Krishna Janmashtami 2022 : ఈరోజు కృష్ణాష్టమి చేసుకోవచ్చు.. ఉపవాసం ఉండవచ్చు.. ఎందుకంటే-krishna janmashtami puja timings and history of krishna birth ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Krishna Janmashtami 2022 : ఈరోజు కృష్ణాష్టమి చేసుకోవచ్చు.. ఉపవాసం ఉండవచ్చు.. ఎందుకంటే

Krishna Janmashtami 2022 : ఈరోజు కృష్ణాష్టమి చేసుకోవచ్చు.. ఉపవాసం ఉండవచ్చు.. ఎందుకంటే

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 19, 2022 07:38 AM IST

Krishna Janmashtami 2022 : హిందువుల పండుగ జన్మాష్టమి కృష్ణుడి జన్మను సూచిస్తుంది. అయితే కృష్ణాష్టమిని ఏ రోజు చేసుకోవాలో అనేదానిపై చాలామందికి కన్​ఫ్యూజన్ ఉంది. అయితే పండుగను ఈరోజు చేసుకోవచ్చో లేదో.. అసలు కృష్ణుడు ఎలా జన్మించాడు.. ఎక్కడ పెరిగాడు వంటి విషయాలు ఇప్పుడు తెలుసకుందాం.

<p>కృష్ణ జన్మాష్టమి</p>
కృష్ణ జన్మాష్టమి

Krishna Janmashtami 2022 : కృష్ణ జన్మాష్టమి పవిత్రమైన పండుగ. దీనిని భారతదేశం అంతటా భక్తులు పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటారు. అయితే రాఖీకి సందిగ్ధం వచ్చినట్లే.. ఈ సంవత్సరం కృష్ణాష్టమి పండుగలో కూడా సందిగ్ధం వచ్చింది. భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు జన్మాష్టమి జరుపుకుంటారు. వేద కాలమానం ప్రకారం ఈ సంవత్సరం శ్రీకృష్ణుని 5249వ జయంతి. అయితే కృష్ణ జన్మాష్టమి ఆగస్టు 18న లేక 19వ తేదీనా అనే అయోమయంలో ప్రజలు ఉన్నారు. దృక్ పంచాంగ్ ప్రకారం కృష్ణ జన్మాష్టమి వరుసగా రెండు రోజులు వస్తుంది. అష్టమి తిథి ఆగస్టు 18 రాత్రి 9.20 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 19 రాత్రి 10.59 గంటలకు ముగుస్తుంది. కాబట్టి రెండు రోజులు పండుగ చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు కూడా జన్మాష్టమి చేసుకోవచ్చు. ఉపవాసం ఆచరించవచ్చు.

కృష్ణుడి జననం గురించి పురాణాలు ఏమంటున్నాయంటే..

Krishna Birth History : కృష్ణుడు.. విష్ణు మూర్తి అవతారం అని హిందువులు భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం విష్ణువు మానవ అవతారమైన కృష్ణుడు రూపంలో జన్మించాడని భావిస్తారు. ఈ రోజున మథుర రాక్షస రాజు, సద్గుణ తల్లి దేవకి సోదరుడు కంసను నాశనం చేయడానికి కృష్ణుడు జన్మించాడు. కృష్ణుడు భాద్రపద మాసంలో (ఆగస్టు-సెప్టెంబర్) చీకటి పక్షంలోని ఎనిమిదవ (అష్టమి) రోజున మధురలో దేవకి, వసుదేవులకు జన్మించాడు.

కృష్ణుడు జన్మించిన సమయంలో మధురను అతని మేనమామ, రాజు కంసుడు పరిపాలించాడు. అతను తన సోదరి పిల్లలను చంపాలనుకుంటాడు. ఈ జంట ఎనిమిదవ కుమారుడు కంసుని పతనానికి కారణమవుతాడని జోస్యం కారణంగా దేవకి, వసుదేవులను చేరసాలలో వేస్తాడు. అలానే వారి మొదటి ఆరుగురు పిల్లలను కూడా చంపేస్తాడు.

అయితే వారి ఏడవ బిడ్డ బలరామ్ పుట్టిన సమయంలో.. పిండం దేవకి గర్భం నుంచి యువరాణి రోహిణికి మార్మికంగా బదిలీ చేస్తారు. వారి ఎనిమిదవ సంతానమైన కృష్ణుడు జన్మించినప్పుడు.. రాజభవనం మొత్తం నిద్రలోకి జారుకుంటుంది. వాసుదేవుడు శిశువును బృందావనంలోని నంద్ బాబా, యశోధ ఇంటికి తీసుకువెళ్తాడు.

బిడ్డను మార్పిడి చేసి.. వాసుదేవుడు ఒక ఆడ శిశువుతో రాజభవనానికి తిరిగి వచ్చి ఆమెను కంసుడికి అప్పగించాడు. దుష్ట రాజు శిశువును చంపడానికి ప్రయత్నించినప్పుడు.. ఆమె దుర్గగా రూపాంతరం చెంది.. అతని రాబోయే వినాశనం గురించి హెచ్చరిస్తుంది. ఈ విధంగా కృష్ణుడు బృందావనంలో పెరిగి పెద్దవాడై.. తరువాత అతని మామ అయిన కంసుడిని చంపేస్తాడు.

Whats_app_banner

సంబంధిత కథనం