Krishna Janmashtami 2022 Fasting Rules : కృష్ణాష్టమి ఉపవాస నియమాలు ఇవే.. ఫాలో అవ్వండి..
Krishna Janmashtami 2022 : కృష్ణాష్టమి హిందూ పురాణాలలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. అందుకే ప్రపంచంలోని కృష్ణభక్తులు దీనిని గొప్పగా జరుపుకుంటారు. ఆలయాలు, గృహాలను అలంకరించి.. కృష్ణుడిని పూజిస్తారు. కొంతమంది భక్తులు ఈ రోజు 24 గంటలు ఉపవాసం చేస్తారు. అయితే ఈ ఉపవాసంచేసేప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. అవి ఏంటంటే..
Krishna Janmashtami 2022 : భారతదేశంలో హిందువులు జరిపే అత్యంత ప్రసిద్ధ, పవిత్రమైన పండుగలలో కృష్ణ జన్మాష్టమి ఒకటి. విష్ణువు ఎనిమిదవ అవతారంగా పరిగణించే శ్రీకృష్ణుని జన్మదినోత్సవం సందర్భంగా దీనిని చేసుకుంటారు. కృష్ణాష్టమి 2022.. ఆగస్టు 18, 2022 గురువారం ప్రారంభమై.. 19 ఆగస్టు 2022 శుక్రవారంతో ముగుస్తుంది.
శ్రావణమాసంలో వచ్చే కృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని చాలా మంది చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా, భౌతికంగా ప్రయోజనం పొందుతారని భక్తులు భావిస్తారు. కృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని ఆచరించే వారు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతారని, సంపదను పొందుతారని నమ్ముతారు. వ్రతంలో భాగంగా ఉపవాసం చేస్తారు. కృష్ణ జన్మాష్టమి ఉపవాసం మోక్షాన్ని సాధించడానికి ముడిపడి ఉందని అందుకే దీనిని మోక్షం అని కూడా పిలుస్తారని పురాణాలు చెప్తున్నాయి. అయితే జన్మాష్టమి రోజున ఉపవాసం ఉండేటపుడు మీరు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. త్వరగా నిద్ర లేవండి
జన్మాష్టమి అంటే ఎవరైనా తమ ఆరోగ్యంతో పాటు మానసిక, శారీరక శ్రేయస్సును మెరుగుపరచడానికి పొద్దున్నే లేవాల్సిన సమయం. ఇది రోజును సరిగ్గా ప్రారంభించడంలో మీకు సహాయపడుతుంది. అంతేకాకుండా మీ రోజువారీ పనులను ముందుగానే షెడ్యూల్ చేయడానికి అనుమతిస్తుంది. ముహూర్తంలో పూజలు, కర్మలు చేయడానికి వీలుగా ముందుగానే లేవడం మంచిది.
2. ఆహారం, బట్టలు దానం చేయండి
అన్నదానం, బట్టలు దానం చేయడం గొప్ప కార్యం. ఇది సానుకూలత, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. శ్రీకృష్ణుడు విష్ణువు 8వ అవతారమని నమ్ముతారు. కృష్ణుడు ఎప్పుడూ వివక్ష చూపలేదని, ఎల్లప్పుడూ ప్రజలకు సహాయం చేసేవాడని భక్తులు నమ్ముతారు. కాబట్టి జన్మాష్టమి సందర్భంగా ప్రజలు అవసరమైన వారికి తోచినది దానం చేయాలి.
3. సాత్వికమైన భోజనం తీసుకోండి
జన్మాష్టమి నాడు సాత్వికమైన భోజనం మాత్రమే చేయాలని భక్తులు నమ్ముతారు. ఈ రోజున వెల్లుల్లి, ఉల్లిపాయలను ఆహారంలో ఉపయోగించకూడదు. ఎందుకంటే వెల్లుల్లి, ఉల్లిపాయలను తామసిక్ వర్గంలో ఉంచుతారు. మాంసం, మద్యం సేవించకూడదు.
4. జంతువులను బాధించవద్దు
శ్రీకృష్ణుడు జంతువులను ప్రేమిస్తాడని మన అందరికీ తెలుసు. ఆయనకు ఆవులంటే చాలా ఇష్టం. చిన్నతనంలో ఆవుల కాపరితో కలిసి ఆవు మేతకు వెళ్లేవాడని పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల జంతువులను బాధించవద్దు. జన్మాష్టమి రోజున జంతువులకు ఆహారం ఇవ్వండి. పక్షులకు నీరు పెట్టండి.
5. టీ లేదా కాఫీ
ఉపవాసం ఉన్నప్పుడు చాలా మంది శరీరం చురుకుగా ఉండటానికి టీ లేదా కాఫీని తీసుకుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రెండు పానీయాలు ఆమ్లత్వానికి దారితీస్తాయి. ఉపవాసం ఉన్నప్పుడు అసౌకర్యం, భారం, తలనొప్పిని కలిగించవచ్చు. కాబట్టి వాటిని తీసుకోవడం మానేయాలి. వాటికి బదులు తాజా జ్యూస్‌లు లేదా కొబ్బరి నీళ్లను తీసుకోవచ్చు.
6. నాన్ వెజ్ ఫుడ్‌కు నో
హిందూ పండుగలలో ఎక్కువ భాగం పండ్లు, శాఖాహార విందులతోనే చేస్తారు. ఉపవాస సమయంలో మాంసం లేదా ఇతర మాంసాహారం కలిగిన భోజనాలు పూర్తిగా నిషేదించాలి.
7. పాలు, పెరుగు
జన్మాష్టమి వేడుకలకు పాలు, పెరుగు తినడం చాలా అవసరం. అవి లేనిదే పండుగ అసంపూర్ణం. మీరు ఉపవాసం ఉన్నప్పుడు తాజా పండ్ల షేక్స్‌లో మునిగిపోవచ్చు లేదా మీరు తీపి లస్సీ, మజ్జిగ లేదా రోజ్ మిల్క్‌ను తాగవచ్చు.
సంబంధిత కథనం