Late Marriage: లేట్ మ్యారేజ్ వల్ల అనర్థాలే కాదు, లాభాలు కూడా ఉన్నాయి, ఆ ప్రయోజనాలేంటో తెలుసుకోండి
30 ఏళ్ళ వయసులో వివాహం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు: పూర్వకాలంలో బాల్య వివాహం దంపతుల మధ్య పరస్పర అవగాహనను పెంచుతుందని ప్రజలు నమ్మేవారు, కాని మారుతున్న ఆలోచనా విధానం ఉన్న యువత అలా నమ్మరు. 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
భారతదేశంలో ప్రస్తుతం వివాహానికి చట్టబద్ధమైన వయస్సు అబ్బాయిలకు 21 సంవత్సరాలు, అమ్మాయిలకు 18 సంవత్సరాలు. మారుతున్న కాలం వల్ల యువత ఆ వయసుకు పెళ్లి చేసుకోవడం లేదు. ఒకప్పుడు మాత్రం పెళ్లి వయసు రాకముందే ఇళ్లల్లో పెళ్లి చేసేవారు. చదువు విలువ తెలిసిన తరువాత యువత పెళ్లి వయసును పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఉద్యోగాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి పోటీ పడుతున్నారు. దీంతో కెరీర్ కోసం ఎంతో మంది పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు.
యువత ఆలోచనలో చాలా మార్పును తీసుకువచ్చింది వారి కెరీర్. ఇప్పుడు చాలా మంది యువత 30 ఏళ్లు వచ్చాకే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మరికొంతమందైతే 30 ఏళ్లు దాటాక కూడా పెళ్లి చేసుకోవడం లేదు. పూర్వకాలంలో, బాల్య వివాహాలు చేసేవారు. ఇలా చేయడం వల్ల జంటల మధ్య పరస్పర అవగాహనను పెరుగుతుందని, వారి సంబంధంలో పరిపక్వతను తెస్తుందని అప్పట్లో ప్రజలు నమ్మేవారు. కానీ ఇప్పుడు మారుతున్న ఆలోచనా విధానం యువత అలా నమ్మడం లేదు. 30 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అని భావిస్తున్నారు.
ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల సంతానోత్పత్తి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. వారికి ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతూ ఉంటుందని పరిశోధకులు చెప్పాయి. అయితే 30 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోకపోవడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి.
లేట్ మ్యారేజ్ వల్ల లాభాలు
30 సంవత్సరాల వయస్సు వరకు వివాహం చేసుకోకపోవడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ఆ విషయాన్ని గ్రహించే యువత పెళ్లిని వాయిదా వేస్తున్నారు. 30 ఏళ్లకు ఆర్థికంగా స్థిర పడవచ్చు. జీవితంలో విజయం, స్థిరత్వాన్ని సాధించడానికి ఆ సమయం పడుతుంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే మీ కుటుంబానికి సౌకర్యాలను అందించడానికి మీరు కష్టపడవచ్చు. అందుకే జీవితంలో, కెరీర్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు. 30 ఏళ్ల వయసు వచ్చేసరికి దాదాపు ప్రతి ఒక్కరూ తమ కెరీర్ లో నిలకడగా ఉంటారు. కెరీర్ లో స్థిరత్వం వచ్చిన తర్వాతే ఆర్థిక పరిస్థితి బలపడుతుంది, ఇది విజయవంతమైన వైవాహిక జీవితానికి చాలా ముఖ్యం.
వయసు పెరిగే కొద్దీ మనిషి ఆలోచనల్లో చాలా మార్పు వస్తుంది. 20 ఏళ్ల కుర్రాడి కంటే 30 ఏళ్ల కుర్రాడు మానసికంగా పరిణతి చెందుతాడు. అటువంటి వ్యక్తి తన జీవిత భాగస్వామి విషయంలో అన్ని అవసరాలను బాగా అర్థం చేసుకుంటాడు. ఇది వారి సంబంధాన్ని బలోపేతం చేస్తుంది.
చాలా సందర్భాలలో, మీరు ఎంత త్వరగా వివాహం చేసుకుంటే అంత త్వరగా పిల్లలను కలిగి ఉంటారు. దీని వల్ల ఒత్తిడి పెరుగుతుంది. వారికి కావల్సిన అవసరాలు తీర్చడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కానీ 30 ఏళ్లు దాటిన వారిలో సొంత నిర్ణయాలు తీసుకోగలరు. దీనివల్ల త్వరగా పిల్లల్ని కనాలనే ఒత్తిడి ఉండదు.
డబ్బును సక్రమంగా ఉపయోగించడం
మొదటి ఉద్యోగం 23 నుంచి 24 సంవత్సరాల వయసులో వస్తుంది. తన కోరికలను తీర్చడానికి తన జీతాన్ని ఖర్చు చేయాలనుకుంటాడు. కానీ 30 ఏళ్ళు దాటిన తరువాత, ఆ వ్యక్తి డబ్బును సక్రమంగా ఉపయోగించడం నేర్చుకుంటాడు. తద్వారా అతను విచ్చలవిడిగా ఖర్చు చేయడాన్ని నివారించుకుంటాడు.