Beautiful Baby Names: మీ పాప లేదా బాబుకు అందమైన పేర్ల కోసం వెతుకుతున్నారా? చక్కటి అర్ధమున్న పేర్లు ఇవిగోండి
Beautiful Baby Names: మీ ఇంటికి ఒక చిన్న బాబో, పాపో వస్తున్నట్లయితే వారికి మీరు అందమైన పేరు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యేకమైన అర్థం ఉన్న కొన్ని పేర్లను ఇక్కడ మేము ఇచ్చాము.
ఇంట్లో బిడ్డ పుట్టగానే తల్లిదండ్రుల బాధ్యతలు మరింత పెరుగుతాయి. ముందుగా ప్రతి తల్లీదండ్రీ చేసే పని తమ బిడ్డకు చక్కటి పేరు పెట్టాలనుకోవడం. ఇందుకోసం అర్థవంతమైన పేర్లను వెతుకుతూ ఉంటారు. ఆ పేరు ఆధునికంగా ఉండడంతో పాటూ, అందంగా ఉండాలని కూడా కోరుకుంటారు. ఒక బిడ్డకు పేరు వెతకాలంటే తల్లిదండ్రులే కాదు, కుటుంబం మొత్తం కలిసి పనిచేస్తుంది. హిందూ శాస్త్రాలు చెబుతున్న ప్రకారం, పిల్లల పేరు కూడా అతని జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అందుకే చక్కటి పేర్లను ఎంపిక చేసి పిల్లలకు పెట్టాలి. మీ ఇంటికి చిన్న అతిథి త్వరలో మీ ఇంటికి వస్తున్నట్లయితే, దీని కోసం మీరు అందమైన, ప్రత్యేకమైన అర్థం గల పేరు కోసం చూస్తున్నట్లయితే, ఇక్కడ మేము కొన్ని బేబీ నేమ్ లిస్ట్ ఇచ్చాము. ఈ జాబితా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
హిందూ బేబీ బాయ్ పేర్లు, వాటి అర్థాలు
అహన్ - ఉదయం, సూర్యోదయం, మొదటి కాంతి కిరణాలు
ఇషాన్ - శివుడు, సూర్యనామం
ఇభాన్ - గణేషుడు
ఐడెన్ - శక్తివంతమైనవాడు
రేయాన్ష్ - కాంతి కిరణం
వేదస్ - హిందూమతంలోని చట్టాలు
ఆదాన్ - మొదటి వ్యక్తి
ఆదిక్ - గొప్ప వ్యక్తి
ఆస్తిక్ - దేవుడిని నమ్మే వ్యక్తి
ఆయుష్ - ఎక్కువ కాలం జీవించే వ్యక్తి
శ్రీయాన్ష్ - లక్ష్మీ దేవి అంశతో జన్మించిన వ్యక్తి
శ్రీయాన్ - విష్ణువు
ఆరవ్ - శాంతియుతమైన వ్యక్తి
చార్విక్ - తెలివైన వ్యక్తి
దివిత్ - చావు లేని వ్యక్తి, చిరంజీవి
హిరణ్ - బంగారం
ఇవాన్ - దేవుడి బహుమతి
మేఘన్ - మేఘం
హిందూ బేబీ గర్ల్ పేర్లు, వాటి అర్థాలు
అధీర - బలవంతురాలు
ఆద్యశ్రీ - మొదటి శక్తి
ఆధ్యవి - యువరాణి
అద్రిక - పర్వతాలు, స్వర్గంలోని అప్సర
తనూ - కోమలమైన వ్యక్తి
టార్ని - భూమి
నోవా- లాటిన్ భాషలో ఈ పేరుకు శక్తివంతమైన అని అర్థం
జియా - హృదయం లేదా అత్యంత ప్రియమైన వ్యక్తి అని అర్థం
ఇబా- గర్వం
ఆన్యా - చక్కని చుక్క
ఆదర్శిని - ఆదర్శవంతమైన వ్యక్తి
యువిక - యువతి
జెనీషా - దయగల వ్యక్తి
విరాళి - ఉన్నతమైన వ్యక్తి
వరుష్క - ఆనందాన్ని ఇచ్చే వ్యక్తి
టాపిక్