

Koutik Pranaya Sree HT Telugu
Oct 29, 2024 03:30 PM IST

Alu roast: స్పైసీగా రుచిగా ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే ఇలా బేబీ పొటాటో రోస్ట్ చేసుకోండి. పిల్లలకు స్నాక్ లాగానూ, లంచ్ బాక్స్ లోకి పెట్టిచ్చేయొచ్చు. ఈ సింపుల్ స్నాక్ రెసిపీ తయారీ చూసేయండి.

బేబీ పొటాటో రోస్ట్
బేబీ పొటాటో రోస్ట్

బేబీ పొటాటో లేదా ఇంట్లో కాస్త చిన్న సైజు బంగాళదుంపలే మిగిలిపోయినా ఈ పొటాటో రోస్ట్ చేయొచ్చు. ఒక్కోటి నోట్లో పెట్టుకుని స్నాక్ లాగా తినేయొచ్చు. రుచిగా బేబీ పొటాటో రోస్ట్ రావాలంటే ఈ కొలతలు ఫాలో అయిపోండి. కావాల్సిన పదార్థాలేంటో చూడండి.

బేబీ పొటాటో రోస్ట్ కోసం కావాల్సిన పదార్థాలు:

పది బేబీ పొటాటో

2 చెంచాల నూనె

పావు టీస్పూన్ జీలకర్ర

పావు టీస్పూన్ ఆవాలు

చిటికెడు ఇంగువ

కరివేపాకు రెమ్మ

1 ఉల్లిపాయ సన్నటి ముక్కల తరుగు

అరచెంచాడు అల్లం వెల్లుల్లి ముద్ద

పావు టీస్పూన్ పసుపు

అరచెంచాడు కారం

అర చెంచా ధనియాల పొడి

అర చెంచా గరం మసాలా

అర చెంచా ఉప్పు

బేబీ పొటాటో రోస్ట్ తయారీ విధానం:

  1. ముందుగా ప్రెజర్ కుక్కర్లో బంగాళాదుంపలు తొక్కతో సహా వేసుకుని మునిగేటన్ని నీళ్లు, కాస్త ఉప్పు వేసి ఉడికించుకోండి. రెండు విజిల్స్ వస్తే చాలు.
  2. చల్లారాక తొక్క తీసుకుని పక్కన పెట్టుకోండి.
  3. కడాయి పెట్టుకుని వేడెక్కాక అందులో రెండు చెంచాల నూనె పోసుకుని ఉడికించుకున్న బంగాళాదుంపల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి.
  4. రంగు మారిపోయి బయట కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి.
  5. వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి.
  6. అదే కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మినపనప్పు, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టండి.
  7. అవన్నీ వేగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి.
  8. అవి కాస్త రంగు మారగానే కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న బంగాళదుంపల్ని కూడా వేసి కలుపుకోండి.
  9. మసాలా బాగా పట్టేలా చూడండి. ఇష్టం ఉంటే కాస్త కొత్తిమీర తరుగు చల్లుకుని దింపేసుకుంటే బేబీ పొటాటో రోస్ట్ రెడీ అయినట్లే.

Whats_app_banner